Breaking News

డిసెంబరు 18 బహిరంగసభకు మాదిగలు తరలి రావాలి

కామారెడ్డి,  నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఆర్‌పిఎస్‌ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబరు 18వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగసభకు మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని, సభను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ నాయకులు ఇబత్‌వారూ, తుకారాం, వేముల బలరాంలు కోరారు. కామారెడ్డిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

డప్పుకు, చెప్పుకు రెండువేల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌తో సభ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్తిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపి కవితలు హాజరు కానున్నట్టు తెలిపారు. వంగపల్లి శ్రీనివాస్‌ చేపట్టిన డప్పు, చెప్పు పాదయాత్ర 10 జిల్లాల్లో తిరిగిన తర్వాత హైదరాబాద్‌ సభలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మాదిగలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రామస్వామి, సుంకరి శ్రీనివాస్‌, చందు, యాదవరావు, మోతె లింగం, లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Check Also

కురిసింది వాన… కామారెడ్డిలోన….

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం భారీవర్షం కురిసింది. ధీంతో రోడ్లన్నీ జల‌మయమయ్యాయి. ...

Comment on the article