Breaking News

Daily Archives: December 21, 2016

హసన్‌పల్లి బిటి రోడ్డుకు నిదులు మంజూరయ్యేనా…?

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామం మీదుగా హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయంగా మారింది. వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. హసన్‌పల్లి గేటునుంచి హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం వరకు దాదాపు 3 కి.మీ. లమేర రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి, రోడ్డు కంకరతేలి అధ్వాన్నంగా మారింది. ఈరోడ్డు గుండా జలవిద్యుత్‌ కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రమాదవశాత్తు గుంతలోపడి గాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. నిజాంసాగర్‌ ప్రధాన కాలువ గేట్లు, ...

Read More »

దొన్కల్‌లో అక్రమ ఇసుక నిలువలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని దొన్కల్‌ గ్రామ శివారులోగల సంతోష్‌నగర్‌ కాలనీలో రెండు ప్రాంతాల్లో అక్రమ ఇసుక నిలువలు ఏర్పాటు చేశారు. గాండ్లపేట్‌ పెదవాగు దొన్కల్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతం నుంచి అర్ధరాత్రి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తు సంతోష్‌నగర్‌ కాలనీలో అక్రమంగా ఇసుక నిలువలు చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలిసినా తెలియనట్టు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ...

Read More »

గ్రామాల్లో అధికారుల పర్యటన

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లో బుధవారం మండల ప్రత్యేకాధికారులు శంకరయ్య, చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ తడపాకల్‌, తిమ్మాపూర్‌, మోర్తాడ్‌ గ్రామాల్లో పర్యటించారు. నగదు రహిత విధానంపై ప్రజలకు, దుకాన దారులకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలి నూతనంగా మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాల పనులను సకాలంలో పూర్తిచేయించాలని జిల్లాకలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండలాధికారులకు ఆదేశించారు. మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.మరుగుదొడ్లనిర్మాణంతో ...

Read More »

గురువారం శ్రీనివాస రామానుజన్‌ జయంతి ఉత్సవాలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని అన్ని గ్రామాల్లోగల ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో శ్రీనివాస రామానుజన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సూచించినట్టు ఎంఇవో రాజేశ్వర్‌ తెలిపారు. రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆయా పాఠశాలల్లో గణిత పజిల్స్‌పై వ్యాసరచన, రామానుజన్‌జీవిత చరిత్రపై పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. గురువారం విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు ఎంఇవో తెలిపారు.

Read More »

వశిష్ట డిగ్రీ కళాశాల విద్యార్థుల ఇండస్ట్రియల్‌ విజిట్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వశిష్ట డిగ్రీ కళాశాలకు చెందిన డిగ్రీ ద్వితీయ, తృతీయసంవత్సరం విద్యార్థులు బుధవారం గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. విద్యాభ్యాసంలోగల ఇండస్ట్రియల్‌ విజిట్‌ నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రమణకుమార్‌ తెలిపారు. చక్కర ఉత్పత్తి ప్రక్రియ, కరెంటు ఉత్పత్తిగురించి ఫ్యాక్టరీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గాయత్రీ షుగర్స్‌ అధికార ప్రసాద్‌ నేతృత్వంలో ఫ్యాక్టరీలోని ప్రతి విభాగాన్ని విద్యార్తులు సందర్శించారు. ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేశ్‌,చాంద్‌పాషా, దీప్తి, ...

Read More »

విద్యార్థులకు పాదరక్షల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్‌బి నగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థినిలకు పాదరక్షలు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మజ, స్నేహితురాళ్ళు విద్యార్థులందరికి పాదరక్షలు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాద్యాయులు పద్మజ, సునీల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఇందిరాపార్కు వద్ద ఎల్‌హెచ్‌పిఎస్‌ ఆద్వర్యంలోధర్నా

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లంబాడి హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఎల్‌హెచ్‌పిఎస్‌ వ్యవస్తాపకుడు బెల్లయ్య నాయక్‌ ఆధ్వర్యంలో దర్నా చేసినట్టు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో కెసిఆర్‌ గిరిజనులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలుఅమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేశారని ఆరోపించారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పి ...

