Breaking News

Daily Archives: December 19, 2016

ప్రజావాణిలో 141 ఫిర్యాదులు

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 141 ఫిర్యాదులు అందాయి. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి భారీఎత్తున ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆయాపిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు పంపిస్తామని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మునిసిపల్‌ ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా కార్యాలయం ఎదుట తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆద్వర్యంలో సోమవారం కార్మికులు ధర్నా చేపట్టారు. బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించి గేట్లు మూసివేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్దిరాములు మాట్లాడుతూ మునిసిపల్‌ కార్మికులకు నెలవేతనం రూ. 18 వేల చొప్పున చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్దతులు రద్దుచేసి కార్మికులను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ ...

Read More »

డిఎస్పీని సన్మానించిన మహిళా కౌన్సిలర్లు

  కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రసన్నను సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మహిళా కౌన్సిలర్లు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా డిఎస్పీ, మహిళా ఎస్పీలు నూతన జిల్లాకు పోలీసు ఉన్నతాధికారులుగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తూ అండగా ఉండాలని కోరారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శశిరేఖ, పద్మ, సునిత, యాదమ్మ పాల్గొన్నారు.

Read More »

సాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రధాన కాలువ నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు రైతులకు 960 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కొనసాగడంతో ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో 2వ టర్బయిన్‌ నుంచి 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని జెన్‌కో ఎ.డి శ్రీకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులుకాగా ప్రస్తుతం 1404.54 అడుగులు నీరుంది. ప్రస్తుతం ...

Read More »

క్యాష్‌లెస్‌ విధానం, మరుగుదొడ్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లో గల అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులపై, నగదు రహిత విధానంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రత్యేకాధికారులు శంకరయ్య, చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ స్పష్టం చేశారు. సోమవారం మోర్తాడ్‌ మండల పరిసత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయాగ్రామాల్లో బాధ్యతలు అందించిన అధికారులు గత 15 రోజులుగా ఇప్పటివరకు ఏ ఒక్క గ్రామంలో నగదు రహిత లావాదేవీలు ...

Read More »

పెంచిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్‌ )న్యూడెమోక్రసి జిల్లా నాయకులు సారాసురేశ్‌, కిషన్‌ లు అన్నారు. సోమవారం న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో పెంచిన ధరలను నిరసిస్తూ మోర్తాడ్‌ జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించిన అనంతరం తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

పెదవాగుపై పైప్‌లైన్‌ నిర్మాణానికి సర్వే

  మోర్తాడ్‌ డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తొర్తి, బాల్కొండ మండలంలోని వెంచిర్యాల్‌ గ్రామాల శివారులోగల పెదవాగుపై నిర్మించిన వంతెన పక్కనే మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనుల కోసం మెగా ఇంజనీరింగ్‌కంపెనీకి చెందిన అధికారులు సోమవారం సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి 0. నుంచి మెట్‌పల్లి మండలంలోగల దబ్బ గ్రామం వరకు కాకతీయ కాలువ వెంబడి 38 కి.మీ.ల పొడవున మిషన్‌ బగీరథ పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు వారు తెలిపారు. ...

Read More »

తొర్తి గ్రామంలో అక్రమ ఇసుక నిలువలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామ శివారులోగల పెదవాగుపై నిర్మించిన వంతెన పక్కనేరెండు ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిలువలు ఏర్పాటు చేసి యథేచ్చగా అక్కడి నుంచి రవాణా కొనసాగిస్తున్నారు. గత రెండునెలలుగా పెదవాగునుంచి ట్రాక్టర్ల ద్వారా వేకుమజామున ఇసుక తరలిస్తూ నిలువ ఉంచుతూ అక్రమార్కులు నిలువల నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గత పక్షంరోజుల్లోపే ఏర్గట్ల ఎస్‌ఐ హరిప్రసాద్‌ ఓ టిప్పర్‌, ఓ ...

Read More »

మురికినీరు తొలగించిన సర్పంచ్‌

  గాందారి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండల కేంద్రంలోని గుండమ్మ కాలువలో నిలిచినమురికి నీటిని సోమవారం జేసిబితో తొలగించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డుపై మురికి నీరు నిలువ ఉండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై స్తానిక సర్పంచ్‌ సత్యంకు ఫిర్యాదుచేయగా స్పందించిన ఆయన జేసిబి సహాయంతో కాలువను తవ్వించి మురికి నీటిని తొలగించారు. కాలువలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఎంపిటిసి రాంకిషన్‌రావు, కాలనీవాసులు ఉన్నారు.

Read More »

78వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు

  గాంధారి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంతో 78వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాలయ్య, బాల్‌రాజ్‌, శంకర్‌, రాజులు, లయన్‌ రమేశ్‌లు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమంలోకి స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు కలిసి రావాలని లేనియెడల రాబోయే కాలంలో మండల ప్రజలు ...

Read More »

పత్తాలేని పంచాయతీ కార్యదర్శి

  గాంధారి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న గంగాప్రసాద్‌ మధ్యాహ్నం 1 గంటఅయిన తర్వాత కూడా కార్యాలయానికి చేరుకోలేదు. సోమవారం చద్మల్‌ గ్రామ ప్రజలు వివిధ దృవీకరణ పత్రాల కోసం, ఇంటిపన్ను, గ్రామ పంచాయతీ సమస్యలు తెలపడానికి కార్యాలయనికి చేరుకోగా ఒంటిగంట వరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసే ఉంది. ఇప్పటికే గంగాప్రసాద్‌పై విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలు వెలువడడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నతాధికారులను ...

