Breaking News

Monthly Archives: November 2016

డ్వాక్రా గ్రూప్‌ రుణాల మొత్తాన్ని సకాలంలో చెల్లించండి

  బీర్కూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు ఆయా మొత్తాలనుసకాలంలో చెల్లించాలని ఎపిఎం గంగాధర్‌ అన్నారు. ప్రస్తుతం నోట్ల చలామణి దృష్ట్యా రూపాయల విషయంలో అపోహలు పెట్టుకోవద్దని సకాలంలో తమ వద్ద ఉన్న 500, 1000 నోట్లు చెల్లించినా బ్యాంకుల్లో రుణ మాఫీ చెల్లుబడి అవుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం మండల మహిళా సంఘాల సమాఖ్య సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ముఖ్య అతిథిగా కో ఆర్డినేటర్‌ రవిందర్‌ పాల్గొన్నారు. ...

Read More »

తెయులో బాలుర నూతన వసతి గృహాన్ని ప్రారంభించిన వైస్‌చాన్స్‌లర్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో బాలుర నూతన వసతి గృహాన్ని వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థుల, అధ్యాపకుల ఆనందోత్సాహాల మధ్య వైస్‌ఛాన్స్‌లర్‌ రెండో వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం సంప్రదాయబద్దంగా పూజాదికాలు నిర్వహించి, రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కొత్త వసతి గృహం అందుబాటులోకి రావడంతో బాలురకు క్యాంపస్‌లో వసతి కొరత తీరనుందని, నాలుగు వందల మందికి వసతి కల్పించవచ్చని విసి తెలిపారు. ఆధునిక హంగులతో, విశాలమైన గదులతో, ...

Read More »

పారిశుద్య కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లకు ఆహ్వానం..

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అపరిశుభ్ర, పారిశుద్య రంగ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌లో చదువుతున్న అపరిశుభ్ర వృత్తులు చేస్తున్న వారి పిల్లలు, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌, సానిటేషన్‌ వర్కర్స్‌, స్వీపర్లు, కాంట్రాక్టు, పార్ట్‌టైం, దినసరి వేతన, ఫుల్‌టైం పనిచేస్తున్న వారి పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులని పేర్కొన్నారు. వారి పనులకు సంబంధించిన దృవీకరణ పత్రం, సంబంధిత అధికారులతో జారీచేసినవై ...

Read More »

క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు అంగవైకల్యంకలవారు కాదని, వారు దైవాంశులని, వారిని క్రీడల్లో పాల్గొనేలా అందరూ ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 10-17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థిని, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ట్రైసైకిల్‌, 100, 50 మీ.ల పరుగు పందెం, షాట్‌ఫూట్‌, క్యారం, చదరంగం తదితర పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారిని ఈనెల ...

Read More »

కండక్టర్‌ పర్సు మాయం…

  – నిందితుల అరెస్టు కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నుంచి భైంసాకు వెళుతున్న ఆర్టీసి బస్సులో ఏకంగా కండక్టర్‌ మనీ పర్సునే దొంగిలించే ప్రయత్నం చేశారు. చివరకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే… శుక్రవారం నిజామాబాద్‌ నుంచి బైంసాకు బయల్దేరిన ఆర్టీసి బస్సు ఎపి 25 వి 8069 నవీపేట మండలంలోని నాగేపూర్‌ వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అందరు ప్రయాణీకుల్లాగానే బసెక్కారు. కండక్టర్‌ పర్సును దొంగిలించే ప్రయత్నం చేయడంతో బాసర రైల్వేస్టేషన్‌ వద్దకు ...

Read More »

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల పస్తులు..

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబందించి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు పస్తులుంటున్నారని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ఐరేని సందీప్‌కుమార్‌ విమర్శించారు. కామారెడ్డి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు మూడునెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో వారు సమ్మెబాట పట్టారన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం అయినప్పటికి అధికారులు, ప్రభుత్వ పనితీరుతో విద్యార్థులు ఆకలి బాధతో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏజెన్సీలతో చర్చలు జరిపి వారికి ...

