Breaking News

బెల్లం వండడం రైతుల హక్కు

 

– సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బెల్లం తయారుచేయడం రైతుల హక్కు అని సిపిఐ (ఎంల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న అన్నారు. బుధవారం కామారెడ్డలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చెరుకు వండవద్దని ఎక్సైజ్‌ అధికారులు రైతులవద్దకెళ్లి బెదిరించడం సమంజసం కాదన్నారు. హరితహారంలో భాగంగా కామారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ కామారెడ్డి గడ్డ బెల్లంకు అడ్డ అని మాట్లాడి ప్రస్తుతం బెల్లం వండితే కేసులు పెడతామని బెదిరించడం గర్హణీయమన్నారు. కోక కోలా, పెప్సీల్లో పురుగుల మందులు కలిపి శీతల పానీయాలు అమ్ముతుంటే పట్టించుకోని అధికారులు చెరుకు రైతులను వేదించడం ఏంటని ప్రశ్నించారు. ప్రయివేటు చక్కర కర్మాగారాలను ప్రోత్సహించడానికి బెల్లం తయారీదారులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించి బెల్లంపై ఆంక్షలు విధించకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో పివైఎల్‌ జిల్లా నాయకుడు దేవిసింగ్‌, ఏఐకెఎంఎస్‌ నాయకులు రవిందర్‌, మహిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article