Breaking News

Daily Archives: December 18, 2016

పెరిక సంఘం అభ్యున్నతికి కృషి

  కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిక సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు పోతరాజువెంకటి అన్నారు.కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో ఆదివారం పెరిక సంఘ సమావేశం ఏర్పాటుచేసి అడ్‌హక్‌ కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా పోతరాజు వెంకటి, కార్యదర్శిగా శ్రీనివాస్‌, కోశాధికారిగా శివప్రసాద్‌, ఉపాధ్యక్షునిగా శేకర్‌, సహ కార్యదర్శిగా మనోజ్‌, గౌరవ సలహాదారులుగా సదాశివుడు, నారాయణలను ఎన్నుకున్నారు.

Read More »

హమాలీ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఐటియు అనుబంధంగా కామారెడ్డి సిమెంట్‌, సలాకా, షాబాదురాయి హమాలీ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సిఐటియు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు సిద్దిరాములు, జిల్లా నాయకుడు చంద్రశేఖర్‌ల సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా నర్సింలు, ఉపాధ్యక్షునిగా సిద్దిరాములు, యాకం రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమేశ్‌, సహాయ కార్యదర్శిగా దత్తాత్రి, కోశాదికారిగా చంద్రం, ముఖ్య సలహాదారుగా రాజు, తదితరులను ఎన్నుకున్నారు.

Read More »

బతుకుపోరు పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ కోసం నిర్వహించనున్న బతుకుపోరు పాదయాత్రకు సంబంధించిన గోడప్రతులను ఆదివారం కామారెడ్డి జేఏసి కాంట్రాక్టు అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ కనీస వేతనం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 21 నుంచి 23 వరకు గజ్వేల్‌ నుంచి హైదరాబాద్‌ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వరకు బతుకుపోరు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో కాంట్రాక్టు అధ్యాపకులు భారీగా ...

Read More »

దృవీకరణ పత్రాల అందజేత

  కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలిఫ్‌ సంస్త ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన అభ్యర్థినిలకు ఆదివారం దృవీకరణ పత్రాలు అందజేశారు. 1992 నుంచి ఉపాధి కల్పనే ద్యేయంగా ఆలిఫ్‌ సంస్థ కృషి చేస్తుందన్నారు. 24 సంవత్సరాలుగా నిరుద్యోగులకు చేయూత నందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం దృవీకరణపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ తేజపు యాదమ్మ, సెంటర్‌ మేనేజర్‌లు స్వప్న, వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌లో రోడ్డు ఫార్మినేషన్‌ నిర్మాణ పనులను ఆదివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు లక్ష రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, ఎ.ఇ. గంగాదర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెలంగాణవాది కొండాలక్ష్మణ్‌ బాపూజీ

  – రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణవాది స్వర్గీయ ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ అని రాజ్యసభ సభ్యుడు రాపోల్‌ ఆనంద భాస్కర్‌ అన్నారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం పద్మశాలి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్వాతంత్య్ర సమరంలో దేశం కోసం బ్రిటీష్‌వారికి ఎదురొడ్డి పోరాడారన్నారు. అదే నేపథ్యంలో ...

Read More »

అటవీ, నర్సరీల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

  గాంధారి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో అటవీశాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అటవీ, నర్సరీల తీరుపై జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని తిమ్మాపూర్‌, ముదెల్లి గ్రామాల్లో అటవీశాఖ నర్సరీలను పరిశీలించారు. తిమ్మాపూర్‌లో నర్సరీ పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటిన మొక్కలు ఎండిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ అధికారులతీరుపై మండిపడుతూ వెంటనే విచారణ జరిపి సంబందిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎండివోకు సూచించారు. అదేవిధంగా ముదెల్లి నర్సరీలో మొక్కల ...

Read More »

మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన

  – హాజరైన జిల్లా కలెక్టర్‌ గాంధారి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ సేవాలాల్‌ డాక్టర్స్‌ సంఘం నిజామాబాద్‌ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపు 30 మంది వైద్యులు వివిధ రంగాల్లో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్చందంగా వైద్య ...

Read More »

హనుమాన్‌ విగ్రహానికి వెండికిరీటం బహుకరణ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో గాందీచౌక్‌లోగల హనుమాన్‌ మందిరంలో విగ్రహానికి గ్రామానికి చెందిన పెండ్యాల సరోజ, నరేందర్‌ దంపతులు వెండి కిరీటాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు దాతల చేత ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

వరికోత మిషన్‌ పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా వరి కోత మిషన్‌ను పంపిణీ చేశారు. ఎన్‌ఎస్‌టి పథకం కింద రూ. 27 లక్షల 90 వేలకు చెందిన వరికోత యంత్రాన్ని 50 శాతం సబ్సిడీతో (12 లక్షల 50 వేల) కింద రైతుకు అందజేయడం జరిగిందని మంత్రి పోచారం అన్నారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల కొరకు యంత్రలక్ష్మి ...

Read More »

అయ్యప్పలకు భిక్ష ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుడు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అందరు సమానులేనని, కుల, మత ప్రాతిపదిక అనేది కొన్ని సమయాల్లోనే అవసరమవుతుందని, మనుషులంతా ఒకటేనని చాటిచెప్పిన వైనం మండల కేంద్రంలోని బీర్కూర్‌లో చోటుచేసుకుంది. 45 రోజులు కఠిన నియమాలతో ఉపవాస దీక్ష చేపట్టిన అయ్యప్పస్వాములకు గ్రామానికి చెందిన ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి ఎస్‌.కె.సజాత్‌ తన స్వగృహంలో అయ్యప్పస్వాములకు భిక్ష ఏర్పాటు చేసి మండలంలోనే అందరికి ఆదర్శంగా నిలిచారు. స్వయంగా స్వాములకు తనచేతులతో వడ్డించారు. కార్యక్రమంలో దీక్షస్వాములు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

సోమవారం అధికారులతో అత్యవసర సమావేశం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు గ్రామాల అభివృద్ది, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర అంశాలపై అత్యవసర సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్టు మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. పలు అభివృద్ది పనులపై సమీక్ష సమావేశానికి ఆయామండలాల, గ్రామాల అధికారులు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, సిసిలు, విఆర్వోలు సకాలంలో హాజరుకావాలని మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మద్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Read More »

తిమ్మాపూర్‌లో బ్రహ్మూెత్సవాలు ప్రారంభం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోగల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణలతో బ్రహ్మూెత్సవాలు గ్రామాభివృద్ది కమిటీ ఆద్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం జాతరను పురస్కరించుకొని విడిసి సభ్యులు ఆలయానికి రంగులు వేయించి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీవారి ఉత్సవవిగ్రహాలను మంగళహారతులు, గంగాజలాలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో బ్రహ్మూెత్సవాలు వైభవంగా ప్రారంభించారు. సోమవారం యజ్ఞం, పుణ్యాహవాచనం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం రథోత్సవం, అన్నదాన ...

Read More »

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెరాస కృషి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా సిఎం కెసిఆర్‌ కృషి చేస్తున్నారని మిసన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ మండలంలోని మోతె, వెంకటాపూర్‌ పలు గ్రామాల్లో అభివృద్ది పనులకు భూమిపూజ చేశారు. అనంతరం భీమ్‌గల్‌, వేల్పూర్‌ తహసీల్‌ కార్యాలయాల్లో నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్‌పండగ సందర్భంగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ...

Read More »