Breaking News

Daily Archives: December 16, 2016

భారత నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా భారత నిర్మాణంలో అందరు భాగస్వాములై మన తెలంగాణను నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపేంందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో రెండోరోజు ముగింపు సమావేశానికి టిఓటిలకు క్యాష్‌లెస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సింగపూర్‌, హాంకాంగ్‌ తదితర దేశాల్లో ఇప్పటికే క్యాష్‌లెస్‌ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. లంచాలు, అవినీతి అరికట్టాలంటే క్యాష్‌లెస్‌ ...

Read More »

ముందుగా మునిసిపాలిటీల్లో నగదురహిత లావాదేవీలపై దృష్టిసారించాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మునిసిపాలిటీల్లో అన్నింకంటే ముందుగా నగదు రహిత లావాదేవీలు జరగాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో మునిసిపల్‌ కమీషనర్లు, అధికారులు, సిబ్బందితో క్యాష్‌లెస్‌ విదానం ఏవిధంగా జరుగుతుందో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మునిసిపాలిటీల్లో ఉన్న ప్రజలందరికి సుమారు 90 శాతం మందికి బ్యాంకు ఖాతాలున్నాయన్నారు. క్యాష్‌లెస్‌ విధానం ప్రజలు సులువుగా నేర్చుకుంటారన్నారు. తమ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్‌గా లావాదేవీలు ఎలా ...

Read More »

లక్ష్యసాధన దిశగా అడుగులువేయాలి…

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని కష్టం అని భావించకుండా ఇస్టపడి చదవాల, ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళితేనే విజయాలు దరిచేరుతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దుబ్బలో బిసి వసతి గృహంలో జిల్లాలోని బిసి హాస్టల్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఒకరోజు ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ఎప్పుడు కూడా చదువు ...

Read More »

రైతులకు చెక్కుల అందజేత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన ధాన్యాన్ని కమీషన్‌ ఏజెంట్లను, దళారులను నమ్ముకోకుండా నేరుగా రైతులు అమ్ముకొని అధిక లాభాలు పొందాలని జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా సూచించారు. శుక్రవారం మార్కెట్‌యార్డులోని రైతుసంక్షేమ భవన్‌లో రైతుబంధు పథకంద్వారా వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీశాఖ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కెట్‌యార్డులో ఈ-నామ్‌ల ద్వారా రైతులు నేరుగా పంటలను అమ్ముకోవాలన్నారు. తమ గ్రామాల్లోని రైతులకు కూడా ఈ-నామ్‌ ద్వారా మార్కెట్‌యార్డులో ...

Read More »

అందరు నగదురహిత లావాదేవీలు జరపాల్సిందే…

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో వచ్చే బుధవారం కల్లా ప్రతి కుటుంబంలో ఇద్దరు చొప్పున నగదు రహిత లావాదేవీలు జరిపించే విధంగా సంబందిత అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో క్యాష్‌లెస్‌పై బ్యాంకుమిత్ర, విఆర్వో, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో అందరు నగదు రహిత లావాదేవీలు జరపాల్సిందేనన్నారు. జిల్లాలో 95 ...

Read More »

తిమ్మాపూర్‌లో జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డి క్రీడలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ఈనెల 19, 20 తేదీల్లో జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డి క్రీడలు నిర్వహిస్తున్నట్టు తిమ్మాపూర్‌ షైనింగ్‌ స్టార్‌ యూత్‌ సభ్యులు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 300 రూపాయల ఎంట్రీఫీజు చెల్లించి క్రీడల్లో పాల్గొనాలని కోరారు. మొదటి బహుమతి 4,444 రూపాయలు, రెండో బహుమతి 2222 రూపాయలు అందజేయనున్నట్టు యూత్‌ అధ్యక్షుడు అజరుద్దీన్‌ పేర్కొన్నారు.

Read More »

మహిళల రక్షణకు చట్టాలు కఠినంగా అమలుచేయాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల రక్షణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిర్బయ, షీటీం పలు ఇతరత్రా చట్టాలను కఠినంగా అమలుచేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తక్క అన్నారు. శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలతో తహసీల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌కు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకై చట్టాలు అమలుచేసినప్పటికి మహిళలకు ...

Read More »

అర్ధరాత్రి వాహనాల తనిఖీ…

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు గత రెండ్రోజులుగా మోర్తాడ్‌ ఎక్సైజ్‌ అధికారులు అర్ధరాత్రి జాతీయరహదారిపై వచ్చిపోయే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవుడు, ఎక్సైజ్‌ సిబ్బంది గత రెండ్రోజులుగా రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో మోర్తాడ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ పటేల్‌ బానోజి, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

నగదు రహిత లావాదేవీలు చేయాలి

  – ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు చేయాలని కామారెడ్డి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయంలో మద్యం దుకాణ యజమానులతో నగదు రహిత వ్యాపారంపై స్టేట్‌ బ్యాంక్‌ కామారెడ్డి బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరాజు ఆద్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దుకాణాల్లో స్వైప్‌ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీంతోపాటు యుపిఐ, యుఎస్‌ఎస్‌బి, ...

Read More »

కామారెడ్డి కళలకు కాణాచి

  కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కళలకు కాణాచి లాంటిదని, ఎందరో నిబద్దత గల కవులకు ఇది నిలయమని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్లా గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షనర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ హితాన్ని కోరే కవిత్వం, సగటు మనిషికి బాసటగా నిలవాలని, కవులు నిబద్దత, నిజాయితీతో రచనలు చేయాలన్నారు. ...

