Breaking News

Daily Archives: December 14, 2016

వైభవంగా నంది విగ్రహ ప్రతిష్టాపన

  నందిపేట, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో నందిపేట గ్రామాభివృద్దికమిటీ ఆద్వర్యంలో బుధవారం శ్రీశ్రీశ్రీ మంగిరాములు మహరాజ్‌ వేద మంత్రోచ్చారణల నడుమ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమంలో నందివిగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. నందిపేట పేరును సార్థకం చేయడానికి మండల కేంద్రంలోని ముఖ్య కూడలి వద్ద 10 అడుగుల ఎత్తు, పది టన్నుల భారీ నల్లరాయి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. గ్రామస్తుల చిరకాల స్వప్నం ఫలించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులులేకుండా పోయింది. ప్రతిష్టాపన ...

Read More »

దళితుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

  – ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి 40 మంది లబ్దిదారులకు 51 వేల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం దళితుల, మైనార్టీల అభివృద్దికి చిత్తశుద్దితో కృషిచేస్తూ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లాంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బృహత్‌ కార్యక్రమమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపిపి ...

Read More »

కార్మికుల సమస్యలపై ఎమ్మెల్సీకి వినతి

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లాలని కామారెడ్డి మునిసిపల్‌ కార్మికులు బుధవారం కామారెడ్డికి వచ్చిన ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ రావున కలిసి వినతి పత్రం సమర్పించారు. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, హెల్త్‌కార్డులు తదితర సౌకర్యాలు ప్రబుత్వం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్‌ కార్మికుల్లో దళిత, బడుగు, బలహీన వర్గాల కార్మికులే పనిచేస్తున్నారని, ప్రబుత్వం తమనుఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ స్పందిస్తూ తెలంగాణరాష్ట్రం ఏర్పడ్డాక మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ...

Read More »

వాగ్దానాలు అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

  – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల మల్లేశ్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో కెసిఆర్‌ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల మల్లేశ్‌ విమర్శించారు. బుధవారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో నిర్వహించిన కామారెడ్డి జిల్లా సిపిఐ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రిచేస్తానని, ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల ...

Read More »

సిఐటియు ఆద్వర్యంలో మానవ హారం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు కార్మిక వర్గం పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం సిఐటియు ఆద్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కారు సెప్టెంబరు 2 సమ్మె సందర్భంగా ప్రకటించిన గెజిట్‌ను జివో ఇచ్చి అమలుచేయకుండా సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పనికి, సమాన వేతనం అమలుచేయకుండా తొక్కిపెట్టి బహుళ జాతి సంస్థల కొమ్ము ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీల నిర్ణయం దారుణం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రయివేటు విద్యాసంస్థలను యూనివర్సిటీలను ప్రోత్సహించేలా ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు తీసుకురావాలని చూడడం దారుణమని తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్‌ అన్నారు. కామారెడ్డిలో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని చెబుతూ ప్రయివేటు విద్యాసంస్థలను ప్రోత్సహించేలా బిల్లు తీసుకురావడం సమంజసం కాదన్నారు. విద్యను వ్యాపారం చేయాలని చూడడం సరికాదన్నారు. ప్రయివేటు యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ...

Read More »

ప్రతీ ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  కామారెడ్డి,, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకొని పారిశుద్యాన్ని పాటించాలని 28వ వార్డుకౌన్సిలర్‌ అరికెల ప్రభాకర్‌ యాదవ్‌ అన్నారు. కామారెడ్డి మెప్మా జిల్లాకార్యాలయంలో బుధవారం సమాఖ్య సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి 12 వేల రూపాయలు చెల్లిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించి పారిశుద్యాన్ని ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం

  కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రయివేటు యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రయివేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఉద్యమించాలని పిడిఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌బి అతిథిగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆజాద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు బానుప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్‌లు మాట్లాడారు. తెలంగాణ ప్రబుత్వం విద్యా ...

