Breaking News

Daily Archives: December 20, 2016

రౌండ్‌టేబుల్‌ సమావేశం జయప్రదం

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్దనోట్ల రద్దుపై మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం జయప్రదమైంది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిద్దిరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రధాని మోడి బాణం గురితప్పిందని, నల్లడబ్బు గలవారు నవ్వుకుంటూ ఆనందంగా ఉంటూ సామాన్యజనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీతాలు తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని, రోజువారి కూలీలు డబ్బు కోసం ...

Read More »

టిడిపి సభ్యత్వ నమోదు

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టిడిపి సభ్యులుగా చేరి రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం పొందాలని సూచించారు. మోబైల్‌ యాప్‌ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. తెరాస అధికారంలోకి రాకంటే ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తెరాసను గద్దె దింపడానికి టిడిపి నాయకులు, సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ...

Read More »

పిఎంపిలు ప్రాథమిక చికిత్సలు మాత్రమే అందించాలి

  – డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే ప్రాథమిక చికిత్సలు మాత్రమే పిఎంపి వైద్యులు అందించాలని కామారెడ్డి జిల్లా డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన హెల్త్‌ ఎమర్జెన్సీ ఫస్ట్‌ రెస్పాండర్‌ ట్రేనింగ్‌కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్‌కే సవాల్‌ విసిరే రోగాలు ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్నాయన్నారు. పిఎంపి వైద్యులు ప్రజల రోగాలకు సొంతంగా వైద్యం అందించకుండా ...

Read More »

2017 క్యాలెండర్‌ ఆవిష్కరించిన జేసి

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ ఆద్వర్యంలో రూపొందించిన 2017 క్యాలెండర్‌ను మంగళవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు సేవచేసి వారిగుర్తింపు పొంది జిల్లాకు మంచి పేరుతేవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ సర్వీసెస్‌ సంఘంను అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మోతిసింగ్‌, ప్రతినిధులు శ్రీనివాస్‌, బాల్‌రాజ్‌, నర్సింలు, ప్రేమ్‌కుమార్‌, స్వామి, బాసిత్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గిరిజనుల హక్కుల కోసం పోరాటం

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసమే గిరిజన సంఘం పనిచేస్తుందని సంఘం రాష్ట్ర నాయకులు బీమా సాహెబ్‌ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం జరిగిన గిరిజన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొమురం భీం పోరాట స్ఫూర్తితో జల్‌,జంగిల్‌, జమీన్‌ హమారా అనే పేరుతోరాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్‌ ప్రభుత్వం గిరిజనులకు భూములివ్వడం మాని గిరిజన భూములు లాక్కోవడం వారి హక్కులను హరించడమేనన్నారు. ప్రభుత్వంపై లడాయిని కొనసాగిస్తామని ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు గొల్లవాడలో మంగళవారం సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2.60 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గుంతలు పడిన రోడ్డు మరమ్మతుల కోసం నాన్‌ప్లాన్‌ గ్రాంట్‌ నిధులు 1.60 లక్షలు వెచ్చించినట్టు ఆమెతెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, డిఇవో భూమేశ్‌, నాయకులు కృపాల్‌ తదితరులున్నారు.

Read More »

విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జూనియర్‌ కళాశాల ఎదుట నిరసన

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరిట స్థల రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జూనియర్‌ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్‌ కళాశాల విద్యార్తిని, విద్యార్థులు, విద్యార్తి సంఘాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కామారెడ్డిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారని,కానీ నేటికి కనీసం ప్రభుత్వ పరంగా ఐటిఐ కళాశాలను సైతం మంజూరు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని ...

Read More »

ఉపాధ్యాయుల వైఖరి నిరసిస్తూ ఆందోళన

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డ్రైవర్స్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాద్యాయులు ఉండకుండా విద్యార్థులకు భోజనం అందించడం లేదని, వారి వైఖరిని నిరసిస్తూ ఐఎఫ్‌టియు ఆద్వర్యంలో మంగళవారం కామారెడ్డిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విద్యాశాఖ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకుడు ఆజాద్‌ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు భోజన సమయంలో అందుబాటులో ఉండడం లేదని, ఇద్దరుటీచర్లున్నా ఒక్కరు మాత్రమే విధులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు ...

Read More »

అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌, జేసి

  కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయాన్ని మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యలు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అయ్యప్ప సేవాసంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌, జేసిలను శాలువాలతో సత్కరించారు. స్వామివారికి పడిపూజ, అభిషేకం స్వాములు జరిపారు. భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చీల ప్రభాకర్‌, ప్రతినిధులు ఆనంద్‌, అంజయ్య, రాజేందర్‌, రాజమౌలి, శ్రీనివాస్‌, అశోక్‌, శ్రీకాంత్‌, గౌరీశంకర్‌, ...

Read More »

ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 21 నుంచి జనవరి 5వ తేదీ వరకు పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని జిల్లా పశువైద్యాధికారి, పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్‌ ఎల్లన్న ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ తమ ఆవులు, లేగలు, దూడలు, గేదెలకు టీకాలు వేయించుకొని పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో సుమారు 3.12 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 11 వ ...

