Breaking News

Monthly Archives: November 2016

వైభవంగా అయ్యప్ప మండల పూజ

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్ప ఆలయంలో సోమవారం నుంచి మండల పూజ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం ధ్వజారోహణం చేశారు. 41 రోజుల పాటు అయ్యప్పస్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం గణపతి హోమం నిర్వహించి అనంతరం స్వామివారికి అష్టాభిషేకం, మద్యాహ్నం స్వాములకు భిక్ష, పుష్పాభిసేకం, పడిపూజ తదితర కార్యక్రమాలు నిత్యం నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు చీల ప్రభాకర్‌, అయ్యప్ప పూజారులు ఉన్ని కృష్ణన్‌, ...

Read More »

బుధవారం మండలంలో మంత్రి పోచారం పర్యటన

బీర్కూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బరంగెడ్గి, కిష్టాపూర్‌, చించోలి గ్రామాల్లో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ది పనుల శంకుస్తాపనకు విచ్చేస్తున్నారని మండల అధ్యక్షురాలు మల్లెల మీణ, హన్మంతు అన్నారు. మిర్జాపూర్‌ గ్రామంలో వంతెన నిర్మాణ పనులు, కిష్టాపూర్‌, చించోలి గ్రామాల్లో డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులు ప్రారంభిస్తారని, భూమి పూజలు చేస్తారని ఆమె తెలపారు. మండలంలోని తెరాస నాయకులు, అధికారులు ఆయా గ్రామాల ప్రజలు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

ప్రతిఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరి…

  బీర్కూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్క లబ్దిదారుడు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని దామరంచ గ్రామంలో మంగళవారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గ్రామంలో 143 కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని, ప్రస్తుతం 101మరుగుదొడ్లు నిర్మించామని, ఇంకా 42 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని గ్రామసర్పంచ్‌ శంకర్‌కు సూచించారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న గ్రామ సచివాలయాన్ని పునర్నిర్మించాల్సిందిగా గ్రామ ...

Read More »

ఏసిబి వలలో మునిసిపల్‌ ఉద్యోగి…

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి బిల్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవరాజు అనే ఉద్యోగి మంగళవారం 4,500 నగదు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి గత పది సంవత్సరాల క్రితం దుబాయ్‌ వెళ్లి తిరిగి వచ్చి ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇంటికి సంబంధించి పేరు మార్పిడి చేయాలని కొన్నిరోజులుగా శ్రీనివాస్‌ మునిసిపల్‌ కార్యాలయం చుట్టు తిరిగాడు. ...

Read More »

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు ఆర్‌.కె. డిగ్రీ, పిజి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్ఫోసిస్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో కామారెడ్డి ఆర్‌.కె. డిగ్రీ, పిజి విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన నాగరాజు, నిఖిత, సౌజన్యలను మంగళవారం సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్వామా పిడి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ ఇన్పోసిస్‌లో కామారెడ్డి విద్యార్తులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. మిగిలిన విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకొని గ్రూప్స్‌, సివిల్‌ లాంటి కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు సన్నద్దం కావాలని సూచించారు. కళాశాల ...

Read More »

గల్ప్‌ కార్మికుల వద్ద ఇండియా కరెన్సీ

  నందిపేట, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ సభ్యుల పోషణ కొరకు పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ప్‌ దేశాలైన సౌదీ, దుబాయ్‌, ఖతర్‌, కువైన్‌, ఒమన్‌, బెహ్రెయిన్‌ దేశాలకు వలసవెళ్లి అక్కడకార్మికులుగా పనిచేస్తున్న మన తెలంగాణ కార్మికుల వద్ద ఇండియా కరెన్సీ ఆగిపోయింది. పొట్టకూటికోసం గల్ప్‌ దేశాలకు వెళ్తున్నపుడు తమవద్ద ఉన్న రూపాయలుమళ్లీ ఇక్కడికి వాపస్‌వచ్చేటపుడు పనిచేస్తాయనే ముందుచూపుతో కావచ్చు, దేశంపై ప్రేమతో కావచ్చు మన కరెన్సీ రూపాలను తమ పాకెట్‌లో దాచుకుంటారు. సెలవుపై ఇండియా వచ్చేటపుడు ...

