Breaking News

Daily Archives: December 3, 2016

2017లో జిల్లాలో 2 కోట్ల మొక్కలు…

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017లో మొదలయ్యే హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లో అవసరమైన మొక్కలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం వర్ని రేంజ్‌ అటవీశాఖ ఆధ్వర్యంలో మోస్రా సెంట్రల్‌ నర్సరీలో ఉపాధి హామీ సిబ్బంది ఏపివోలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు నర్సరీ పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. వచ్చే యేడు జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటాలని, ...

Read More »

తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో విజయాలు …

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రమశిక్షణ, వాత్సల్యం, తల్లిదండ్రుల ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు విజయాలు సాధించడానికి అంగవైకల్యం అడ్డురాదని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా అన్నారు. శనివారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కొరకు చేయూత ఇస్తుందని తెలిపారు. పిల్లలను 100 శాతం పాఠశాలలకు పంపించాలని ఎన్‌జివోలు, సొసైటీల్లో ఏర్పాటు చేసిన పాఠశాలకు వెళ్లాలని సూచించారు. భవిత సెంటర్‌కు పిల్లలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. వారికి ...

Read More »

క్రిస్మస్‌ పండుగకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండగను ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌ చంద్ర ఆదేశించారు. శనివారం సచివాలయం నుంచి క్రిస్మస్‌ పండగ వేడుకలు, పెద్ద నోట్ల రద్దు అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్‌ పండగను అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున కొత్త బట్టలు పంపిణీ చేసేందుకు ...

Read More »

అవినీతి రహిత సమాజం నిర్మిద్దాం

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతి రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీ శ్వేత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం అందరు పాటుపడాలని, ఇందులో అందరు భాగస్వాములు కావాలని అన్నారు. ...

Read More »

నోట్ల మార్పిడితో జనానికి తిప్పలు…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రధాని నరేంద్ర మోడి 500, 1000 నోట్ల చెల్లుబాట్ల విషయమై తీసుకున్న నిర్ణయంపై మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వివాహాలు, గృహ నిర్మాణాలు, వ్యవసాయదారులు ఉదయం 7 గంటల నుంచే బ్యాంకుల ముందు అరకిలో మీటరు మేర నిల్చుంటున్నారు. దేశ ఆర్తిక ప్రగతికి 500, 1000 నోట్ల రద్దు సమంజసమైనప్పటికి, సామాన్యులను దృష్టిలో ఉంచుకొని వారిరోజు వారి ఖర్చులకు సరిపడా నగదును బ్యాంకుల్లో నిలువ ఉంచి తీసుకోవాల్సిన ...

Read More »

దివ్యాంగులకు అన్ని విధాల తోడ్పాటు..

  – ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు ప్రబుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా, భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు తోడ్పాటునందిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ...

Read More »

యువకుడు అదృశ్యం

  కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో యువకుడు అదృశ్యానికి సంబంధించిన ఫిర్యాదు అందినట్టు పట్టణ ఎస్‌ఐ శోభన్‌ తెలిపారు. మహారాష్ట్రలోని పురాతికి చెందిన పోతన్న (22) గతనెల 14వ తేదీ నుండి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిందన్నారు. పాత జాతీయ రహధారి వద్దగల రిషబ్‌ హోటల్‌ నుండి పోతన్న అధృశ్యమయ్యాడన్నారు. ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Read More »

టిఎస్‌ ఆర్టీసి కామారెడ్డి డిపో కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఆర్టీసి కామారెడ్డి డిపో ముస్లిం మైనార్టీ వెల్పేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గం శనివారం ఎన్నుకున్నట్టు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కౌసర్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆర్టీసి డిఎం జనార్ధన్‌ను కలిసి నూతన కమిటీ గురించి వివరించామన్నారు. సభ్యులుగా బౌదుద్దీన్‌, ఇంతియాజ్‌ అలీ, ఇషాక్‌, అతీక్‌, గౌస్‌, పాషా తదితరులున్నట్టు తెలిపారు.

Read More »

ప్రభుత్వ విద్యాలయాల ప్రగతికి కృషి

  – ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యాలయాల్లో మెరుగైన కోర్సులను, విద్య అందించేదుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని, అందుకోసం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. భిక్కనూరు తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లో 13 కోట్లతో నిర్మించిన బాలుర, బాలికల వసతి గృహాలను శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సౌత్‌ క్యాంపస్‌లోని నాలుగు కోర్సుల్లో 180 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు. ...

Read More »

మావోయిస్టు సానుభూతి పరుడు అరెస్టు

  – 20 డిటోనేటర్లు స్వాధీనం కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మావోయిస్టు సానుభూతిపరుడు భీంభరత్‌ (42) నుశనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు తెలిపారు. శనివారం భరత్‌ను విలేకరుల ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌కు చెందిన భీంభరత్‌ ప్రస్తుతం ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్‌లో నివాసముంటున్నాడన్నారు. ఆయుధాలు కలిగి ఉన్నాడన్న కేసులో 2015లో ఆరుగురిని అరెస్టుచేయగా భీంభరత్‌ అప్పటినుంచి తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. శుక్రవారం రాత్రి భరత్‌ను అదుపులోకి ...