Read More »

బీడీ యాజమాన్యాల తీరును నిరసిస్తూ ఆందోళన

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మందికిపైగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారని, బీడీ కార్మికుల అగ్రిమెంట్‌ ముగిసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన అగ్రిమెంట్‌ చేసుకోకుండా యాజమాన్యాలు కాలయాపన చేస్తున్నాయని పేర్కొంటూ శుక్రవారం తెలంగాణ బీడీ రోలర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రతి రెండు ...

Read More »

ప్రియురాలిని భయపెట్టి… వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు

పిచ్చి పలువిధములు అంటే ఇదేనేమో.. స్నేహితులను సరదాగా ఏడిపించాలను కోవడంలో తప్పు లేదు కానీ అది శృతిమించకూడదు… కొన్ని సార్లు ఓ వ్యక్తి సరదాగా చేసే పని మరోకరికి విపరీతమైన భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సరదానే ఇక్కడ జరిగింది. నిద్ర పోతున్న ప్రియురాలిపైన రెండు పెద్ద కొండచిలువలు తెచ్చి పడేసి… భయపెట్టి వీడియో తీశాడు. పైగా ఇది ప్రాక్టికల్ జోక్ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.           డెరెక్ డెస్కో అనే అతను తన గర్ల్ ఫ్రెండ్ నిద్ర ...

Read More »

ఫిజియోథెరపి శిబిరం

  నిజాంసాగర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం ఫిజియోథెరఫి శిబిరం నిర్వహించారు. ఎంఇవో కార్యాలయంలో వైద్యులు డాక్టర్‌ ప్రణీత ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మట్లాడుతూ వికలాంగ విద్యార్థులకు వ్యాయామం ఎలా చేయాలో, తద్వారా అవయవాల్లో ఎలా మార్పు వస్తుందో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం, పిఆర్‌టియు సభ్యులు సునీల్‌, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

చండీ యాగం కోసం స్థలపరిశీలన

  నిజాంసాగర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గుల్‌ గ్రామంలో డిసెంబరు 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న శతచండీయాగానికి శుక్రవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని గోర్గల్‌ గ్రామంలో శ్రీ విఠలేశ్వరస్వామి ఆలయంతోపాటు, ఆంజనేయస్వామి ఆలయంలో మూడురోజుల పాటు వైభవంగా చండీయాగం నిర్వహిస్తున్నట్టు జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు తెలిపారు. మూడురోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే విచ్చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక ...

Read More »

రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అచ్చంపేట సింగిల్‌ విండో ఛైర్మన్‌ డిసిసిబి డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు కామారెడ్డి డిసివోకు నివేదికలు పంపడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలోనే రైతు ఖాతాల్లో డబ్బు జమచేయడం జరుగుతుందన్నారు.

Read More »

ఇసుక అనుమతులు లేకుంటే ట్రాక్టర్లు సీజ్‌ …

  బీర్కూర్‌ నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంజీర పరివాహక ప్రాంతం నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే అట్టి ట్రాక్టర్లను సీజ్‌ చేయడం జరుగుతుందని కామారెడ్డి రెవెన్యూ విజిలెన్సు అధికారి రంజిత్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల గుండా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న ఇసుకను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ అనుమతులు తప్పకుండా పొందాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో మొబైల్‌ స్పాట్‌ టీంగా ప్రతి ...

Read More »

సేంద్రీయ ఎరువుల వల్ల అధిక దిగుబడులు…

  బీర్కూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రీయ ఎరువుల వల్ల అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ ఉప అధికారి శ్రావణ్‌ అన్నారు. రాబోవు రబీ పంటలపై అవగాహన సదస్సు రైతులకు మండలంలోని ఆయా గ్రామాలైన బరంగెడ్గి, కిష్టాపూర్‌, అన్నారం, బైరాపూర్‌, బొప్పాస్‌పల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అదికారి శ్రావణ్‌ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందని, తినే ఆహారంలో విషం చేరే ప్రమాదముందని హెచ్చరించారు. వాణిజ్య పంటలపై ఎక్కువ దృష్టి సారించాలని రైతులకు ...

