Breaking News

Daily Archives: December 13, 2016

బ్యాంకుల వద్ద ప్రజలకు తప్పని ఇక్కట్లు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజులు బ్యాంకులకు సెలవు దినం కావడంతో రైతులకు వ్యాపారస్తులకు బ్యాంకులో నగదు తీసుకోవడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని బీర్కూర్‌ ఆంధ్రాబ్యాంకు, రైతునగర్‌ ఎస్‌బిహెచ్‌లో తెల్లవారుజామున 3 గంటల నుంచే వరుసలో నిలుచున్నారు. నోట్ల రద్దుతో పలు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. నోట్ల రద్దు సబబే అయినప్పటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజువారి ఖర్చుల నిమిత్తం బ్యాంకు ముందు నిలబడడం వ్యయ ప్రయాసతో కూడుకుందని, ఎటిఎంలలో ...

Read More »

సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. మండలంలోని కోమలంచ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సత్యనారాయణను ఎంపిపి సునంద, గంగారెడ్డి, గున్కుల్‌ సింగిల్‌విండో ఛైర్మన్‌ సయ్యద్‌ మోయినుద్దీన్‌ షాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించేందుకు ...

Read More »

దత్త ఆలయంలో ప్రత్యేక పూజలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ శివారులో దత్తాత్రేయస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పురోహితుడు సంజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పుణ్యాహవాచనం, స్వామివారికి అభిషేకాలు, మండప ఆరాధన, హోమం నిర్వహించినట్టు తెలిపారు. దత్తజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

కొనసాగుతున్న వైద్య శిబిరం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట్‌ గ్రామంలో అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం నిరంతరంగా కొనసాగుతుంది. కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురైన బాధితులకు, రోగులకు చౌట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, సూపరింటెండెంట్‌ ఆనవాలు, ఏఎన్‌ఎం శారదలు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. తహసీల్దార్‌ సోమేశ్వర్‌ వైద్య శిబిరాన్నిసందర్శించి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్‌లోని పలు ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న బాధిత రోగులను సర్పంచ్‌ పరామర్శించారు. గ్రామానికి చెందిన పెళ్లి ...

Read More »

ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హమీ పథకం కింద కూలీలకు ఉపాధి కల్పించాలని ఎంపిడివో తెలిపారు. మంగళవారం తహసీల్‌ కార్యాలయంలో మండల అధికారులతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్షరెన్సు జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నగదు రహితపై అవగాహన కల్పించాలని, అంతేకాకుండా నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణానికి 925 మంది దరఖాస్తు చేసుకున్న వారి ...

Read More »

వైభవంగా దత్తజయంతి వేడుకలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మోర్తాడ్‌, సుంకెట్‌, రామన్నపేట్‌ గ్రామాల్లోగల సాయి ఆలయాల్లో కన్నుల పండువగా దత్తజయంతి వేడుకలు సాయి భక్తులు నిర్వహించారు. సాయి ఆలయాల్లో తులసీపూజ, పల్లకిసేవలో సాయిబాబాను భక్తులు భజనలు చేస్తు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం సాయిదీక్షా పరులు ఆలయంలో పాలాభిషేకం, హారతి నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. దత్తజయంతిని పురస్కరించుకొని ఆలయాలను పూలమాలలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

Read More »

సబ్సిడీ తాటిపత్రాలు సద్వినియోగం చేసుకోవాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం సబ్సిడీ కింద తాటిపత్రాలను సరఫరా చేసిందని ఏఓ లావణ్య మంగళవారం తెలిపారు. అవసరమున్న రైతులు పట్టా పాసుపుస్తకం జిరాక్సు, ఆధార్‌కార్డు జిరాక్సు, రెండు ఫోటోలతో పాటు ఎంఎస్‌ యూనియన్‌ క్వాలిటి ప్లాస్టిక్‌ లిమిటెడ్‌ ముంబయి పేబిల్‌ ఎట్‌ హైదరాబాద్‌ పేరుతో 1250 రూపాయలు డిడి తీసి దరఖాస్తు ఫారంతో జతచేసి వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో వ్యవసాయాధికారులను సంప్రదించాలని ఆమె కోరారు.

Read More »

బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు

  పెర్కిట్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌లో ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా బ్యాంకుల ముందు క్యూలో నిలబడి డబ్బు కొరకు పెర్కిట్‌, కోటార్మూర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకులకు శని, ఆది, సోమవారాలు బంద్‌ కావడంతో, ఎటిఎంలలో కూడా డబ్బు లేకపోవడంతో ఇబ్బంది తలెత్తింది. మంగళవారం తిరిగి బ్యాంకులు సేవలందించడంతో ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ప్రజల సౌకర్యం కోసం బ్యాంకుల ముందు టెంట్లు ...

Read More »

ఈ మాజీ ప్రధానికి సెల్‌ఫోన్ వాడడం రాదు…

నేను మాజీ ప్రధానిని. నాకే ఇప్పటి వరకూ మెబైల్‌ వాడడం రాదు. ఇలాంటి దేశంలో గ్రామీణులందరూ సెల్‌ఫోన్లు వాడాలని మోదీ చెబుతున్నారు. నియంత మాదిరి వ్యవహారశైలితో మోదీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. – హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ప్రధాని

Read More »

సమంతకు.. బంపర్ ఆఫర్!

అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు బంపర్ ఆఫర్ వచ్చింది. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రకు సమంతను తీసుకోవాలని భావిస్తున్నారట చిత్ర దర్శకనిర్మాతలు. ఈ చిత్రాన్ని సావిత్ర జీవిత కథ ఆధారంగా రూపొందించాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, చివరకు నిత్యమీనన్‌ను ఆ పాత్రకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆనూహ్యంగా సమంత పేరు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. సమంత నటనతో పాటు, ...