Read More »

అంగన్‌వాడిల సమస్యలపై ఐసిడిఎస్‌ పిడికి వినతి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడిల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు అనుబంధం తెలంగాణ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ కామారెడ్డి పిడికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు సి.హెచ్‌.భారతి మాట్లాడుతూ రాష్ట్రశాఖ పిలుపుమేరకు జిల్లా పరిధిలోని ఐదు ప్రాజెక్టుల్లోగల ఆయాలు, వర్కర్లు ఈనెల 22న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతీ కార్యకర్తకు 15 వేల వేతనం ...

Read More »

సామాజిక, ఆర్థిక వివరాలు సేకరించిన ట్రైనీ కలెక్టర్‌

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ గ్రామానికి చెందిన సామాజిక, ఆర్థిక వివరాలు పూర్తిస్థాయిలో సేకరించి జిల్లా కలెక్టర్‌ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్టు జిల్లా జాయింట్‌ అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించి మోర్తాడ్‌ గ్రామానికి చెందిన సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు జనాభా, కుటుంబాల సంఖ్య, రేషన్‌ కార్డుల సంఖ్య, నీటి తీరువా పన్ను బకాయిలు, పలు ఇతరత్రా అభివృద్దిపనులపై తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ...

Read More »

చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోండి…

  బీర్కూర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గైపీర్లవద్ద అనుమతి లేకుండా చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని మైనార్టీలు తహసీల్దార్‌ కృష్ణానాయక్‌కు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. బీర్కూర్‌ గ్రామంలో గైపీర్ల పూజ నిమిత్తం మొల్ల కులానికి చెందిన మైనార్టీలు సంవత్సరానికి ఒక కుటుంబం చొప్పున దేవునికి పూజలు నిర్వహిస్తారని, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మొల్ల కుటుంబ సభ్యులందరికి అడిగి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం గైపీర్ల దేవునికి పూజలందిస్తున్న ఓ కుటుంబం కులానికి సంబందం లేకుండా ...

Read More »

కలెక్టరేట్‌ ముట్టడించిన బీడీ కార్మికులు

– ధర్నా, ఆందోళన కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీడీ రోలర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సుమారు లక్ష 50 వేల మంది కార్మికులు బీడీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. కేంద్రప్రభుత్వం బీడీ కార్మికుల బట్వాడాలను బ్యాంకుల ద్వారాఇవ్వాలని ఉత్తర్వులుజారీచేయడం సమంజసం కాదన్నారు. నెలరోజులు ...

Read More »

ఏఐపిఎస్‌యు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి

కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐపిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి రైల్వే కమాన్‌మీదగల అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి ఎం.జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీచేయకుండా ప్రయివేటు యూనివర్సిటీ బిల్లు గురించి ఆలోచించడం సరికాదన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు. ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు నిర్ణయాన్ని ...

Read More »

సరుకులు సకాలంలో పంపిణీ చేయాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకులను లబ్దిదారులకు సకాలంలో పంపిణీ చేయాలని డిప్యూటి తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ మస్రూద్‌ అన్నారు. తహసీల్‌ కార్యాలయంలో శుక్రవారం రేషన్‌ డీలర్లతోసమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల సరైన సమయంలో డిడిలు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం అనుమతించిన సరుకులనే లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీ సమయంలో సమయ పాలన పాటించాలని, డికెఆర్‌ లిస్టు ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్నారు. ...

Read More »

మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి కుటుంబంలో మరుగుదొడ్లు నిర్మించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్థానిక ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు రూ. 12 వేలు మంజూరు చేస్తుందన్నారు. బహిరంగ విసర్జన చేయడం వల్ల ప్రజలు రోగాలబారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని, దీన్ని నిరోధించడం కోసం మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలని ...

Read More »

ఫిజియో థెరఫి శిబిరం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్‌సి భవనంలో వికలాంగ విద్యార్థులకు శుక్రవారం ఫిజియో థెరఫి శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్‌ ప్రణీత వికలాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతినిత్యం విద్యార్థులకు వ్యాయామం చేయించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. వ్యాయామం, యోగా వల్ల విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉంటారని ప్రణీత తెలిపారు. కార్యక్రమంలో ఎంఇవో బలిరాం నాయక్‌, ఐఆర్‌టియులు సునీల్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

దుబాయిలో భారతీయ యువకుడి అరెస్ట్

దుబాయ్:బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడు అక్కడ ఓ బ్రిటిష్ మహిళను లైంగికంగా వేధించాడు. ఈ కేసులో అతడిని దోషిగా నిర్ధారించిన కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఏడాది మే 31న 35 ఏళ్ల బ్రిటిష్ మహిళ పచారీ సరుకుల కోసం ఆర్డర్ చేసింది. 23 ఏళ్ల భారతీయ యువకుడు సరుకులు తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. గార్డెన్‌లో కూర్చున్న ఆమె అక్కడికి రమ్మని అతడిని ఆహ్వానించింది. సరుకులు డెలివరీ చేసిన తర్వాత ...

Read More »

ట్వీట్‌ చేసిన పవన్ కళ్యాణ్

గోవధ, రోహిత్‌ ఆత్మహత్య, దేశభక్తి, నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ 5అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయలు సేకరించానన్నారు. గోరక్షణ కోసం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని ట్వీట్‌లో ప్రశ్నించారు. తోలుబెల్టులు, చెప్పులను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధరించకుండా ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో గోవు మాంసాన్ని ఎందుకు నిషేధించలేదని ట్వీట్‌లో ఆయన అడిగారు. రేపురోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై ట్వీట్‌ చేస్తానన్నారు.

Read More »