Breaking News

గోదావరి జలాల సమస్య పరిష్కరించాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో గోదావరి జలాలు సరఫరా సరిగా లేదని, దాన్ని పునరుద్దరించాలని కామారెడ్డి 32వ వార్డు కౌన్సిలర్‌ రామ్మోహన్‌ బుధవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గోదావరి జలాలు పట్టణంలో సరఫరా కావడం లేదన్నారు. దీనివల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌ దృస్టికితీసుకు వచ్చారు. ఈవిషయమై మంగళవారం జరిగిన మునిసిపల్‌ పాలకవర్గ సమావేశంలో బల్దియా ఏ.ఇ. భువనేశ్వర్‌ను వివరణ కోరినా సరైన సమాధానం రాలేదని చెప్పారు. ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Check Also

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు ...

Comment on the article