Read More »

ప్రజావాణికి ఆలస్యంగా వచ్చిన అటవీ సిబ్బంది

  గాందారి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించే ప్రజావాణిలో కొద్దిమంది అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఒంటిగంట సమయం మించిపోయిన తర్వాత అటవీశాఖ కార్యాలయం నుంచి ఓ అధికారి వచ్చి తహసీల్దార్‌ వద్దకు ప్రజావాణిలో పాల్గొనడానికి వచ్చినట్టు తెలిపారు. దీంతో తహసీల్దార్‌ లక్ష్మణ్‌ ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజావాణి ఒంటిగంటకే పూర్తవుతుందని, ...

Read More »

క్రిస్టియన్‌ మైనార్టీలకు దుస్తుల పంపిణీ

  బీర్కూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని నసురుల్లాబాద్‌ మండలంలోని క్రిస్టియన్‌ మైనార్టీలకు నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కిష్టానాయక్‌ నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, నసురుల్లాబాద్‌ సర్పంచ్‌ అరిగె సాయిలు, ఎంపిటిసి మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Read More »

ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  – ఎంపిడివో భరత్‌కుమార్‌ బీర్కూర్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రతి లబ్దిదారుడు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. సోమవారం క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు అధికారి సాయిరెడ్డితో మండలంలోని అంకోల్‌, దుర్కి, బొమ్మన్‌దేవుపల్లి, కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. ఐదు గ్రామాల్లో 1220 మరుగుదొడ్లు ప్రతిపాదించామని, 1018 మరుగుదొడ్లు పూర్తయ్యాయని, 212 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని భరత్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వల్ల వ్యక్తిపరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు పాటుపడినట్టు ...

Read More »

శివుడిని పూజించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పొరపొట్లు..!!

హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు. ...

Read More »

కారుతో ఢీ.. శవంతో ఐదు కిలోమీటర్లు

  భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం   ద్విచక్రవాహనంపై రోడ్డుకు ఓ పక్కగా వెళుతున్న దంపతులను వెనుకనుంచి కారుతో ఢీకొట్టారు.. అంతే, ఎగిరి కారు బానెట్‌పై పడిన మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయినా లోపలున్న నలుగురు యువకులు కారును ఆపలేదు.. మహిళ శవంతోనే దూసుకెళ్లారు. అలా దాదాపు ఐదు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత నింపాదిగా ఓ చోట కారును నిలిపివేసి, పారిపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల కేంద్రానికి సమీపంలో జరిగిన ఈ ఘోరం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్‌ఐ ...

Read More »

అమ్మా నాన్న.. పన్ను ఆదా

వయసు మీద పడిన తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. పెద్దవారి కోసం చేసే కొన్ని ఖర్చులకు ఆదాయ పన్ను (ఐటి) మినహాయింపూ ఉంది. అవి ఎలాంటి ఖర్చులో చూద్దాం.. ఇంటి అద్దె చెల్లింపు.. తల్లిదండ్రుల సొంత ఇంట్లో కలిసి ఉంటున్నా.. వారికి అద్దె చెల్లించవచ్చు. ఇందుకోసం వారితో అద్దె ఒప్పందం కుదుర్చుకోవాలి. వారు ఈ అద్దె ఆదాయాన్ని వారి ఐటి రిటర్న్‌లో చూపాల్సి ఉంటుంది. ఈ ఆదాయంపై వారికి 30 శాతం తగ్గింపు లభిస్తుంది. మిగతా 70 శాతం అద్దె ఆదాయాన్ని మాత్రమే పన్ను ...

Read More »

సంపూ వైరస్‌ పూర్తయింది!

హృదయలేయం, సింగం 123 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్‌ బాబు హీరోగా పుల్లారేవు రామచందర్‌ రెడ్డి సమర్పణలో ఎ.యస్‌.ఎన్‌.ఫిలింస్‌ బ్యానర్‌పై ఎస్‌.ఆర్‌.కష్ణ దర్శకత్వంలో సలీం ఎం.డి. శ్రీనివాస్‌ మంగళ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం వైరస్‌. నో వ్యాక్సిన్‌ ఓన్లీ ట్యాక్సిన్‌ ట్యాగ్‌లైన్‌. గీత్‌షా, నిధిషా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా… చిత్ర నిర్మాతలు సలీం ఎం.డి. శ్రీనివాస్‌ మంగళ మాట్లాడుతూ.. సంపూర్ణేష్‌ బాబు హీరోగా వైరస్‌ సినిమాను మా బ్యానర్‌లో ...

Read More »

బ్యాంకుల్లోకీ విస్తరించిన అవినీతి!

వీరు ఎంతగా అరచికేకలు పెడుతున్నారో అంతకు రెట్టింపుస్థా యిలో అవినీతి రాక్షసి దేశంలో అంతగా పెరిగిపోతు న్నది. ఇక్కడా అక్కడా అని లేదు పొగమంచులా ఎక్కడ వీలైతే అక్కడ విస్తరిస్తున్నది. తాజాగా బ్యాంకుల్లో బయటపడుతున్న అవినీతి పరా కాష్ఠగాచెప్పొచ్చు. ఇంతకాలం బ్యాంకులంటే సన్న,చిన్న, మధ్యతరగతి జనంలో కొంత విశ్వాసం ఉండేది. నమ్మ కం ఉండేది. కానీఇప్పుడు ఆ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో బయటపడుతున్న అవినీతి, అందులో ఉన్నతస్థాయిలో కొందరు బ్యాంకు అధికారులు నల్లధనస్వాములతో చేయి కలిపి కోట్లాది రూపాయల కొత్తనోట్లను తరలించడంతో అందరూ విస్తుపోతున్నారు.బ్యాంకుల్లో సీనియర్‌ ...

Read More »

నాలో మెచ్యూరిటీ వచ్చేసింది

కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతిహాసన్‌ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్‌ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని. అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా ...

Read More »