Read More »

చలి…చలి…

  నందిపేట, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చలి జనాన్ని వణికిస్తుంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో నందిపేట ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు రాత్రి సమయాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటే వాయిదాలు వేసుకుంటున్నారు. ఉదయం పూట, సాయంత్రం పూట చలి మరీ ఎక్కువగా ఉంటుంది.

Read More »

రైతులకు తప్పని ఇక్కట్లు…

  బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్ల కష్టాలు రైతులను ఇక్కట్లకు గురిచేస్తుంది. నోట్ల కొరత వల్ల రబీసాగును ప్రభావితం చేయగా ఖరీఫ్‌ పంటల విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కష్టాలకోర్చి ఖరీఫ్‌లో సాగుచేసిన పంటల దిగుబడులు ప్రస్తుతం చేతికందుతున్నాయి. వరి దాన్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను నిషేదించడం రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నరైతులు ఇళ్లవద్ద, పొలల వద్దనే ధాన్యం విక్రయిస్తారు. వీరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ...

Read More »

నో క్యాష్‌… ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌…

  నందిపేట, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్లు చెల్లని చిత్తు కాగితాలుగా మారాయి. వాటిని నగదుగా మార్చుకుందామంటే బ్యాంకుల్లో నగదు లేకపోగా ఆంక్షలు, సెలవులు కూడా తోడయ్యాయి. ఏటిఎంలు కూడా ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌.. బ్యాంకుల గేటు వద్ద నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇది నందిపేట మండలంలోని బ్యాంకుల పరిస్థితి. నోట్లను రద్దుచేస్తూ, నగదు చెల్లింపులపై ఆం్షలు విదిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 14 రోజులు గడుస్తున్నా ప్రజలకు నోటు కష్టాలు తీరడం లేదు. ...

Read More »

హరితహారం బుగ్గిపాలు

  నందిపేట, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని కొందరి మూర్ఖత్వపు పనుల మూలంగా మొక్కలు కాలి బూడిదవుతున్నాయి. నందిపేట మండల కేంద్రానికి సమీపంలో పవర్‌హౌజ్‌ వద్ద నవీపేట్‌ రోడ్డు పక్కన హరితహారం కింద నాటిన మొక్కలు దాదాపు 7 నుంచి 8 పీట్ల ఎత్తువరకు పెరిగాయి. అయితే కొందరు ముళ్లపొదలకు నిప్పంటించడంతో ముళ్లపొదలతో పాటు మొక్కలు కూడా కాలి బూడిదైపోయాయి. ఈ విషయం ‘నిజామాబాద్‌ న్యూస్‌’ ఎండివో నాగవర్ధన్‌, ...

Read More »

ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం

  – రైతులకు తప్పని తిప్పలు నిజాంసాగర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దీనిని చైర్మన్లు కూడా పట్టింపులేనివిధంగా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాల కల్పిస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సరైనసమయంలో ధాన్యం కొనుగోలు ...

Read More »

నిర్మించారు…ప్రారంభించారు… మరిచారు..

  ఆరు సంవత్సరాలైనా ప్రారంభం కాని ఆరోగ్య ఉపకేంద్రం అధికారులు స్పందించాలని గ్రామస్తుల వినతి నిజాంసాగర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేళ్లు గడుస్తున్నా ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. లక్షల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనం నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వైద్యఆరోగ్య శాఖాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2010 లో 10 లక్షల వ్యయంతో మగ్దుమ్‌పూర్‌ గ్రామ పంచాయతీ శివారు గ్రామమైన గిర్నితాండాలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించారు. దీన్ని నిర్మించి సంబంధిత శాఖకు అప్పగించారు. కానీ వైద్య ...

Read More »

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరం…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంట్లో తప్పకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధికారులతోకలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎస్‌బిహెచ్‌, గ్రామ పంచాయతీ మీదుగా మహాత్మాగాంధీ చౌరస్తా నుంచి పాఠశాల వరకు నిర్వహించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని నినాదాలు చేస్తూ బారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సయ్యద్‌ హైమద్‌ మస్రూద్‌, ...

