Breaking News

Daily Archives: December 7, 2016

రోడ్డు బాగుచేసేదెన్నడో …

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిపారుదల శాఖాధికారులు నిజాంసాగర్‌ బస్టాండ్‌ నుంచి ప్రాజెక్టు వద్ద వరకు రోడ్డుకు కనీస మరమ్మతులు కూడా చేయలేకపోతున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. నీటిపారుదల శాఖాధికారులు లక్షలాది రూపాయలు ఖర్చుచేసినప్పటికి కంకర తేలిన రోడ్డు గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో పర్యాటకులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రం నుంచి బస్టాండ్‌ మీదుగా ప్రాజెక్టు పైకి వెళ్లేందుకుగల అడ్డరహదారికి మరమ్మతులు చేయకపోవడంతో కంకర తేలి గుంతల మయంతో రహదారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రాజెక్టుకు వెల్లేందుకు ...

Read More »

బయోమెట్రిక్‌ విధానం ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియాలో కార్మికుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్‌ విధానాన్ని బుధవారం ప్రారంభించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కమీసనర్‌ విజయలక్ష్మి స్వయంగా వెళ్లి బయోమెట్రిక్‌ విధానంలో కార్మికులు వేలిముద్రలతో హాజరుతీసుకునే ప్రక్రియను పరిశీలించారు. బయోమెట్రిక్‌ విధానం ద్వారా కార్మికులు విధులకు సక్రమంగా హాజరవుతున్నది, కానిది తెలుస్తుందని, ఈవిధానం కార్మికులు సక్రమంగా పనిచేసేందుకు ఉపకరిస్తుందన్నారు. పారిశుద్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Read More »

విద్యార్థి విజయ్‌దివస్‌ను జయప్రదం చేయండి

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబరు 9న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న విద్యార్థి విజయ్‌ దివస్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సేన ప్రతినిదులు కోరారు. కామారెడ్డిలో బుధవారం విజయ్‌దివస్‌కు సంబంధించిన గోడప్రతులు ఆవిస్కరించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థులతో డిసెంబరు 9న ఓయులో విద్యార్థి విజయ్‌ దివస్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం తెలంగాణ విద్యార్థులను పట్టించుకోకపోవడం సమంజసం కాదన్నారు. విద్యార్థుల ఉద్యమ ఫలితంగా తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ...

Read More »

క్రీడాకారులకు సన్మానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఆర్యభట్ట కళాశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్తాయి అథ్లెటిక్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చగా బుధవారం వారిని సన్మానించారు. కామారెడ్డిలో గేయిల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో కళాశాలకు చెందిన విద్యార్తిని కుమ్మరి లావణ్య 100, 200 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానంతో పాటు 400 మి. పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ శిక్షణకు ఎంపికైనందున ఆమెను సన్మానించారు. మహబూబ్‌నగర్‌లోని కొడంగల్‌లో జరిగిన ...

Read More »

రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆద్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు శిబిరంలో రక్తదానం చేశారు. విద్యార్థులు, యువకులు రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధి చంద్రకాంత్‌రావు అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ హరిస్మరణ్‌రెడ్డి, ప్రతినిదులు బాల్‌కిసన్‌, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బాలుర పాఠశాల ఎదుట ధర్నా

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గత నాలుగురోజులుగా అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుడు గత నాలుగురోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో వారు పస్తులుంటున్నారన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుని విదుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ ప్లేట్లతో పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ...

Read More »

కామారెడ్డి జిల్లా అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అభివృద్దికి అన్ని శాఖల అధికారులు ఉమ్మడిగా ప్రణాళికలు రూపొందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జిల్లాను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు బుధవారం కలెక్టరేట్‌లో యునిసెఫ్‌ అధికారి భాస్కర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్ని రంగాల్లో వెనకబడి ఉంది, వాటన్నింటిలో అభివృద్ది సాధించేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలి అన్న విషయాలపై అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. అన్ని శాఖల ...

Read More »

ప్రభుత్వం నియంతృత్వ వైఖరి విడనాడాలి

  – విద్యార్థుల పోరు దీక్షలో షబ్బీర్‌ అలీ కామారెడ్డి, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నియంతృత్వ పోకడలు విడనాడాలని విద్యార్థులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిస్కరించాలని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సమస్యలకు సంబంధించి బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఎస్‌యుఐ ఆద్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల పోరు దీక్ష కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. ఎన్నికలకు ముందు కల్లబొల్లి హామీలిచ్చి ...