Read More »

విశ్వబ్రాహ్మణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ పత్రాలను కామారెడ్డిలో బుధవారం ఆవిష్కరించారు. సంఘం నూతన కార్యవర్గాన్ని జనవరి 8న ఎన్నుకోనున్నట్టు తెలిపారు. 25న స్థానిక కాళికాదేవి ఆలయంలోనామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 28న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు విశ్వబ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్‌ బెజ్జంకి సుదర్శన్‌, ప్రతినిధులు బ్రహ్మం, శ్రీనివాస్‌, చంద్రమౌళి, మారుతి, దయాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని గుమాస్తా కాలనీలోని కాలభైరవస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవస్వామి 28వ జన్మదినాన్ని పురస్కరించుకొని పూజలు చేశారు. దీపారాధన, గురుప్రార్థన, గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుద్రాభిషేకం, పుష్పార్చన చేశారు. అనంతరం కాలభైరవునికి డోలారోహనం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

కలెక్టరేట్‌ ఎదుట బీడీ కార్మికుల ధర్నా

  వేతనాలు నగదు రూపంలో చెల్లించాలని వినతి కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బుధవారం తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణం నుంచికలెక్టరేట్‌ కార్యాలయం వరకు ర్యాలీ గా వచ్చిన కార్మికులు అక్కడ బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం జేఏసి సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతా ద్వారా కాకుండా నగదు రూపంలో ...

Read More »

త్వరలో మంజీర నదిలో చెక్‌డ్యాం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంజీర నది పరివాహక ప్రాంతంలో రైతుల సౌలభ్యం కొరకు నీటి నిలువ ఉంచడానికి చెక్‌డ్యాంలు నిర్మించడానికి అనువైన ప్రదేశాలను బుధవారం మంత్రి పోచారం తనయుడు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. దామరంచ, కిష్టాపూర్‌, బీర్కూర్‌, బరంగెడ్గి ప్రాంతాల్లో త్వరలో చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నామని, దీనివల్ల నిజాంసాగర్‌ నుంచి వచ్చేనీరు నిలువ ఉండి మంజీర నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచి రైతుల పంటలకు సమృద్ధిగా నీరందేవిధంగా, జాలర్లకు చేపలు పట్టుకునే విధంగా ...

Read More »

గురువారం శ్రీనివాస రామానుజన్‌ జయంతి ఉత్సవాలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించనున్నట్టు మండల విద్యాధికారి గోపాల్‌రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నసురుల్లాబాద్‌ మండలంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి రామానుజం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. గణితశాస్త్రంలో చిన్ననాటి నుంచే ఉపాధ్యాయులకు విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ముందుకు సాగాడని ఆయన అన్నారు.

Read More »

మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిన ప్రకారం విద్యార్థులకు మెనుప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలోని దామరంచ పాఠశాలలో నసురుల్లాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరుపట్టికలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించే ఉద్దేశంతో మద్యాహ్న భోజనం ప్రవేశపెట్టిందని, ఇట్టి పథకం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రధానోపాధ్యాయులు, ...

Read More »

బీర్కూర్‌లో ముగ్గురు బైండోవర్‌

  బీర్కూర్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలో పేకాట ఆడిన ముగ్గురు వ్యక్తులను బుధవారం ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ ఆధ్వర్యంలో బైండోవర్‌ చేపట్టారు. బీర్కూర్‌ గ్రామానికి చెందిన నల్లచెరువు సాయిలు, ఎరుకల బాలయ్య, ఎరుకల సాయిలులను తహసీల్దార్‌ ముందుబైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేకాట వ్యసనంగా మారిందని, ప్రభుత్వం అందించిన ఉత్తర్వుల ప్రకారం కేసులు నమోదయిన పేకాటరాయుళ్లను కోర్టులో హాజరుపరిచి 50 వేల పూచికత్తుపై బైండోవర్‌ చేస్తున్నట్టు తెలిపారు. ...

