Breaking News

అక్షరాస్యతతోనే ఆదర్శగ్రామం…

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా

నిజామాబాద్‌,  నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామస్థాయిలో 18 నుంచి ప్రభుత్వ సిబ్బంది వివిధ హోదాల్లో విదులు నిర్వహిస్తారని వారితో ప్రజలకు కావాల్సిన పనులు చేయించుకునే బాధ్యత గ్రామ ప్రజలదేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు.

మంగళవారం నందిపేట మండలం నారాయణపూర్‌ గ్రామ సభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. సాక్షరభారతి కేంద్రాల్లో వయోజన విద్యనేర్చుకోవాలని, రాత్రిపూట చదువుకోవాలని ఎన్ని పనులున్నా అక్షర జ్ఞానం పెంపొందించుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. తద్వారా మన పిల్లలకు పాఠశాలలో ఎంతమేరకు చదువుకుంటున్నారో మనకు తెలుస్తుందని అన్నారు. గ్రామంలో వందమంది మహిళలకు 40 శాతం అక్షరాస్యత లేదని అన్నారు. గత 4 సంవత్సరాల నుండి 53 శాతం మాత్రమే అక్షరాస్యత ఉందని తెలిపారు. ఆదర్శ గ్రామం కావాలంటే వందశాతం అక్షరాస్యత సాధించాలని గ్రామస్తులకు తెలిపారు.

14 సంవత్సరాల నుండి అంగన్‌వాడి  కేంద్రం నడుస్తుందని, గ్రామంలో 6 సంవత్సరాలలోపు పిల్లలు 130 మంది అంగన్‌వాడి కేంద్రాలకు రావడం లేదని తెలిపారు. పిల్లలను అంగన్‌వాడి కేంద్రాలకు పంపితే ఆరోగ్యంగా ఉంటారని పేద ప్రజలకు ప్రబుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగంచేసుకోవాలని అన్నారు. గ్రామస్థాయి ప్రభుత్వ సిబ్బంది పనిచేసే చోటే నివాసముండాలని, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని లేనిపక్షంలో గ్రామస్తులు ఎవరైనా ప్రతిసోమవారం జరిగే ప్రజావాణిలో ఏ మండలం వారైనా తహసీల్‌ కార్యాలయం నుంచి నేరుగా తనతో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బి.సచిన్‌, ఎంఆర్‌ఐ అనిల్‌ కుమార్‌, ఎండివో సాజిద్‌ అలీ, ఎఓ సురేశ్‌గౌడ్‌, ఎంఇవో సచ్చిదానంద్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. అమీర్‌ఖాన్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌డౌన్‌లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందించారు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ క్లబ్‌ డైమండ్‌ ఆధ్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే ...

Comment on the article