Breaking News

తెయు పరీక్షల షెడ్యూల్‌…

డిచ్‌పల్లి,  నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం వివిధ పరీక్షల తేదీలను విడుదలచేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు డిసెంబరు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆచార్య కనకయ్య తెలిపారు. అదేవిధంగా పిజి సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 15 నుంచి ప్రారంభమయ్యే బిసిఎ 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు యూనివర్సిటీ కళాశాలలో నిర్వహిస్తారని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు.

Check Also

చైనా వస్తువులు బహిష్కరించాలి

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చైనా సైనికులు దొంగచాటుగా జరిపిన దాడిలో భారత ఆర్మీ ...

Comment on the article