Read More »

15 రోజుల్లో మరుగుదొడ్లు పూర్తి

  గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామ పంచాయతీ పరిధిలోని మాధవపల్లి గ్రామంలో 15 రోజుల్లో మరుగుదొడ్లనిర్మాణాలు పూర్తిచేస్తామని ఎండివో సాయాగౌడ్‌ అన్నారు. బుధవారం గ్రామానికి వచ్చిన మరుగుదొడ్లకు సంబంధించిన మెటీరియల్‌ను తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల వాడకాన్ని కొనసాగించాలని, దాని ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. 15 రోజుల్లో ప్రభుత్వసిబ్బందే ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నారన్నారు. గ్రామంలో మొత్తం 29 మరుగుదొడ్లు మంజూరుకాగా, వాటిని త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తెస్తామని ఆయన ...

Read More »

80వ రోజుకు చేరిన రిలే దీక్షలు

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 80వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం దీక్షలో జేఏసి ప్రతినిదులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలి

  గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలని గాంధారి ఎంపిటిసి రాంకిషన్‌రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆద్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల వికలాంగులకు ఫిజియోథెరఫి క్యాంపు నిర్వహించారు. సర్వశిక్షా అభియాన్‌ అందిస్తున్న అన్ని సౌకర్యాలను తల్లిదండ్రులు వికలాంగులకు అందించే విధంగా కృషి చేయాలని రాంకిషన్‌రావు తెలిపారు. దివ్యాంగులు ఫిజియోథెరఫి వైద్యం చేయించుకొని సకలాంగులుగా మారి ఎన్నో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. ప్రతి బుధవారం భవిత సెంటర్‌లో ఫిజియోథెరఫి క్యాంపు ...

Read More »

ఎక్సైజ్‌ అధికారుల తనిఖీలు

  గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు తాండాల్లో బుధవారం ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. మండలంలోని అల్లెలమడుగు తాండా, సోమారం తాండా, జెమిని తాండా, చద్మల్‌ తాండా, నెరెల్‌ తాండా, చిన్నగుర్జుల్‌ తాండా, పెద్ద గుజుల్‌ తాండా, అవుసుల కుంట తాండాల్లో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా తాండావాసులతో ఎక్సైజ్‌ అధికారులు మాట్లాడుతూ అక్రమంగా సారా కాయవద్దని, బెల్లం ఊటలను ఏర్పాటుచేయవద్దని, బెల్టుషాపులు నిర్వహించవద్దని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ...

Read More »

ఒబామా భారీ క్షమ

78 మందికి క్షమాభిక్ష, 153 మందికి శిక్ష తగ్గింపు పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. 78 మందిని క్షమించిన ఆయన.. మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇంతమందికి క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్‌ హౌస్‌ వర్గాలు చెప్పాయి. క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటిల్లో శిక్ష తగ్గించేవి ఎక్కువగా ఉంటున్నాయి. క్షమాభిక్షలో ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత, న్యాయస్థానంలో ...

Read More »

సూరత్ చాయ్‌వాలా.. ఆస్తులు 650 కోట్లు

 50 కిలోలకు పైగా వెండి.. రూ.1.39 కోట్ల వజ్రాలు 6.5 కోట్ల నగదు… ఐటీ దాడుల్లో పట్టివేత   ఆరున్నర కోట్ల రూపాయల నగదు.. 50 కిలోలకు పైగా వెండి.. రూ.1.39 కోట్ల విలువ చేసే వజ్రాలు.. బోలెడన్ని లాకర్లలో నింపిన కిలోల కొద్దీ బంగారం.. ఇంకా ఇతరత్రా స్థిరాస్తులు అన్నీ కలిపితే అక్షరాలా ఆరువందల యాభై కోట్ల రూపాయల ఆస్తి!! ఇదేదో ఏసీబీ వలకు చిక్కిన అధికార తిమింగలం ఆస్తి కాదు! సూరత్ లో చాయ్‌, బిస్కెట్లు, స్నాక్స్‌ అమ్ముకునే ఓ చిరువ్యాపారి లెక్కల్లో ...

Read More »