Read More »

పెళ్లి విందు చాయ్‌తో సరి!

రూ.11 కానుకగా స్వీకరించిన పెళ్లికొడుకు  పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఓ దివ్యాంగ జంట తమ కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు పెళ్లి విందుగా ‘చాయ్‌’ ఇచ్చారు. అంతేకాదు, పెళ్లికొడుక్కి 11 రూపాయలను కానుకగా ఇచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఇలా సాదా సీదాగా పెళ్లి చేసి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్‌ నోయిడాలోని నట్టోకి మాడియా గ్రామంలోని మహవీర్‌ సింగ్‌, గ్యానోల కుమార్తె సంజుకు డిసెంబరు 11న పెళ్లి చేయాలని గతంలో నిశ్చయించారు. పెద్ద నోట్ల అనూహ్య రద్దుతో వారి వద్ద పెళ్లి ...

Read More »

త్రిష హాట్ వీడియో లీక్… ఎలా బయటకు వచ్చింది?

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా త్రిష గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కొత్త హీరోయిన్లు పరిశ్రమకు పరిచయం కావడంతో ఈ గ్లామర్ భామ ఆ పోటీలొ వెనకపడిపోయింది. మళ్లీ ఈ మద్యే త్రిష సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొంత వరకు వైవిద్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటు మళ్లీ తన సత్తా ఎంటో వెండితెరపై చూపిస్తుంది. త్రిష నటించిన ఓ హాట్ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఏమిటి, ఏ సినిమా, లేక పర్సనల్ వీడియోనా అనేది పక్కన పెడితే .. ...

Read More »

మోదీ ఫకీరు కాదు.. నియంత

నోట్ల రద్దుతో విధ్వంసం సృష్టించారు.. పేదల బతుకును నాశనం చేశారు: ఎంపీ అసద్‌ హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ఫకీరు కాదని, ఓ నియంత అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు. బహిరంగ సభల్లో తనకుతాను ఫకీరుగా ప్రకటించుకుంటున్న మోదీ రూ.15లక్షల ఖరీదైన సూట్‌ ఎలా ధరించారని ఓవైసీ ప్రశ్నించారు. ఫకీర్‌ అయిన మోదీకి రోజుకు రెండు, మూడు రకాల కొత్త డ్రెస్‌లు, శాలువాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమైన సమస్యలపై 50 రోజులు ఓర్చుకోవాలన్న ప్రధానికి, ...

Read More »

చమురు ధర భగ్గు

క్రిస్మస్‌ నాటికి పీపా 60 డాలర్లు! న్యూఢిల్లీ : ముడి చమురుసెగలుకక్కుతోంది. ఉత్పత్తి తగ్గించేందుకు రష్యా సహా మరిన్ని దేశాలు అంగీకరించడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్కసారిగా ఐదు శాతానికిపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో జనవరిలో డెలివరీ ఇచ్చే పీపా బ్రెంట్‌ ముడి చమురు 56.64 డాలర్లు, వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ ముడి చమురు 53.78 డాలర్లకు చేరాయి. వీటి ధర గత ఏడాదిన్నరలో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. కోటాకు మించి ఉత్పత్తి తగ్గించేందుకు సౌదీ ఆరేబియా ...

Read More »

బ్రేకింగ్ న్యూస్.. యాక్సిస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కీలక ప్రకటన

ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన యాక్సిస్ బ్యాంకుకు ఊరటనిచ్చింది. ఆ బ్యాంకు భవితవ్యంపై వస్తున్న వదంతులకు తెరపడింది. ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయబోమని ఆర్‌బీ‌ఐ ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు దరిమిలా అక్రమ లావాదేవీల నేపథ్యంలో ఆ బ్యాంకు లైసెన్సు రద్దవుతుందని ప్రచారం జరిగింది. పెద్ద నోట్ల మార్పిడి సమయంలో అక్రమ మార్గంలో బడా వ్యాపారులకు సహకరించారన్న ఆరోపణలపై ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. ఆ బ్యాంకు శాఖలో వివిధ ఆరోపణలపై 19 ...

Read More »

చెన్నై చిన్నాభిన్నం

చెన్నై: వర్దా తుపాను ధాటికి చెన్నై మహానగరం చిగురుటాకులా వణికింది. తుపాను కారణంగా వీచిన ప్రచండ గాలులతో తమిళనాడు రాజధాని చిన్నాభిన్నమైంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో భవనాలు, వాహనాలపై చెట్లు కుప్పకులాయి. కార్లు తిరగబడ్డాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. హోర్డింగ్‌ లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. ...

Read More »

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు

త్వరలో రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా జరగవచ్చన్నారు. రద్దు చేసేందుకు రెండు వేల రూపాయల నోటు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఐదొందల నోటే అతి పెద్ద నోటుగా చెలామణిలో ఉంటుందని గురుమూర్తి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్‌నాటికే ఈ రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి తొలగిస్తారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు మీడియా సంస్థలు దీనికి సంబంధించి ...

Read More »

జయ ఖర్చును అపోలో కోరలేదు: సర్కారు

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు 7 5 రోజుల చికిత్స కోసం ఖర్చులను అందించాలని అపోలో యాజమాన్యం రాష్ట్రప్రభుత్వాన్ని కోరలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. జయ అనారోగ్యంతో సెప్టెంబర్‌ 22న చెన్నై గ్రీమ్స్‌ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతిచెందినట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది. ఆస్పత్రిలో 75 రోజుల పాటు జయకు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన చికిత్స అందించారు. అందుకు రూ.90 కోట్లు ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ… జయ ...

Read More »