Breaking News

బోధన వృత్తి సవాళ్లతో కూడుకున్నది

 

– టిటియు – యుఎస్‌ఐ అకడమిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ వాణి

కామారెడ్డి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన వృత్తి అంత సులభమైనది కాదని, సవాళ్లతో కూడుకున్నదని టిటియు – యుఎస్‌ఐ అకడమిక్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ వాణి అన్నారు. కామారెడ్డి కర్సక్‌ బిఇడి కళాశాలలో బుధవారం నిర్వహించిన తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌ కార్యక్రమానికి ఆమెముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సవాళ్లను అధిగమించాలంటే ఉపాధ్యాయుడు 3సి నమూనా గురించి విద్యార్తులకు అవగాహన కల్పించారు. 3సి అంటే జాగ్రత్తలు తీసుకోవడం, క్రమబద్దతతో వ్యవహరించడం, విషయపరిజ్ఞానం, విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధించడం గురించి వివరించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్యగల సంబంధాన్ని ఐడు, వుయ్‌డు, యుడు అనే భావన ద్వారా పెంపొందించుకోవాలని చెప్పారు. విద్యార్థుల ప్రగతిలో కుటుంబం, ఉపాధ్యాయుడు,సమాజం ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. నేటి విద్యావిధానంలో అనుసరిస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, బోధన, అభ్యాసన, సమర్థతను పరిరక్షించడంతో పాటు విద్యార్తుల సమగ్ర అభివృద్దికి దోహదపడుతుందన్నారు. అనంతరం విద్యార్తులకు సంబంధించిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ విశ్వనాథం, ప్రిన్సిపాల్‌ రషీద్‌, అధ్యాపకులు, విద్యార్తులు పాల్గొన్నారు.

Check Also

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు ...

Comment on the article