Read More »

ఈనెల 31 వరకు రినివల్‌ కార్డులను పొందవచ్చు

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2003 నుంచి 2012 లోపు ఎంప్లాయ్‌మెంట్‌ కార్డులు ల్యాప్స్‌ అయిన వారు (రద్దయినవారు) తిరిగి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశమిస్తు ఉత్తర్వులు జారీచేసిందని జిల్లాఉపాధి అధికారి మోహన్‌లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు తిరిగి రినివల్‌ చేయించుకోవచ్చని ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఇంతవరకు 1490 కార్డు తీసుకోబడ్డాయని, సుమారు 1270 కార్డులు ఇంతవరకు రినివల్‌ పూర్తిచేసినట్టు ఆయన అన్నారు.

Read More »

నీటివసతిలేని మూత్రశాలలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మక్దూమ్‌పూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతులు ఉన్నాయి. సుమారు 65 మందివిద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరికోసం పాఠశాల ఆవరణలో మూత్రశాలలు ఏర్పాటు చేశారు. కానీ తలుపులు ఊడిపోయి ఏడాది గడుస్తుంది. తర్వాత సుమారు 35 వేలు ఖర్చుచేసి మూత్రశాల లోపలి బాగంలో బండరాళ్లు వేసి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం మూత్రశాలలు పనికిరాకుండా పోయాయి. గత సంవత్సరం పాఠశాల ఆవరణలో మూడు మూత్రశాలలు నిర్మించారు. అవికూడా వినియోగంలోకి తేలేదు. పాఠశాల ...

Read More »

79వ రోజుకు చేరిన దీక్షలు

  గాంధారి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపడుతున్న రిలే దీక్షలు మంగళవారం నాటికి 79వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిదులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాలయ్య, బాల్‌రాజ్‌, లయన్‌ రమేశ్‌, రెడ్డి రాజులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను గౌరవించి గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేని ఎల్లారెడ్డికి కేటాయించడం పట్ల గాంధారి మండల ప్రజలు ...

Read More »

పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ

  గాంధారి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధుల నిర్లక్ష్యం పట్ల అలసత్వం వహించిన గాంధారి మండలం చద్మల్‌ పంచాయతీ కార్యదర్శికి మెమో జారీచేశారు. సోమవారం నిజామాబాద్‌ న్యూస్‌లో ప్రచురితమైన వార్తా కథనానికి స్పందన లభించింది. కాగా స్థానిక ఎండివో సాయాగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి గంగాప్రసాద్‌కు మెమోజారీచేశారు. మూడురోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. గతంలో సైతం విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని అభియోగాలు ఉండడంతో చద్మల్‌ గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మెమో జారీచేసినట్టు సాయాగౌడ్‌ తెలిపారు.

Read More »

పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్‌ పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తుందని నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో ప్రభుత్వం మంజూరు చేసిన దుస్తులను తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ మస్రూద్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు హైమద్‌ హుస్సేన్‌, వైస్‌ ఎంపిపి గోగుల పండరిలతో కలిసి పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ మైనార్టీ క్రైస్తవుల ...

Read More »

జల విద్యుత్‌ కేంద్రంలో పెరిగిన విద్యుత్‌ ఉత్పత్తి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుందని జెన్‌కో ఎ.డి.ఎ. శ్రీకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టుకు అనుసందానంగా ఉన్న 2వ టర్బయిన్‌ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో విద్యుత్‌ ఉత్పాదన పెరిగిందన్నారు. యాసంగిలో ఆయకట్టు రైతులకు పంటలు సాగుచేసుకునేందుకు నీటివిడుదల చేశామని ప్రాజెక్టు డిఇ దత్తాత్రి తెలిపారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ వెంట నీటిపారుదల ...

Read More »

పది విద్యార్థులకు రాత పరీక్షలపై మెళకువలు

  నందిపేట, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఉర్దూమీడియం జడ్పిహెచ్‌ఎస్‌, నవోదయ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్దం కావాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణత కొరకు మెళకువలు సూచించారు. విద్యార్థులు పరీక్షలంటే భయం విడనాడాలని, ప్రణాళికా బద్దంగా చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్టుల వారిగా చదువుకోవడానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, పరీక్ష కేంద్రంలో ...

Read More »

పాఠశాల అభివృద్దికి ప్రతి ఒక్కరు పాటుపడాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌ అభివృద్దికి ప్రతి ఒక్కరు పాటుపడాలని పాఠశాల అభివృద్ది కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం పాఠశాల అభివృద్ది కమిటీ సమావేశాన్ని ప్రధానోపాద్యాయులు శివరాజ్‌ అద్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎంసి ఛైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామంలోని పాఠశాల అభివృద్దికి ప్రతి ఒక్కరు పాటుపడాలని, ఉపాధ్యాయులు గత సంవత్సరం కంటే మెరుగైన బోధన చేసి విద్యార్థులను అత్యధికశాతం ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరైన ...

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల అభివృద్ది అదికారి భరత్‌ కుమార్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. మొదటగా పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల అభివృద్ది అదికారి భరత్‌ కుమార్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. మొదటగా పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు పట్టికలు పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »