Breaking News

క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలి

 

– జిల్లా ఎస్పీ శ్వేత

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులు చిన్నప్పటినుంచే క్రీడల్లో రాణించి గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్‌ యువ కో ఆపరేటివ్‌ సొసైటీ ఆద్వర్యంలో 11-12 సంవత్సరాల బాలబాలికలకు అథ్లెటిక్‌ పోటీలను నిర్వహించారు. జెండా ఊపి ప్రారంభించిన అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడాపోటీలు దోహదపడతాయన్నారు. ఎన్‌వైసిఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని క్రీడాకారులుగా గుర్తింపు పొందాలని, క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కో ఆర్డినేటర్‌ బాపురెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్‌రవిందర్‌రెడ్డిలు మాట్లాడుతూ నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్‌ మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఉన్న అథ్లెటిక్‌ క్రీడాకారులకు పోటీలు నిర్వహించామన్నారు. క్రీడాకారుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికితీసి 20-20 ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనేలా వారిని శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్తులను బెంగుళూరులో ఐదురోజుల పాటు శిక్షణ నిర్వహించి అక్కడ నిర్వహించే సౌత్‌ ఇండియా పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారిని జాతీయ స్తాయికి ఎంపికచేసి ఢిల్లీలో శిక్షణ ఇస్తామన్నారు. ఎవరెస్టు అధిరోహించిన పూర్ణ మాట్లాడుతూ తానుకూడా గ్రామీణ స్థాయి నుంచి ఎవరెస్టు వరకు ఎదిగానని అన్నారు. తమను తాము తక్కువ అని భావించకుండా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.

Check Also

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు ...