Breaking News

Daily Archives: December 10, 2016

పర్యాటక స్థలాలను అభివృద్ది చేయాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో పిల్లలకు, పెద్దలకు, మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అధునాతన పద్దతిలో పార్కులు ఏర్పాటు చేయాలని అటవీశాఖాధికారులకు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం నిజామాబాద్‌ నగర శివారులోని ధర్మపురి హిల్స్‌ అటవీ ప్రాంతాన్ని, చిన్నాపూర్‌ అడవి, మామిడిపల్లి పరిధిలోని అటవీ ప్రాంతాలను స్వయంగా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ధర్మపురి హిల్స్‌ ప్రాంతంలోని అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పార్కులు ఏర్పాటు ...

Read More »

పేదలకు అండగా కళ్యాణలక్ష్మి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిరుపేద కటుంబంలో ఉండే ఆడపిల్లలకు పెళ్ల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్దతో పేదలకు అండగా ఉండేందుకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టినట్టు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త తెలిపారు. శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద నిజామాబాద్‌ అర్బన్‌లో 489 మంది లబ్దిదారులకు రూ. 2 కోట్ల 49 లక్షల 38 వేలు సంబంధించిన చెక్కులు పంపిణీ ...

Read More »

మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌ల సంఘం సమావేశం

  కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల విద్యుత్‌ బిల్లులపై చర్చించారు. గత ఎన్నో రోజులుగా గ్రామపంచాయతీకి నిధులు రాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని పేర్కొనడం జరిగిందన్నారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు.

Read More »

మరుగుదొడ్ల లక్ష్యాన్ని సాధించాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో చేపట్టే మరుగుదొడ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించాలని ఎంపిడివో రాములు నాయక్‌ పిలుపునిచ్చారు. నర్వా గ్రామ పంచాయతీలో గ్రామ సభ సమావేశం నిర్వహించారు. గ్రామస్తులతో చర్చించారు. గ్రామంలో 280 మరుగుదొడ్ల లక్ష్యం ఉందని ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రావాలన్నారు. మరుగుదొడ్ల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎపివో సుదర్శన్‌, ఎపిఎం రాంనారాయణగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రఘుపతిరెడ్డి, తదితరులున్నారు.

Read More »

18న పేదలకు దుస్తుల పంపిణీ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :క్రిస్మస్‌ పండగను మండలంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజాంసాగర్‌ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్‌ గంగారెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన క్రైస్తవ పాస్టర్లతో శనివారం సమావేశమయ్యారు. క్రిస్మస్‌ పండగ సందర్భంగా మండలంలోని పేద క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున దుస్తులు అందజేస్తున్నామన్నారు. మండలానికి మొత్తం 200 జతల దుస్తులు రానున్నాయని, వీటిని ఈనెల 18న పేద క్రైస్తవులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Read More »

ఫిజియోథెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంఇవో కార్యాలయంలో భవిత సెంటర్‌ ఆద్వర్యంలో ఫిజియోథెరఫి శిబిరం శనివారం నిర్వహించారు. వైద్యురాలు ప్రణీత విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపారు. మండలంలోని ఆయా పాఠశాలలకు చెందిన 9 మంది వికలాంగ విద్యార్థులను శిబిరానికి తీసుకొచ్చారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో పాటు మానసిక విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లిదండ్రులకు వివరించారు. యోగా వల్ల విద్యార్థులకు అనారోగ్యం కలగకుండా ఫిజియోథెరఫి చికిత్స చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం రాథోడ్‌, ...

Read More »

ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వెలగనూరు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లపై తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల కలిగే వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు తమ ప్రదర్శన ద్వారా తెలిపారు. మరుగుదొడ్డి వాడకం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారని పాటలు, ప్రదర్శన రూపంలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ ...

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన మెసా ప్రతినిదులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సంఘం (టిఎస్‌ మెసా) జిల్లా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. సోమవారం మిలాద్‌ ఉన్‌ నబి సందర్భంగా కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కలెక్టర్‌ను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో మెసా ప్రతినిధులు ఎం.ఎ.బషీర్‌, ఖదీర్‌, గఫూర్‌ శిక్షక్‌, అజ్మత్‌, ఫారూఖ్‌, షౌకత్‌, నవాబ్‌, ...

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

  – ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగాతో మానసిక ఆరోగ్యంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో తెలంగాణ యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 3వ తెలంగాణ రాష్ట్రస్తాయి యోగా చాంపియన్‌ షిప్‌ పోటీలు శనివారం నిర్వహించారు. దీనికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ఆధునిక యాంత్రీక జీవనంలో అందరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నారు. మానసిక సమస్యలనుంచి బయటపడేందుకు యోగా దివ్యౌషదమని పేర్కొన్నారు. ...

Read More »

మునిసిపల్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న బల్దియా కార్యాలయాన్ని శనివారం ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పరిశీలించారు. అధికారులనడిగి భవనానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. భవన నిర్మాణం ఎంత వరకు వచ్చింది, ఎంత కాలంలో పూర్తిచేస్తారనే వివరాలు అడిగారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. నూతన కార్యాలయంలో అధికారులకు సంబంధించిన శాఖలతో పాటు మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించుకోవడానికి సమావేశ భవనాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాన్ని ...

Read More »