Breaking News

Daily Archives: December 15, 2016

జిల్లాలో 75.70 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2017 ఫిబ్రవరి నెల చివరికల్లా దేశంలోని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, గ్రామాల్లో 100 శాతం మరుగుదొడ్లు పూర్తిచేయాలని ఇందుకోసం ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్దతో విధులు నిర్వహించాలని స్వచ్చభారత్‌ జాయింట్‌ సెక్రెటరీ ఐఏఎస్‌ నిపుల్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో వీడియోకాన్ఫరెన్సులో ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్‌లతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్చభారత్‌ మిషన్‌ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దీని ...

Read More »

ఆరంభమైన ఆరుతడి సాగు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి పంటల సాగుచేసేందుకు రైతులు దుక్కులు చేపట్టి భూములను చదును చేసే పనిలో నిమగ్నమయ్యారు. మూడేళ్ళుగా వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురియకపోవడంతో రైతులు తమ భూములను బీడులుగా వదిలేశారు. సెప్టెంబర్‌ మాసంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు సమృద్ధిగా పెరగడంతో బీడుగా ఉన్న భూముల్లో సైతం పంటలు సాగుచేస్తున్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న పంట సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు సరైన సమయంలో యాసంగి పంటలకు ...

Read More »

ముసుగులు తొలిగేదెన్నడో…

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గ్రామ పంచాయతీల పరిపాలనను ఈ పంచాయతీలుగా మార్చేందుకు గత సంవత్సరం ఓ అడుగు ముందుకు వేసింది. అందుకు కావాల్సిన ఏర్పాటు కూడా చేసింది. మండలంలోని17 గ్రామ పంచాయతీలకు ఆన్‌లైన్‌ పనులు కూడా పూర్తిచేసి ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు కూడా అందజేశారు. కానీ వాటిని నేటికి ప్రారంభించలేదు. పంచాయతీలకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించకపోవడంతో సంవత్సర కాలం నుంచి కంప్యూటర్‌లపైన ఉన్న ముసుగు కూడా తొలగించలేదు. ఈ పంచాయతీ ఎప్పుడు అవుతుందోనని ప్రజలు ...

Read More »

సాగర్‌ జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో 5.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో ఆయకట్టు కింద రబీ సాగుకోసం 720 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా 720 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయగా జలవిద్యుత్‌ కేంద్రం నుంచి ప్రధాన కాలువద్వారా నీటి ప్రవాహం ప్రారంభమైంది. దీంతో జల విద్యుత్‌ కేంద్రంలో రెండవ టర్బయిన్‌ నుంచి 5.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని జెన్‌ కో ఎ.డి. శ్రీకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం 720 క్యూసెక్కుల నీటి ప్రవాహం ...

Read More »

ధాన్యం డబ్బుకోసం రోడ్డెక్కిన రైతులు

  డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి, ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు డబ్బు చెల్లించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ డిచ్‌పల్లి రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నెలరోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని సహకార బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖాతాల్లో డబ్బు జమచేస్తామని ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. తమ తమ ఖాతాల్లో డబ్బు జమచేసేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. అసలే నోట్ల ...

Read More »

టియు అకడమిక్‌ ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌కు సన్మానం

  కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ విద్యావర్ధినిని గురువారం కామారెడ్డి విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల విషయాలను చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కాశాగౌడ్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

డ్రా పద్దతిలో విద్యార్థుల ఎంపిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని పబ్లిక్‌స్కూల్‌ పాఠశాలలో 2017-18 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం డ్రా పద్దతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. గురువారం జేసి సత్తయ్య సమక్షంలో డ్రా నిర్వహించారు. డ్రాలో నలుగురు ఎస్సీ విద్యార్థులు పాల్గొనగా ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు. మిగతా ఇద్దరిని వెయిటింగ్‌ జాబితాలో ఉంచినట్టు తెలిపారు.

