Breaking News

Daily Archives: December 6, 2016

విద్యార్థులే.. ఉపాధ్యాయులుగా…

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలనా దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులుగా ముజీన్‌, ఉపాధ్యాయులుగా జిన్నత్‌, జుమియా, జమా, షాజియా బేగం, అంజుమ్‌, అల్తాఫ్‌, సోయల్‌లు విధులు నిర్వహించారు. రోజుమాదిరిగా ఉపాధ్యాయులు ఎలా బోధించారో అలాగే తోటి విద్యార్థులకు చక్కటి బోదన అందించారు. కార్యక్రమంలో ఉర్దూ మీడియం ప్రధానోపాద్యాయులు మహేర్‌, ఉపాధ్యాయులు సఫియా, ...

Read More »

అంబేడ్కర్‌కు కొవ్వొత్తులతో నివాళి

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీసాయిసుధ విద్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని చిన్నారులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉప్ప నరేశ్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. బాల్యంలో అడుగడుగునా బాధలను భరిస్తూ, పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో కేంద్ర మంత్రిపదవిని అలంకరించారన్నారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ...

Read More »

కోనేరులో విద్యార్థి మృతి

  – గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దోన్‌పాల్‌ గ్రామానికి చెందిన అజయ్‌ (8) అనే 2వ తరగతి విద్యార్థి దొన్కల్‌ గ్రామంలో జరిగిన జాతరకు వెళ్ళి ఆలయం వద్ద గల కోనేరులో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో అజయ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్టు విశ్వసనీయ సమాచారం. స్థానికుల కథనం ప్రకారం జాతరకు వచ్చిన అజయ్‌ కోనేరులో మునిగిపోయాడని, గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించినట్టు ఆసుపత్రిలో మృతి చెందగా, కుటుంబ సభ్యుల ...

Read More »

కన్నుల పండువగా రథోత్సవం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామంలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి రథోత్సవం కన్నుల పండువగా, అత్యంత వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథాన్ని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. మహిలా భక్తులు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. జాతరను పురస్కరించుకొని గత ఐదురోజులుగా భక్తుల ఆధ్వర్యంలో స్వామివారి ఆలయంలో వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదానంలో పాల్గొన్నారు. ...

Read More »

అంబేడ్కర్‌ ఆశయాల మేరకు తెరాస కృషి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేడ్కర్‌ రాజ్యాంగం మేరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడు గంగాధర్‌ ఏర్పాటు చేసిన 18 గంటల పుస్తక పఠనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేడ్కర్‌, ఫూలే చిత్రపటాలకు పూలమాలలువేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ 18 గంటల పాటు పుస్తక పఠనం చేయడం వల్లే ప్రపంచ దేశాలకు మేధావిగా వెలిగాడని, అదేబాటలో ...

Read More »

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి…

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్యాంకు మేనేజర్లు, మీసేవా కేంద్ర నిర్వాహకులు వినియోగదారులకు, ఖాతాదారులకు నగదు రహిత లావాదేవీలపై బ్యాంకు అకౌంట్‌ లింకేజీలు, డెబిట్‌ కార్డులపై అవగాహన కల్పించాలని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ సూచించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లోగల బ్యాంకులను, మీసేవా కేంద్రాలను సందర్శించి బ్యాంకు మేనేజర్లతో, మీసేవా నిర్వాహకులతో మాట్లాడారు. డబ్బును నగదు రూపంలో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈవిధానం అమలు చేయడం ద్వారా ...

Read More »

అంబేడ్కర్‌ అందరికి ఆదర్శనీయం

  నందిపేట, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ అడుగుజాడలు అందరికి ఆదర్శనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజారాం యాదవ్‌ అన్నారు. నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామంలో అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రాజారాం మాట్లాడుతూ అంబేడ్కర్‌ ప్రపంచానికే నాయకుడని, ఆయన ఖ్యాతిని కొనియాడారు. వెనకబడిన వర్గాల వారికి, ముఖ్యంగా దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఆయన కృషివల్లే నేడు ...

Read More »

మహాసభలు విజయవంతం చేయండి…

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబరు 12న నిర్వహించనున్న భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా ప్రథమ సభలను విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్‌ ఉప్పల సాయికుమార్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో మహాసభలకు సంబందించిన గోడప్రతులను ఆవిష్కరించారు. మహాసభలకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌తోపాటు సంఘం రాష్ట్ర అద్యక్షుడు కామల్ల ఐలయ్య విచ్చేస్తున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని భవన నిర్మాణ రంగ కార్మికులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ...