Read More »

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామం పెదవాగునుంచి బుధవారం ఉదయం టిప్పర్‌ ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని ఏర్గట్ల ఎస్‌ఐ హరిప్రసాద్‌ పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

Read More »

నగదు రహిత లావాదేవీలపై అవగాహన

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌, తిమ్మాపూర్‌, ఏర్గట్ల పలు గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారులు శంకరయ్య, చంద్రశేఖర్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ ఆయా గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామస్తులతో సమావేశమై నగదు రహిత లావాదేవీలు జరపాలని ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. అంతేకాకుండా పలు ప్రయివేటు సంస్థలు సైతం క్యాష్‌లెస్‌పై అవగాహన కల్పించారు.

Read More »

తడపాకల్‌లో సిఐడి అధికారుల విచారణ

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తడపాకల్‌ గ్రామంలో పూసల శ్రీనివాస్‌ అనే బాధిత కుటుంబాన్ని బుధవారం సిఐడి అధికారులు విచారించారు. మోర్తాడ్‌కు చెందిన మహేశ్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడి వద్ద దుబాయ్‌ వెళ్లేందుకు తడపాకల్‌కు చెందిన పూసల శ్రీనివాస్‌ టికెట్‌ బుకింగ్‌ కోసం ఆశ్రయించాడు. మహేశ్‌ ట్రావెల్స్‌ నిర్వాహకుడు మహేశ్‌ టికెట్‌తో పాటు డ్రగ్స్‌ ప్యాకెట్లను మందుల ప్యాకెట్‌ అని చెప్పి సంబంధిత చిరునామాకు అందజేయాలని ఫోన్‌ నెంబరుతో సహా తడపాకల్‌కు వెళ్లి శ్రీనివాస్‌కు ఇచ్చాడు. అమాయకుడైన ...

Read More »

గాండ్ల తేలికుల జిల్లాస్థాయి ఎన్నికలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18వ తేదీన అఖిల గాండ్ల తేలికుల కామారెడ్డి జిల్లా స్థాయి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు, రిటైర్డ్‌ తహసీల్దార్‌ గాండ్ల నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18న కామారెడ్డిలో పాత సాయిబాబా ఆలయం వెనకగల పాఠశాలలో ఎన్నికలు జరుగుతాయని, కామారెడ్డి జిల్లా అఖిల గాండ్ల తేలికుల సభ్యులు సమావేశంలో పాల్గొనాలని, సంఘం అభివృద్దికై పలు సూచనలు, సలహాలు సభ్యులు ఇవ్వాల్సిందిగా, నూతనంగా ఎన్నుకోబడే జిల్లాస్థాయి కార్యవర్గ సభ్యులను సన్మానించాల్సిందిగా ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీలను అనుమతించడం తగదు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ విద్యార్థి వేదిక నిరంతరం పోరాటం చేస్తుందని, అయితే తెలంగాణలో ప్రస్తుతం ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లు కేబినేట్‌ ఆమోదించడం విడ్డూరంగా ఉందని వేదిక తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం వర్సిటీలోని ఆర్ట్స్‌ & సైన్స్‌ కళాశాల ఎదుట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం రమేశ్‌ మాట్లాడుతూ ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానించడమంటే పేద విద్యార్థులను చదువుకు దూరం ...

Read More »

విద్యార్థులను చైతన్యపరిచేందుకే ఎటిఎం కార్డుల పంపిణీ

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహకార బ్యాంకు ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటిఎం కార్డులను, ఖాతాలను బుధవారం తాల్ల రాంపూర్‌ సొసైటీ ఛైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, బ్యాంకు మేనేజర్‌ సందీప్‌ శర్మలు అందజేశారు. విద్యార్థులకు ఉచితంగానే ఖాతాలను, ఎటిఎం కార్డులు అందిస్తున్నామన్నారు. ఖాతాలు, ఎటిఎంల వల్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ నేరుగా జమ కావడం, ఈవిషయమై మరింత చైతన్య పరిచేందుకే అందిస్తున్నట్టు వారుతెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రీకౌంటింగ్‌లో ట్రంప్‌దే గెలుపు

వాషింగ్టన్: అమెరికాలో ఇప్పుడంతా ట్రంప్ హవా నడుస్తోంది. ప్రపంచమంతా ట్రంప్ వైఖరిని సైలెంట్‌గా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల పట్ల కాబోయే అధ్యక్షుడి వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టమవుతోంది. విజయం అసాధ్యం అని ట్రంప్‌పై దుమ్మెత్తి పోసిన వాళ్లే.. ఇప్పుడు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకో.. నమ్మకం లేకనో.. గ్రీన్ పార్టీ తరపున ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన జెల్ల్ స్టెయిన్.. ఫలితాల రీకౌంటింగ్‌కు పిటిషన్ వేశారు. దీంతో పెనస్లేవియా, విస్కన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో అద్భుతం ...