Read More »

నోట్ల పాట్లు తప్పవు…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌ బ్యాంకుల వద్ద సందడి నెలకొంది. ఇన్నిరోజులైనా 500, 1000 నోట్ల సందడి ఇంకా కొనసాగుతుంది. బ్యాంకుల్లో రోజుకు 2 వేలు మాత్రమే ఇస్తుండడంతో అందుకోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉండగా 2 వేల నోటు చిల్లర కావడం కూడా ఇబ్బందిగా తలెత్తిందని ప్రజలు అంటున్నారు. 2 వేల నోటుతో మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. బ్యాంకుల వద్ద ...

Read More »

సాగర్‌ను అభివృద్ది చేసేదెన్నడో…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు రాష్ట్రాల కూడలిగా తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రాజెక్టుగా నిజాంసాగర్‌ పర్యాటక స్థలాల్లో ముఖ్యమైంది. నిజాం కాలంనాటి అద్బుత కట్టడాలు పర్యాటకుల మదిని దోచుతున్నాయి. పరిసర ప్రాంతంలోని పర్యాటక స్థలాలను గుర్తించి అభివృద్ది చేసేందుకు పథకాన్ని రూపొందించారు. కానీ ఇప్పటివరకు ప్రాజెక్టు, పరిసర ప్రాంతాలు అభివృద్దికి నోచుకోవడం లేదు. ప్రాజెక్టు గేట్లు తెరిచిన సమయంలో వేల సంఖ్యల్లో పర్యాటకులు వస్తుంటారు. కానీ ప్రాజెక్టు పరిసరాల్లో అద్భుత కట్టడాలు ఉన్నప్పటికి వాటికి సరైన ...

Read More »

దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో నిజాంసాగర్‌-నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా వరకు 7 కి.మీ. రహదారిపై లారీలు వెళ్తుంటే ఆటోలు, బైక్‌ వాహన దారులకు దమ్ముపడి ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము వల్ల రోగాలు వస్తాయని వైద్యులు వెల్లడించారు. దుమ్ముతో రోగాల బారినపడి చాలా మంది ఆసుపత్రుల పాలై చికిత్సలు పొందుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి నుంచి చెడిపోయిన ప్రధాన రహదారి దుమ్ము మయం కావడంతో అక్కడి నుండి ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో మంజూరైన కోటి ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణం ఆపాలని డెయిలీ మార్కెట్‌ వ్యాపారుల వినతి…

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డెయిలీ కూరగాయల మార్కెట్‌లో మరుగుదొడ్ల నిర్మాణాలను ఆపాలని మంగళవారం మార్కెట్‌ అసోసియేసణ్‌ ప్రతినిధులు మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్‌ మద్యలో పేదవారు కూర్చొని కూరగాయలు విక్రయించే స్థలంలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మిస్తామని మునిసిపల్‌ అదికారులు అంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్‌ స్థలం చిన్నగా ఉండి తమకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇపుడు అక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తేతాము వ్యాపారం ఎలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తం ...

Read More »

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై సంతకాల సేకరణ

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌లపై విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారంస్థానిక ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాలలో విద్యార్తుల నుంచి సంతకాలు సేకరించారు. ప్రభుత్వం స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర నాయకుడు ఐరేని సందీప్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

హత్యకేసు ఛేదించిన పోలీసులు

  – ఇద్దరి అరెస్టు కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని అడ్లూర్‌ గ్రామ పంచాయతీ పరిదిలో ఈనెల 7న వెలుగుచూసిన హత్యకేసును పోలీసులు చేదించారు. కుటుంబ సభ్యులే కుటుంబ పెద్దను రెండున్నర సంవత్సరాల క్రితం హత్యచేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్యచేసిన వారిలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత మంగళవారం విలేకరులతో వెల్లడించారు. కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గుమాస్తా కాలనీలో బుక్య శంకర్‌ ...

Read More »

క్రిస్మస్‌ పండగకు ఉచిత బట్టల పంపిణీ

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని క్రిస్టియన్లలోని పేదలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలు పంపిణీ చేయనున్నట్టు మైనార్టీ వెల్పేర్‌ రాష్ట్ర అధికారి ఎ.కె.ఖాన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా క్రిస్మస్‌ పండగకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. క్రిస్టియన్లలో పేదలను గుర్తించి వారికి బట్టలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఎండబ్ల్యువో శంకరయ్య, ...

Read More »