Breaking News

Daily Archives: December 5, 2016

గ్రంథాలయంలో సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థి నిరుద్యోగ జేఏసి నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రమైనప్పటికి గ్రంథాలయ విభజన ఇంకా పూర్తికాలేదని అన్నారు. 12 గంటల పాటు గ్రంథాలయం పాఠకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రంథాలయ సమస్యలు, విబజన పరిస్కారానికి ...

Read More »

విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గణితపోరం ఆధ్వర్యంలో కామారెడ్డి మండలంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎంఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిభ పరీక్షల్లో తెలుగుమీడియం నుంచి ముగ్గురు, ఇంగ్లీష్‌ మీడియం నుంచి ముగ్గురు విద్యార్థులు జిల్లాస్థాయి ...

Read More »

కామారెడ్డి జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా వెంకట్‌రావ్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల సంఘం నూతన అధ్యక్షుడిగా దేవునిపల్లి సర్పంచ్‌ నిట్టు వెంకట్‌రావును ఎన్నుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాగ్రామ పంచాయతీ సర్పంచ్‌ల చైతన్య సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకొని నిట్టువెంకట్రావుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌గా గ్రామాబివృద్దికి కృషి చేయడంతోపాటు సర్పంచ్‌ల సంఘం అధ్యక్షునిగా సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లలోని ఆయా గ్రామాల ...

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యువసేన (టివైఎస్‌) ఆద్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ, డ్రైవర్‌ కాలనీల్లోని విద్యార్థులకుసోమవారం నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టివైఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు 180నోటుపుస్తకాలు, 50 పలకలు, పెన్నులు, పెన్సిళ్ళు పంపిణీ చేశామన్నారు. విద్యారంగ సమస్యలపైనే పోరాటం చేయడం కాకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే విద్యార్థులకు వాటిని అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పివైఎస్‌ ప్రతినిదులు ఆసిఫ్‌, యాసిన్‌, శ్యాంరెడ్డి, ఖలీం తదితరులు ...

Read More »

పిఎంపి వైద్యుల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఎంపి వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నూతన జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కామారెడ్డి డివిజన్‌ పిఎంపి ప్రతినిదులుఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తమ సమస్యలు విన్నవించారు. పిఎంపివైద్యులపై దృష్టిసారించి తమ అభివృద్దికి సహకరించాలని కోరారు. పిఎంపి వైద్యుల ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటు&్ట తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు సత్యనారాయణ, విఠల్‌, బాల్‌కిషన్‌గౌడ్‌, ...

Read More »

ప్రజావాణిలో 106 ఫిర్యాదులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 106 ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. ఆయా శాఖల అదికారులకు సంబంధిత ఫిర్యాదులను పంపనున్నట్టు తెలిపారు. అధికారులు పిర్యాదులపై స్పందించి వాటిని త్వరితగతిన పరిస్కరించాలని ఆదేశించారు.

Read More »

సిపిఎస్‌ విధానం రద్దుచేసేవరకు పోరాటం…

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానం రద్దుచేసేంతవరకు పిఆర్‌టియు కొనసాగిస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్‌ అన్నారు. మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిపిఎస్‌ విధానం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులు నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 28న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పిఆర్‌టియు ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నవిజయవంతమైందన్నారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, సురేందర్‌, తదితరులున్నారు.

Read More »

స్థల పరిశీలన

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎస్‌సి కమ్యూనిటీ హాల్‌ భవన నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు కావడంతో స్థానిక ఎంపిడివో రాములు నాయక్‌ పిఆర్‌ ఎ.ఇ. మారుతి, సర్పంచ్‌ బేగరిరాజు స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఎంపిడివో మాట్లాడుతూ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే సిడిసి నిధుల కింద రూ. 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇట్టి నిదులతో కమ్యూనిటీ హాల్‌ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Read More »

మాగి గాయత్రీ చక్కర కర్మాగారంలో క్రషింగ్‌ ప్రారంభం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గాయత్రీ చక్కర కర్మాగారంలో సోమవారం క్రషింగ్‌ ప్రారంభించారు. 2016-17 సంవత్సరానికి మద్దతుధర టన్ను చెరుకు రూ. 2900 గా ప్రకటించారు. ముందుగా కర్మాగారం జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణ, క్రేన్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రెడ్డి, రాజమహేందర్‌రెడ్డి, ఉద్యోగులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరకు క్రషింగ్‌ మొదలుపెట్టారు. గత సంవత్సరం 3 లక్షల మెట్రిక్‌ టన్నుల క్రసింగ్‌ నిర్వహించగా, ఈయేడు లక్ష మెట్రిక్‌ టన్నుల లక్ష్యం ఉన్నట్టు వారు తెలిపారు.

Read More »

చండీ యాగానికి తరలిన భక్తజనం…

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గోర్గల్‌ గ్రామంలో మూడురోజులుగా కొనసాగుతున్న శతచండీ యాగం ఆదివారం పూర్ణాహుతితో సంపూర్నమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యాగశాలలు కిటకిటలాడాయి. యాగశాలలో వేదపండితులు చండీమాత విగ్రహం వద్ద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి కుంకుమార్చనలు జరగడంతో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున మహా అన్నదానకార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యువకులు సేవలందించారు. ప్రపంచశాంతి ...

Read More »

వంట భోజనం బాగుంది.. మీరు బాగున్నారా..

  బీర్కూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంట భోజనం బాగుంది.. మీరు బాగున్నారా… అంటూ స్తానిక ఎంపిపి మల్లెల మీణ హన్మంతు కస్తూర్బాగాంధీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఎంపిపి ఆధ్వర్యంలో గ్రామపెద్దలు కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మిక తనికీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో వండిన చికెన్‌ బిర్యాని, పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్తుల, ఉపాధ్యాయుల రికార్డులు, స్టాక్‌ రిజిష్టర్లు పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపెద్దలు, తదితరులున్నారు.

Read More »

చెరువుకట్టపై చెట్ల దొంగలు…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు పెంచి రాష్ట్రాన్ని పచ్చగా చేయాలని తలిస్తే కొందరు స్వార్థపరులు పెరిగిన చెట్లను తమ స్వలాభం కొరకు నరికివేయడం మండల కేంద్రంలోని ఎల్లమ్మకుంట చెరువుకట్టపై చోటుచేసుకుంది. ఆయకట్టు రైతుల కథనం ప్రకారం… ఎల్లమ్మ చెరువుకట్టపై గత 30 నుంచి 40 సంవత్సరాలుగా భారీగా ఏపుగా పెరిగిన చెట్లను ఆయకట్టు రైతులకుగాని, నీటిపారుదల శాఖ అధికారులకుగాని, రెవెన్యూ అధికారులకు కూడా ఎటువంటి సమాచారం లేకుండానే కోటగిరి ...

Read More »