Breaking News

విద్యార్థుల స్కాలర్‌షిప్‌ గడువు పొడిగించాలి

 

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగించాలని బుధవారం పిడిఎస్‌యు నాయకులు కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి విధానాన్ని చేపట్టడంతో విద్యార్తులు నూతన బ్యాంకు ఖాతాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు చాలా మంది విద్యార్తులకు బ్యాంకు ఖాతాలు లేవన్నారు. నూతన జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో, తద్వారా ఏర్పడిన డివిజన్‌లు, మండలాల ఏర్పాటు వల్ల విద్యార్థులు బ్యాంకు ఖాతాల విషయంలో అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థుళ సమస్యలు దృష్టిలో ఉంచుకొని గడువు తేదీని పొడిగించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు సురేశ్‌, ప్రధాన కార్యదర్శి విఠల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పబ్లిక్‌కు సిస్టం నేర్పాలి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ...

Comment on the article