Read More »

ఎటిఎంకు పూజలు నిర్వహించి వినూత్న నిరసన

  కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటిఎంను కరుణించి ప్రజలకు డబ్బు అందజేయాలని కామారెడ్డి యువజన కాంగ్రెస్‌ ఆద్వర్యంలో గురువారం ఎటిఎంలకు పూజలు నిర్వహించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నల్లధనం విషయంలో నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని నేటికి 36 రోజులు గడిచినా సామాన్యులు ఇప్పటికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దేశంలో ఎన్నో ఎటిఎంలు ఉండి అవి మూతపడి ఉన్నాయని పేర్కొన్నారు. సామాన్యునికి 500, 1000 నోట్లు అవసరం కాగా 2 వేల నోట్లను ...

Read More »

పరీక్షా కేంద్రాల తనిఖీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షా కేంద్రాలను గురువారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఆచార్య కనకయ్యలు తనిఖీ చేశారు. పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షా నిర్వహణ తీరును పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాస్‌ కాపియింగ్‌ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read More »

కలెక్టరేట్‌ను ముట్టడించిన బీడీ కార్మికులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు నగదు రూపంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో బీడీ కార్మికులకు బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. వారికి నెలనెల ఇచ్చే కూలీ డబ్బులను ...

Read More »

ప్రయివేటు యూనివర్సిటీ బిల్లు రద్దుకోసం ఆందోళన

  పిడిఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల అరెస్టు కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రయివేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం తీసుకొస్తున్న బిల్లును రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్‌ల ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇంటిని ముట్టడించారు. ఇంటిఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. విద్యార్థి నాయకులు ఎంతకూ చెప్పినా వినకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ...

Read More »

పనిచేయని ఎటిఎంలు… ఇబ్బందుల్లో ప్రజలు..

  బాన్సువాడ, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రాంతంలో ఐదారు రోజులుగా ఎటిఎంలు మూతపడి ఉండడం ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో నగదు అందుబాటులోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎటిఎంల ద్వారా కొద్దో గొప్పో డబ్బు వస్తే వెసులుబాటుగా ఉండేది. కొన్ని రోజులుగా ఎటిఎంలు పనిచేయకపోవడం డబ్బుకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బ్యాంకుల ద్వారా డబ్బు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి ప్రజలు బారులు తీరిఉండడం కనిపిస్తుంది. ఈ క్రమంలో డబ్బు అవసరమున్నవారికి అవస్థలు పడాల్సిన పరిస్తితి ...

Read More »

వడ్డీరేట్లు పెంచిన అమెరికా

భారత్ కు పెద్ద దెబ్బ? వాషింగ్టన్‌: అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి. ‘ఫెడరల్‌ రిజ ర్వు’ వడ్డీ రేటును 0.25 శాతం పెంచాలని నిర్ణయించింది. గతేడా ది డిసెంబర్‌లో కూడా 0.25 శాతం వడ్డీరేటును ఫెడరల్‌ రిజర్వ్‌ పెంచింది. ఈ మధ్యకాలంలో కనీసం అరడజను సందర్భాల్లో రేట్ల పెంపుపై స్పెక్యులేషన్‌ భగ్గుమన్నప్పటికీ అమెరికా కేంద్ర బ్యాంకు రేట్ల పెంపును వాయిదా వేస్తూ వచ్చింది. నోట్ల రద్దు కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న భారతకు ఈ పరిణామం పెద్దదెబ్బగా చెబుతున్నారు. ఫెడ్‌ రేటు పెంపువల్ల విదేశీ ...

Read More »

ఏటీఎం క్యూ లైన్.. వరుసలో పీఎం, మాజీ పీఎం, అద్వానీ

  నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అన్నది అందరికి తెలిసిన సత్యమే. కానీ ఇలా లైన్లో నిల్చున్న వారిని ఎవరూ ఫొటోలు తీయరు. వారి గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రముఖులు క్యూలో నిల్చుంటే మాత్రం ఫొటోలు తీసేసి సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తారు. అలాంటి ఒక ఫొటోనే ఇప్పుడు వైరల్ మారింది. అదేంటంటే ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎల్‌కే అద్వానీ ఒకరి వెంట ఒకరు వరుసగా నిలబడిన ఫొటో. ఈ ఫొటో ఎక్కడ ...