Read More »

కొత్త 500 నోట్లు వచ్చేశాయ్‌…

  కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రబుత్వం 500, 1000 నోట్లను రద్దుచేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌బిఐ 2000 రూపాయల నోటును విడుదల చేసింది. దీంతో చిల్లర దొరక్క గత కొంతకాలంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నిజాంసాగర్‌ మండలంలోని డిసిసి బ్యాంకుకు 500 రూపాయల కొత్త నోట్లు వచ్చినట్టు మేనేజర్‌ త్రిశూల్‌ తెలిపారు. పాత 500 స్థానంలో ఆర్‌బిఐ వారు 500 కొత్త నోటును విడుదల చేసిందన్నారు. ఈ నోట్లను ఖాతాదారులకు ...

Read More »

రెండోరోజు శతచండీ యాగం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ, పచ్చని యాగశాల ప్రాంగణంలో శతచండీ యాగం రెండోరోజు కన్నుల పండువగా కొనసాగుతుంది. నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో శుక్రవారం ప్రారంబమైన యాగానికి కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుండి భక్తుల తాకిడి పెరిగింది. శనివారం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, గోపూజ, చండీయాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు దాండియా ఆటలు, బతుకమ్మ ...

Read More »

దొన్కల్‌లో మూడురోజుల పాటు జాతర, అన్నదానం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామంలోగల శ్రీవెంకటేశ్వర ఆలయం వద్ద గత రెండ్రోజులుగా బ్రహ్మూెత్సవాలు ప్రారంభమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. జాతరను పురస్కరించుకొని శుక్ర, శనివారాల్లో దీక్షా స్వాములు, వేదపండితులతో స్వామివారి ఆలయం ముందు వేసిన పందిరికింద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం కళ్యాణోత్సవం, సోమవారం సత్యనారాయణ స్వామి వ్రతం, మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. మూడురోజుల పాటు విచ్చేసే భక్తులకు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ...

Read More »

పైలట్‌ ప్రాజెక్టుగా ఒడ్యాట్‌ గ్రామం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌ గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం రాత్రి మండల అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు స్తానిక సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామస్తులతో పల్లెనిద్ర సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో అర్హులై ఉండి లబ్దిపొందని పించన్‌దారులు, రేషన్‌కార్డులులేనివారు దరఖాస్తులు చేసుకుంటే వెంటనే ...

Read More »

పాఠశాలలో వేదిక నిర్మాణం పనులు ప్రారంభం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌ గ్రామ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా వేదిక నిర్మాణం పనులు స్థానిక సర్పంచ్‌ పోశన్న, ఎంపిటిసి డాక్టర్‌ జయవీర్‌ పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన నలుగురు దాతలు గద్దె నిర్మాణం కోసం 45 వేలు అందజేశారని, వారి సహకారంతో నిర్మాణం పనులు చేపడుతున్నట్టు చెప్పారు.

Read More »

మానసిక వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కృషి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుద్దిమాంద్యం, మానసిక వికలాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంఇవో రాజేశ్వర్‌లు అన్నారు. శనివారం మోర్తాడ్‌లో భవిత కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని వికలాంగ విద్యార్థులతో కలిసి నిర్వహించారు. బుద్దిమాంద్యం గల వారికోసం ప్రత్యేక పాఠశాలలు, వ్యాయామ పరికరాలు, పౌష్టికమైన ఉచిత భోజనం, రవాణా చార్జీలు, ఉచిత బోధన అందిస్తుందన్నారు. ఇట్టి అవకాశాన్ని వికలాంగుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లలు మనోధైర్యంతో ముందుకు సాగేలా చూడాలని ...

Read More »

వంతెన కూలింది…

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరాగ్రామ శివారులోగల పెదవాగుపైగల వంతెనపై నుండి విద్యుత్‌ స్థంభాలను తీసుకున్న భారీ వాహనం వెళ్లడంతో వంతెన కుప్పకూలిపోయింది. వంతెన కూలినప్పటికి వాహనం ఇరుక్కుపోయి ప్రమాదం తప్పింది. ఈ విషయమై స్థానిక సర్పంచ్‌ రాజేందర్‌, ఎంపిటిసి లత అధికారులకు సమాచారం అందించారు. మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ హన్మంత్‌రావు, డిఇ రమేశ్‌, ఏఇ వినీత్‌, ఎండివో శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ...

Read More »

చండీయాగాన్ని ప్రారంభించిన జడ్పిచైర్మన్‌ దఫేదార్‌ రాజు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో శుక్రవారం శతచండీయాగాన్ని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు అత్యంత భక్తి, శ్రద్దలతో ప్రారంభించారు. యాగం అనంతరం యాగశాల చుట్టు ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే చండీయాగంలో పాల్గొని హవిస్సులు సమర్పించారు. తెలంగాణ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమం మూడురోజుల పాటు కొనసాగుతుందని, చక్కటి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ...

Read More »

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐపిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి జబ్బర్‌ నాయక్‌ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న 3 వేల 600 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యనందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యారంగ సమస్యలు ...

Read More »

టివియువి ఆధ్వర్యంలో గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆద్వర్యంలో ఈనెల హైదరాబాద్‌లో నిర్వహించనున్న విద్యార్థి ఉద్యమం – డిసెంబరు 9 సదస్సుకు సంబంధించిన గోడప్రతులను శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నేడు అన్యాయం జరుగుతుందన్నారు. స్కాలర్‌షిప్‌ విడుదలలో జాప్యం, మెస్‌చార్జీల పెంపు, కనీస వసతుల కరువు, హాస్టల్‌ భవనాలు లేకపోవడం, తదితర సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విషయమై హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు ...

Read More »