Read More »

వాహనాల ఢీ, ఒకరుమృతి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, తిమ్మాపూర్‌ జాతీయ రహదారి మధ్యన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అదే సమయంలో బైక్‌ రావడంతో బైకును కూడా ఢీకొనడంతో వాహనాలు అదుపుతప్పాయి. దీంతో రెండు కార్లు పక్కకు పడిపోయాయి. బైకుపై వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతున్ని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రిపూట ప్రమాదం జరగడంతో ఇరువైపులా భారీగా వాహనాలు స్థంభించాయి. కేసు నమోదు ...

Read More »

మీసేవా, బ్యాంకుల పరిశీలన

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహితపై మీసేవా, బ్యాంకులను, హోటళ్లను బుధవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్‌ను నగదు రహిత అవగాహనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలంలోని బ్యాంకులను, మీసేవా సెంటర్లను, పలు దుకాణాలను సందర్శించారు. నగదు రహితపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా విక్రయదారులకు కూడా నగదు రహితపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆయన ...

Read More »

ముదిరాజ్‌ల మహాపాదయాత్రకు ఘనస్వాగతం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో వెనకబాటుకు గురయ్యారని, ముదిరాజ్‌లను బిసి-డి నుంచి బిసి-ఎలోకి చేర్చాలంటూ ముదిరాజ్‌ మహాజన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. బుధవారం మండలంలోని ధర్మోరా గ్రామానికి చేరుకున్న పాదయాత్రకు దొన్కల్‌ ముదిరాజ్‌ సంఘం నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలువేసి, శాలువాలు కప్పి పాదయాత్రలో జాతీయరహదారిపైగల పెద్దమ్మ ఆలయం వరకు ముదిరాజ్‌లు నాయకులకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు ...

Read More »

అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు…

  బాసర, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చిన 28 రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఇవో వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. లెక్కింపులో నగదు రూ. 27 లక్షల 34 వేల 408, బంగారం 35 గ్రా. 500 మి. గ్రాములు, వెండి 2 కిలోల 96 గ్రాముల 400 మి. గ్రాములు, విదేశీ కరెన్సీ 64 ఆదాయం సమకూరినట్టు పేర్కొన్నారు.

Read More »

బీడీ కార్మికులకు నేరుగా కూలీ వేతనాలు అందించాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృస్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని బీడీ కార్మికుల కూలీ డబ్బులు నేరుగా అందించాలని తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తక్క డిమాండ్‌ చేశారు. బుధవారం మోర్తాడ్‌లో బీడీ కార్మికులతో అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకు లింకేజీ, మొబైల్‌ అకౌంట్‌ ద్వారా బీడీ కార్మికులు వేతనాలు తీసుకనే పరిస్తితి లేదని ఆమె తెలిపారు. గ్రామ గ్రామాన బ్యాంకులు ఏర్పాటు చేసి ...

Read More »

జనవరిలో నేనే పరీక్ష పెడతా… ఫలితాలు పరిశీలిస్తా…

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్తులందరు ఏగ్రేడ్‌లో పాస్‌ అయ్యేవిధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశాలు జారీచేశారు. మంగళవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో విద్యాశాఖాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిపాఠశాలలో ప్రధానోపాద్యాయులందరు విధిగా పాఠశాలలో ఉండి విద్యార్థుల చదువులు ఎలా జరుగుతున్నాయో సమీక్షించాలన్నారు. ఉపాధ్యాయుల గైర్హాజరు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా 10వ తరగతి ఫలితాలపై ఇప్పటినుంచే ...

Read More »

నగదు రహిత లావాదేవీలపై అవగాహన

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవినీతిని నిర్మూలించడానికి నగదు రహిత లావాదేవీలు ఎంతగానో ఉపయోగపడుతాయని ప్రజలందరు క్యాష్‌లెస్‌పై అవగాహన పెంచుకొని క్రయ విక్రయాలు జరపాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని లలితమహల్‌ ప్రాంతంలోని మీసేవా, గాంధీగంజ్‌, వినాయక్‌నగర్‌లోని ఎస్‌బిహెచ్‌ బ్యాంకు, మీసేవా సెంటర్లను తనిఖీ చేశారు. మీసేవా సెంటర్లో నిర్వాహకులు, వినియోగదారులు, బ్యాంకులో అధికారులు, ఖాతాదారులు, మార్కెట్‌ వ్యాపారులు కొనుగోలు దారులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మీసేవకు ...

Read More »