Read More »

‘ఇక్కడకు తేవొద్దు.. అంత్యక్రియలు సౌదీలోనే పూర్తి చేయండి’

పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన ఓ తెలంగాణ పౌరుడు ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మెహమ్మద్ మహెబూబ్ అలీ అనే 22 ఏళ్ల యువకుడు సౌదీకి వలస వెళ్లాడు. సౌదీ అరేబియా- యమన్ సరిహద్దులోని అల్ దర్బ్ అనే ప్రాంతంలో ఎయిర్ కండీషన్డ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పనికి వెళ్లేందుకు తనను తీసుకు వెళ్లేందుకు వచ్చే కారు కోసం ఎదురు చూస్తున్న అలీ.. తన వైపు మరణం ముంచుకొస్తోందని గ్రహించలేకపోయాడు. రోడ్డుపై నిల్చుని ఉన్న అలీని ...

Read More »

పీహెచ్‌డీ ఉంటేనే ‘బీ టెక్‌’ బోధన

ఎంటెక్‌కు కూడా.. జేఎన్ టీయూహెచ్ నిర్ణయం  బీటెక్‌ కోర్సుల బోధనా సిబ్బందికి పీహెచడీ తప్పనిసరి చేస్తూ జేఎనటీయూహెచ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక కోర్సులో రెండు మూడు సెక్షన్స ఉన్నాయి. ఒక్కో సెక్షనలో 60 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల సంఖ్య ఒక సెక్షనకు మించితే బీటెక్‌ విద్యార్థులకు సబ్జెక్టు బోధించే టీచింగ్‌ ఫ్యాకల్టీకి తప్పనిసరిగా పీహెచడీ ఉండాలని, ఎంటెక్‌ కోర్సుల్లో సబ్జెక్టుకు ఇద్దరు పీహెచ్‌డీ పొందిన బోధనా సిబ్బంది ఉండాలని కొత్తగా నిబంధన విధించింది. బుధవారం ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలతో జేఎనటీయూహెచ అధికారులు ...

Read More »

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు… రైళ్లు రద్దు..

మొన్నటి వరకూ ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేయగా.. ఇప్పుడు పొగమంచు కమ్మేసింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పొగ మంచు కారణంగా రైల్వే శాఖ 20రైళ్లను రద్దు చేసింది. పొగ మంచు ప్రభావంతో 61 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 46 రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేశారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని పొగ మంచు కప్పేస్తుండటంతో అధికారులు రైళ్ల వేళల్లో మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.

Read More »

ప్రధానిని క్షమించలేం: ఆంటోనీ

 పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ‘ఈ నిర్ణయం వల్ల జాతీయ విపత్తు దిశగా దేశం పయనిస్తుంది. నల్లధనం ఉన్న వారు దాన్ని తెల్లధనంగా మార్చుకునే అవకాశాన్ని మోదీ ఇచ్చారు. మోదీని క్షమించలేం’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ విమర్శించారు. పెద్ద నోట్లు రద్దు చేశాక సహకార బ్యాంకుల పట్ల ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కేరళ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనను ఉద్దేశించి ఆంటోనీ బుధవారం మాట్లాడారు. కేరళలో ...

Read More »

2017 మే వరకు తిప్పలు తప్పవా?

నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరిన యాభై రోజుల గడువుకు ఇక 15 రోజుల సమయమే మిగిలి ఉంది. నవంబర్‌ 8 నాటి సంచలన ప్రకటనతో, దేశంలోని మొత్తం కరెన్సీ నోట్ల విలువలో ఏకంగా 86.4% వాటా కలిగిన 1000, 500 నోట్లు ఒక్కసారిగా చెల్లుబాటు కాకుండా పోయాయి. అయితే ఈ మొత్తం తిరిగి చలామణిలోకి ఎప్పుడొస్తుందో అన్న ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సరైన సమాధానం దొరకడం లేదు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వార్షిక నివేదిక–2016 ప్రకారం ...

Read More »

ఇప్పటివరకు ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా?

దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు, భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతున్నాయి. వీటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ సాగిస్తున్నారు. పాత నోట్ల రద్దు అనంతరం కర్ణాటక, గోవా ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నగదు, బంగారం వివరాలను అధికారులు వెల్లడించారు. 2016 నవంబర్ 9 నుంచి కర్ణాటక, గోవా ప్రాంతాల్లో మొత్తం రూ.29.86 కోట్ల నగదు పట్టుబడినట్టు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. నగదుతో పాటు 41.6 కేజీల బంగారం, 14 ...

Read More »