Breaking News

Daily Archives: December 12, 2016

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో ప్రయివేటు యూనివర్సిటీల బిల్లును మంత్రి మండలి ఆమోదించడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెలిమెల బానుప్రసాద్‌ మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడితే సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కెసిఆర్‌ ఎన్నికల హామీ అయిన కెజినుంచి పిజి ఉచిత విద్యను పక్కనబెట్టి ప్రబుత్వం మరోవైపు ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం ఎందుకోసమని ...

Read More »

ఎమ్మెల్యేను కలిసిన యాదవ సంఘం ప్రతినిధులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ను సోమవారం జిల్లా యాదవ సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా యాదవ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేను కలుసుకొని సన్మానించారు. యాదవ సంఘం అభివృద్దికి ఎమ్మెల్యే సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ, కౌన్సిలర్‌ కుంబాల రవి యాదవ్‌, నాయకులు లక్ష్మిపతి, మల్లేశ్‌, సత్యనారాయణ, సాయన్న, కృష్ణ, వెంకటి, ...

Read More »

మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాలలో పండ్ల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో మానవ హక్కులు- పరిరక్షణ చట్టాలు రాష్ట్ర అవగాహన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అద్యక్షుడు బి.ఎం.ఎస్‌.వి భద్రయ్య మాట్లాడుతూ పిల్లలు కష్టపడి చదువుకోవాలని, జీవితంలో అభివృద్ది చెందాలన్నారు. అధ్యక్షుడు డాక్టర్‌ మల్లికార్జున్‌ మాట్లాడుతూ మహ్మద్‌ ప్రవక్త ...

Read More »

భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

  – ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తామని, వారి సమస్యలు ముఖ్యమంత్రి దృస్టికి తీసుకెల్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2003 నుంచి భవన నిర్మాణ రంగ ...

Read More »

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలో మైనార్టీలు నిర్వహించిన ర్యాలీని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి కామారెడ్డి జిల్లాకు మంచి పేరుందని, మత సామరస్యాన్ని అలాగే కాపాడుతూ కలిసి మెలిసి ఉండి పండగ నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం మైనార్టీలు ఒంటెలు, జీపులు, ద్విచక్ర వాహనాలపై జెండాలతో పట్టణంలోని ప్రధాన ...

Read More »

గడ్డివాము దగ్దం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ శివారులో శ్రీనివాస్‌కు చెందిన పది ఎకరాల గడ్డివాము దగ్దమైనట్టు రెవెన్యూఅధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తు సంఘటన జరిగిందని లక్ష రూపాయల గడ్డి కాలి బూడిదైందని అధికారులు వివరించారు. కోతల అనంతరం పంట పొలాల్లో గడ్డి నిలువ ఉంచకుండా ఆయా ప్రాంతాల్లో సురక్షితంగా ఉంచితే పశుగ్రాసం చేతికందుతుందని తెలిపారు. పశు సంపద అధికంగా ఉందని పంట కోసిన అనంతరం గడ్డిని నిలువ ఉంచాలని సూచించారు. వృధాగా కాలిపోవడం బాధాకరంగా ఉందన్నారు.

Read More »

కామారెడ్డి డిఎస్పీ బదిలీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలోని డిఎస్పీ, ఆస్థాయి ర్యాంకు అధికారులను 50 మందిని బదిలీ చేస్తూ పోలీసుశాఖ డిజిపి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 50 మంది అదికారులను బదిలీ చేయగా, కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ సైతం బదిలీ అయ్యారు. భాస్కర్‌ను ఆసిఫాబాద్‌ డిఎస్పీగా బదిలీ చేశారు. హైదరాబాద్‌ సిటీ ఏసిపి, సిసిఎస్‌గా పనిచేస్తున్న కె.ప్రసన్నరాణిని కామారెడ్డి డిఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో బదిలీ అయిన స్థానంలో ...

Read More »

విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించండి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించి విద్యుత్‌ అధికారులకు సహకరించాలని మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో విద్యుత్‌శాఖ అధికారులు ప్రచార కార్యక్రమం కొనసాగించారు. లైన్‌మెన్‌ రాములు ఆద్వర్యంలో గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ వాహనం ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బోరుమోటారు గలవ్యక్తులు, గృహ అవసరాల నిమిత్తం విద్యుత్‌ చార్జీలు బకాయిలున్న వారు, పారిశ్రామిక వేత్తలు విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. అలా చెల్లిస్తే నిరంతర విద్యుత్‌ ...

Read More »

షీ టీం అవగాహన కార్యక్రమం

  నందిపేట, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో సోమవారం ఆర్మూర్‌ రూరల్‌ సిఐ లక్ష్మినర్సింహస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్తినిలు మనోధైర్యం కలిగి ఉండాలని, ఎవరైనా ఆకతాయిలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు గాని, 100 కు సమాచారం అందిస్తే ఆకతాయిలను పట్టుకొని శిక్షించడం జరుగుతుందని తెలిపారు. ఆయనతో పాటు ఎస్‌ఐ జాన్‌రెడ్డి, తదితరులున్నారు.

Read More »

వరుస సెలవులతో పైసల్‌ లేవు

  నందిపేట, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద నోట్లు రద్దుచేసి సోమవారం నాటికి 35 రోజులు గడుస్తున్నా ప్రజల అవస్థలు తగ్గుముఖం పట్టడం లేదు. బ్యాంకుల వద్ద బారీగా బారులు కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ లైన్లు కనిపించడం లేదు. ఇది ప్రజల కరెన్సీ కస్టాలు తీరినందువల్ల కాదు… గత మూడురోజుల నుంచి శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు రావడంతో ప్రజలు బ్యాంకుల వద్ద లైన్లు కనపడడం లేదు. సోమవారం ప్రజలు ఎప్పటిలాగే బ్యాంకు వద్దకొచ్చి సెలవు ...

Read More »

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

  నందిపేట, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మహ్మాద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా సోమవారం మర్కజీ మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ పండగను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం బర్కత్‌పురలోని ఇబ్రహీం మజీద్‌ వద్దనుంచి ప్రారంభమైన శోబాయాత్ర ప్రధాన వీదుల గుండా సాగి రహమానియా మజీద్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంతో ముగిసింది. ఈ సందర్భంగా మౌలానా గులామ్‌ రఫీక్‌ మాట్లాడుతూ అల్లా యొక్క చివరి ప్రవక్త అయిన మహ్మద్‌ ...

Read More »