Breaking News

ధాన్యం డబ్బుకోసం రోడ్డెక్కిన రైతులు

 

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి, ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు డబ్బు చెల్లించడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ డిచ్‌పల్లి రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు చేసి నెలరోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని సహకార బ్యాంకు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖాతాల్లో డబ్బు జమచేస్తామని ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. తమ తమ ఖాతాల్లో డబ్బు జమచేసేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. అసలే నోట్ల రద్దుతో నానా అవస్తలు పడుతున్నామని, నోట్ల రద్దు వల్ల దేశానికి ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోలన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

Check Also

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ...

Comment on the article