Read More »

రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం…

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 26 నుంచి జనవరి 26 వరకు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ప్రచార ఉద్యమానికి దళిత బహుజన ప్రంట్‌ పిలుపునిచ్చిందని బహుజన ప్రంట్‌ నాయకులు తెలిపారు. మంగళవారం అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం రూపొందించారని, ప్రస్తుతం వర్ణధర్మం, కులధర్మంగా మారి అంతరాల దొంతరలు నిర్మిస్తుందన్నారు. దాంతో కొందరు మనుషులను దేవతలతో సమానంగా మరికొందరిని జంతువులకన్నా హీనంగా పరిగణిస్తున్నారన్నారు. సమానత్వపు స్వేచ్చ హక్కులను ...

Read More »

శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వంతో పాటు పలు ప్రయివేటు సంస్థలు ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం వినియోగించుకొని నిరుద్యోగులు, మహిళలు స్వయం ఉపాధి పొందాలని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. ఏఎల్‌ఇఏఐ సంస్థ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు మంగళవారం ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందేందుకు ఉపకరిస్తాయన్నారు. తద్వారా తమ కాళ్లపై తాము నిలబడవచ్చని, ఆర్థిక స్తోమత పెంచుకోవచ్చని ...

Read More »

అంబేడ్కర్‌ వర్ధంతి వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వర్ధంతిని ఆయా ప్రజా సంఘాలు, కులసంఘాలు, పార్టీలు, పాఠశాలలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైల్వేకమాన్‌పై గల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌లు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్‌ బీంరావు అంబేడ్కర్‌ ...

Read More »

ఎటిఎం కేంద్రాల వద్ద జాగ్రత్త…

  – డిఎస్పీ భాస్కర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటిఎం వినియోగదారులు ఎటిఎం కేంద్రాల వద్ద జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ సూచించారు. కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు ఎటిఎంల వాడకం, నగదు బదిలీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎటిఎంల వాడకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అపరిచితులకు తమ కార్డుల వివరాలు తెలిపి మోసపోవద్దని సూచించారు. ఇటీవల ఎటిఎంల కార్డు బాధితులు అధికమయ్యారని, తగు జాగ్రత్తలు పాటిస్తే ...

Read More »

వృద్దుని ఆత్మహత్య

  కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో మంగళవారం వృద్దుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు దేవునిపల్లి ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. ఉగ్రవాయి గ్రామానికి చెందిన క్యాదర్‌గారి లక్ష్మయ్య (65) అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.

Read More »

అభివృద్ది కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేయాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలైన హరితహారం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ తదితర కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆవరణలో వీడియోకాన్ఫరెన్సులో సీఎస్‌ కార్యాలయం నుంచి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహరంలో ఈ ఏడాది నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిందేనన్నారు. ...

Read More »

అనాథల ఆకలి తీరుస్తున్నరు…

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ప్రతిరోజు లక్షల్లో అనాథలు, పేదలు ఆకలితో చనిపోతున్నారని, అలాంటి వారికి తమవంతు బాధ్యతగా కడుపునిండా సంపూర్ణ భోజనం అందించి ఆకలి తీర్చడానికి ముందుకువచ్చారు లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాల ప్రిన్సిపాల్‌ సరోజిని. మంగళవారం తేజస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాల సహకారంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అనాధ వృద్దులకు, వికలాంగులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది రాజ్‌కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ పుట్టినరోజుల పేరుతో పార్టీలకని ...

Read More »

‘జయ’ కాదని సమర్థించుకోవడానికే చనిపోయినట్టు చూపించారట!

జయలలిత మృతితో తమిళ రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. రెండు దశాబ్దాల పాటు వెండితెర మీద, మరో రెండు దశాబ్దాలపాటు రాజకీయాల్లోనూ మహారాజ్ఞిగా వెలుగొందిన ‘విప్లవ నాయకి’ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. జయలలిత కథను వెండితెర మీదకు తీసుకొచ్చేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. జయలలిత నిజ జీవితాన్ని పోలిన పాత్రను ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ ఇది వరకే పోషించింది. ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తీసిన ‘ఇరువర్‌’ (తెలుగులో ఇద్దరు) ...

Read More »