Breaking News

మెగా ఫ్యామిలీపై రీమేక్స్ కామెంట్స్‌.. చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

మెగా ఫ్యామిలీ రీమేక్స్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కు రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రీమేక్స్ అయినా అవి కూడా సినిమాలేనని గుర్తుంచుకోవాలన్నాడు. ధృవ సినిమా కోసం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. డల్లాస్‌లోని ఎన్నారైలతో ప్రత్యేకంగా మీట్ అయ్యాడు. మెగా అభిమానుల మధ్య ‘మెగా ఫ్యామిలీ రీమేక్స్’పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేశాడు. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసమే రీమేక్స్ చేస్తున్నామన్నాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు.. అని కాకుండా ముందు మనందరం భారతీయులమనీ, అదే విధంగా తమిళనాడులో రిలీజ్ అయిందా.. మహారాష్ట్రలో రిలీజ్ అయిందా అన్నది కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా దాన్ని అందిచాలని తాము భావిస్తున్నామన్నాడు. కథల్లేకనో, కొత్త కథలతో చేయలేకనో రీమేక్స్‌ను నమ్మకోలేదని చరణ్ స్పష్టం చేశాడు. మెగా ఫ్యామిలీ మొత్తం రీమేక్స్ ఎందుకు చేస్తోందనే కామెంట్స్‌ను అస్సలు పట్టించుకోవద్దనీ, మంచి సినిమా మీ ముందు ఉంటే వాటి ఊసెందుకన్నాడు. సినిమాకు అవధులు లేవని తాను నమ్ముతానన్నాడు.  ధృవ రీమేక్ అయినా ప్రేక్షకులు ఆదరించారనీ, అదే విధంగా చిరు ‘ఖైదీ నెం-150’, పవన్ ‘కాటమరాయుడు’ని ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article