Breaking News

Daily Archives: December 1, 2016

మహిళ హత్యకేసు మిస్టరీ చేదించిన పోలీసులు

  – నిందితుడి అరెస్టు, రిమాండ్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ ఆలయ అటవీప్రాంతంలో కొద్దిరోజుల క్రితం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు దానిపై విచారణ జరిపి నిందితుని అరెస్టు చేసినట్టు కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. గురువారం నిందితున్ని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. హత్యకేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేటకు చెందిన గంధం లక్ష్మి (42) అనే మహిళ తన కుమారుడితో కలిసి కూలీ పనిచేసుకుంటూ ...

Read More »

జంతర్‌ మంతర్‌ ధర్నా విజయవంతం

  – పిఆర్‌టియు టిఎస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌పై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పిఆర్‌టియు రాష్ట్ర శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైందని పిఆర్‌టియు టిఎస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ధర్నాకు నిజామాబాద్‌ ఎంపి కవిత, ఎంపిలు బాల్కసుమన్‌, మూఢ నర్సయ్య గౌడ్‌, మల్లారెడ్డి, డి.శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, నగేశ్‌లు సందర్శించారన్నారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయడానికి తమ ...

Read More »

కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో గురువారం తెలంగాణ పోరాటంలో అమరుడైన కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి ఐరేని సందీప్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో కానిస్టేబుల్‌ కిష్టయ్య తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి అమరుడయ్యారన్నారు. కిష్టయ్య బలిదానాన్ని స్మరించుకొని ఆయనకు నివాళులు అర్పించినట్టు తెలిపారు. ఏ ఆకాంక్ష కోసం రాష్ట్రం ఏర్పడితే నేడు ఆకాంక్ష నెరవేరకుండా నిరుద్యోగం, ఇతర సమస్యలు నెలకొన్నాయన్నారు. ...

Read More »

గ్రామ సంఘాల పనితీరుపై సందర్శన

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామసంఘాల పనితీరును గురువారం హైదరాబాద్‌ నుంచి వచ్చిన స్త్రీనిధి ఏజిఎం సుమిత్ర శ్రీలత సందర్శించారు. దేవునిపల్లి గ్రామంలోని గ్రామసంఘానికి వెళ్లి సంఘం పనితీరును పరిశీలించారు. స్త్రీనిధి, మైక్రో, ట్రైనీ, జీవనోపాధి రుణాలు తీసుకున్న నేపథ్యంలో వారి వద్దకెళ్లి వారుచేస్తున్న వ్యాపారాల గురించి ఆరా తీశారు. గ్రామసంఘంలో ఓబితో మాట్లాడారు. వ్యాపారాల గురించి వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.వారు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. కార్యక్రమంలో ఐకెపి ఏపిఎం శ్రీనివాస్‌, స్త్రీనిధి ...

Read More »

ఎయిడ్స్‌ దినోత్సవ ర్యాలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురవారం కామారెడ్డి ఆర్‌.కె.డిగ్రీ, పిజి కళాశాలలో ఎన్‌ఎస్‌డబ్ల్యు, ఎన్‌ఎస్‌ఎస్‌ – 1 విద్యార్తులు, వాలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రాంగణం నుంచి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన హన్స్‌ ఇండియా ఎడిటర్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్తులు ఎయిడ్స్‌ వ్యాధి గురించి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ...

Read More »

ఎయిడ్స్‌ నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

  – కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ నియంత్రణ అనేది ఒక వైద్యశాఖనే కాకుండా అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసినపుడే విజయవంతమవుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్‌ నియంత్రణ దినం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఉదయం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ ...

Read More »

ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిలో స్థిరపడాలి

  – హన్స్‌ ఇండియా ఎడిటర్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిలో స్థిరపడాలని మాజీ ఎమ్మెల్సీ, హన్స్‌ ఇండియా ఎడిటర్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌.కె.డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం నిర్వహించిన విద్యార్థులకు జీవితంలో ఏవిధంగా గెలుపులు సాధించుకోవాలో అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను మామూలు స్థితినుంచి నేడు ఉన్నతస్తితికి ఎలా ఎదిగాలో అనే విషయాన్ని విద్యార్తులకు తెలియజేశారు. విద్యార్థులు సైతం ...

Read More »

బ్యాంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తుంది. నగదు మార్పిడి చేసుకునేందుకు ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల చుట్టు ప్రదక్షినలు చేస్తున్నారు. మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామంలో ప్రజల రద్దీ ఎక్కువ కావడంతో ఎస్‌ఐ అంతిరెడ్డి ఆధ్వర్యంలో క్యూ పద్దతి పాటించాలని సూచనలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా బ్యాంకులోనికి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

Read More »

నాగమడుగు వంతెనకు మరమ్మతులు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని అచ్చంపేట నాగమడుగు నీటిప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక ఎస్‌ఐ అంతిరెడ్డి ఆధ్వర్యంలో మొరం వేయించి మరమ్మతులు చేపడుతున్నారు. మరమ్మతుల కోసం 15 ట్రాక్టర్ల మొరం వేసినట్టు తెలిపారు. ప్రాజెక్టు నీటి ప్రవాహంతో కొట్టుకుపోయి రెండు నెలలు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పోలీసులు ముందుకొచ్చి మరమ్మతు పనులు చేపట్టడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మరమ్మతులు చేయడంతో అచ్చంపేట, ఆరేపల్లి, ...

Read More »

శత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామంలో శుక్రవారం నుంచి ఈనెల 4వ తేదీ వరకు శ్రీరుద్ర హవన పురస్సర శత చండీ యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బాసర ముఖ్య అర్చకులు రాజీవ్‌శర్మ ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాలు మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు. చండీ యాగానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిడిసి చైర్మన్‌ ...

Read More »

ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన ర్యాలీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్‌ఎంలు, పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌ వ్యాధికి నిర్మూలనే మార్గమని, చికిత్సకు వీలులేదని పేర్కొన్నారు. ఎయిడ్స్‌ రోగులతో సద్భావనతో మెలగాలని, ఎయిడ్స్‌ అంటువ్యాధి కాదని అన్నారు. గ్రామ ప్రదాన వీధుల గుండా నినాదాలు చేస్తు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

నగదు రహిత చెల్లింపులు చేయాలి…

  -జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నగదు రహిత చెల్లింపులు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులు, బ్యాంక్‌ అధికారులు, వ్యాపారసంఘం నాయకులు, మహిళా సంఘాల సభ్యులతో నగదు రహిత చెల్లింపులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి ఆయోగ్‌ కమిటీ సిఫారసు చేసిన సూచనలు వివరించారు. జిల్లాలో డిజిటల్‌ ...

Read More »