Read More »

పన్నులు తగ్గుతాయి

 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ  న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు వల్ల లెక్కల్లో చూపకుండా దాచిన సొమ్ము బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వస్తున్నదని, ఫలితంగా భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గుతాయని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఎవరైనా భారీ మొత్తాల్లో అక్రమంగా నగదు దాచినట్టయితే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. భారీ మొత్తాల్లో నగదు నిల్వ అవుతున్న ప్రదేశాలపై దర్యాప్తు సంస్థలు కన్నేసి ఉంచాయని ఆయన అన్నారు. నవంబరు ఎనిమిదో తేదీన ప్రభుత్వం అధిక విలువ ...

Read More »

గల్ఫ్‌లో డిజిటల్ మనీ

గల్ఫ్ దేశాలలో ఎలాంటి పన్నుల విధానం లేదు. ఇది ఈ దేశాల ప్రత్యేకత. పైగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న కారణంగా సంపన్న పాశ్చాత్య దేశాల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల వాడకం ఇక్కడే ఉన్నది. అమెరికాలో ఇంటర్నెట్ వాడకం 87శాతం మాత్రమే కాగా బహ్రెయిన్లో 99శాతంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. గల్ఫ్‌లోని రెండు పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలలో మొబైల్ సిమ్ కార్డులన్నీ కూడా వినియోగదారుల వేలిముద్రలతో అనుసంధానం చేయబడి సురక్షి తంగా ఉన్నాయి. జనాభాలో ...

Read More »

కువైట్‌లో భారతీయుడి మృతి

కువైట్: పొట్టకూటి కోసం కుటుంబాన్ని వదిలి వలస వెళ్లిన భారతీయుడు మృత్యువాత పడ్డాడు. రోజువారీ కూలీ చేసి నెలకు కాసిన్ని డబ్బుల్ని ఇంటికి పంపించి అప్పులు తీర్చుతూ, కుటుంబాన్ని పోషిస్తున్న కేరళవాసి కువైట్‌లో మరణించాడు. కేరళలోని పతానంతిట్ట ప్రాంతానికి చెందిన సాజు దానియేల్ అనే 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కువైట్‌లో పనిచేస్తున్నాడు. భార్య జూలీ సాజు, ఇద్దరు చిన్నారులతో సహా కువైట్ వెళ్లిపోయి అబ్బాసియాలో ఉంటున్నాడు.  అయితే అనుమానాస్పద రీతిలో అతడు చనిపోయినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. గల్ఫ్ కేబుల్ కంపెనీలో పనిచేస్తున్న ...

Read More »

భారీగా తగ్గిన ధరలు

నోట్ల రద్దుతో ద్రవ్యోల్బణం దిగువకు నవంబరులో 3.63 శాతం  రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా దిగివచ్చింది. నవంబరు నెలలో 3.63 శాతంగా నమోదైంది. డీమానిటైజేషన్‌ ప్రభావం వల్ల ప్రజల చేతిలో నగదు నిల్వలు తగ్గడం దీనిపై ప్రభావం చూపించింది. ఆహార వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. 2014 జనవరి తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ స్థాయికి దిగిరావడం ఇదే ప్రథమం. అక్టోబరు నెలలో ఇది 4.20 శాతం, గత ఏడాది నవంబరులో 5.41 శాతం ఉంది. కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం ...

Read More »

హైదరాబాద్‌‌లో వర్షం..

హైదరాబాద్‌: భాగ్యనగరంలో వర్షం కురుస్తోంది. తమిళనాడు, కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలు వార్దా తుపానుతో వణుకుతున్నాయి. అయితే మంగళవారం రాత్రి 11.00 గంటల నుంచి నగరంలో వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, శ్రీ కృష్ణా నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడా వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వార్దా తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉందని వాతావరణ శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ...

Read More »