Read More »

గడ్డి విత్తనాల పంపిణీ

  నిజాంసాగర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశు గ్రాసాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు పంపినీ చేస్తుందని మండల పశు వైద్యాధికారి సయ్యద్‌ యూనుఫ్‌ అన్నారు. మండల కేంద్రంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మంగళవారం విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక టన్ను గడ్డి విత్తనాలు మండలానికి వచ్చాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ తదితర రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో రాయితీపై పంపిణీ చేస్తుందన్నారు. ఎకరానికి 20 ...

Read More »

పరిశోధనా ప్రాజెక్టులు సాధించండి…

  – తెవివి వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ నుండి ఇతర పరిశోధనా సంస్థల నుండి రీసెర్చు ప్రాజెక్టులు సాధించాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సాంబయ్య అధ్యాపకులకు సూచించారు. ఈ మేరకు సోమవారం వర్సిటీ వివిధ విభాగాధిపతులతో సమావేశమై మాట్లాడారు. పరిశోదనా ప్రాజెక్టులు అధ్యాపకుల కెరీర్‌ అభివృద్ది కోసం ఎంతగానో తోడ్పడుతాయన్నారు. యుజిసి నిధులు ప్రాజెక్టులు, పరిశోధనలు వర్సిటీ ప్రతిష్టను పెంచుతాయని విసి అభిప్రాయపడ్డారు. 12వ పంచవర్ష ప్రణాళిక ...

Read More »

జోరుగా ఇంటిపన్ను వసూళ్ళు…

నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుచేయడంతో వాటిని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నోట్లను పన్ను రూపంలో చెల్లించవచ్చనే సదవకాశాన్ని ప్రజలకు కల్పించింది. దీంతో గ్రామాల్లో పన్నుల వసూళ్ళు జోరందుకున్నాయి. మండలంలోని మగ్దుంపూర్‌, గాలిపూర్‌ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పన్నులు వసూలుకోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. పాత 500, 1000 నోట్లతో పన్నులు చెల్లించేందుకు అవకాశముందని చెబుతూ బకాయిలన్ని వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు ...

Read More »

ఇది గుంతల రహదారి…

  నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులకు సకాలంలో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు జాతీయ రహదారులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా సమీపంలోగల సంగారెడ్డి, అకోల, నాందేడ్‌ 161వ నెంబరు జాతీయ రహదారి గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా నుంచి నాగమడుగు వంతెనపై రెండు, మూడు పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. జాతీయ రహదారులే అడ్డగోలుగా ...

Read More »

మత్స్యకార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకార్మికుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా మత్స్యకార్మికుల సంఘం ఛైర్మన్‌ నామాల శంకర్‌ అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలో చేప పిల్లలను ఎఫ్‌డివో సౌజన్యతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా, శ్రీరాంసాగర్‌, కౌలాస్‌, నిజాంసాగర్‌, నాగమడుగు జలాశయాలతో పాటు 549 చెరువుల్లో 3.5 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. ఇప్పటివరకు కోటి 50 లక్షల ...

Read More »

పిజి పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ 26 చివరితేదీ

  డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పిజి రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబర్‌ 26 వరకు పొడిగించినట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ కనకయ్య తెలిపారు. అలాగే అపరాధ రుసుము 100తో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ఫీజు చెల్లింపు నవంబర్‌ 26 వరకు చివరి తేదీ అని, అపరాధ రుసుముతో నవంబర్‌ 30 వరకు చెల్లించవచ్చని సూచించారు. అలాగే బిసిఎ రెగ్యులర్‌ పరీక్షల ఫీజు చెల్లించడానికి నవంబర్‌ ...

Read More »

పోలీసుల వాహనాల తనిఖీ

  బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కల్లోలమోరి చౌరస్తాలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల దృవపత్రాలు పరిశీలించారు. వాహన దారుల దృవపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణీకులను కూర్చోబెట్టవద్దని సూచించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు పోచయ్య, పోశెట్టి, పెద్దన్న, ఉన్నారు.

Read More »