Breaking News

Daily Archives: December 22, 2016

పాఠశాలల్లో గణిత దినోత్సవం

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో గురువారం గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. గణితంపై రూపొందించిన ఎగ్జిబిషన్‌లో తాము తయారుచేసిన వివిద గణిత పజిల్స్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రామానుజన్‌ గణితం కోసం చేసిన కృషిని కొనియాడారు. లెక్కల శాస్త్రాన్ని లెక్కలతో శాసించారని, ఎందరో గణిత మేధావులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉన్న స్థానం నుండి ...

Read More »

కామారెడ్డిలో షార్ట్‌ఫీల్మ్‌ యూనిట్‌ సందడి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నా జీవితం నీకు అంకితం షార్ట్‌ ఫిల్మ్‌ బృందం గురువారం సందడి చేసింది. స్థానిక సాయిబాబా ఆలయంలో ఫిల్మ్‌ యూనిట్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరిపింది. దీనికి పిఆర్‌టియు అధ్యక్షుడు అంబీర్‌ మనోహర్‌రావు కెమెరా ఆన్‌చేసి ప్రారంభించారు. యువత అన్ని రంగాల్లో ముందుంటేనే బంగారు తెలంగాణ సాద్యమవుతుందని, షార్ట్‌ ఫిల్మ్‌లకు ఆదరణ ఉన్న నేటి తరుణంలో యువతకిది మంచి అవకాశమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ రవి, హీరో ...

Read More »

సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేయాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం సిపిఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పునూతుల రమేశ్‌గౌడ్‌ అన్నారు. తపస్‌రాష్ట్ర కార్యదర్శిగా రాఘవరెడ్డిని,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా వైద్యుల లక్ష్మణ్‌రావును, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌ను, రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. గురువారం నియామక పత్రాలను రమేశ్‌గౌడ్‌ ఎన్నికైన వారికి అందజేశారు. తపస్‌ జిల్లా కార్యదర్శిగా షెట్‌పల్లిశ్రీనివాస్‌ను నియమించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతపాఠశాలలోని పండిట్‌, పిఇడిల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ...

Read More »

బయోమెట్రిక్‌ హాజరు పరిశీలన

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పారిశుద్య విభాగంలో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు ప్రక్రియను గురువారం మునిసిపల్‌ కమీషనర్‌ విజయలక్ష్మి పరిశీలించారు. వేకువజామున పారిశుద్య కార్యాలయానికి వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ విధానం సరిగా అమలవుతుందా..లేదా…, ఎంతమంది కార్మికులు వస్తున్నారు తదితర విషయాలు పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్య విభాగం, కార్మికులదే ప్రదాన పాత్ర అని, దానికి తగు న్యాయం చేయాలని సూచించారు.

Read More »

మహిళల రక్షణ కోసమే షీ టీంలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా, విద్యార్తినిల రక్షణ కోసమే షీటీంలు ఏర్పాటు చేశామని కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి అన్నారు. కామారెడ్డిపట్టణంలోని ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన షీ టీం అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్య సాధన కోసం ప్రతి విద్యార్థి కస్టపడి చదవాలని, వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. విద్యార్థులు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని, ఎవరైనా అలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే ...

Read More »

గ్రామ సంఘాలనుబలోపేతం చేయాలి

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్న చిన్న గ్రామాల అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు కృసి చేయాలని ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం రాంనారాయణగౌడ్‌ మాట్లాడుతూ 500, 1000 నోట్లు రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నగదు రహిత చెల్లింపుల పట్ల విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. స్త్రీనిధి, బ్యాంకు ...

Read More »

పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద క్రైస్తవులకు సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తుందని మండల కో ఆప్షన్‌ సభ్యులు హైమద్‌ హుస్సేన్‌ అన్నారు. మండల కేంద్రంలోని బెరాక ప్రార్థన మందిరంలో నిరుపేద క్రైస్తవులకు ప్రభుత్వం అందించిన దుస్తులను పాస్టర్‌ దివాకర్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైమద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ రంజాన్‌,క్రిస్మస్‌పండగల ద్వారా సిఎం కెసిఆర్‌ నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసేందుకు లక్షలాది రూపాయలు మంజూరుచేసి పంపిణీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెరాస మండల ...

Read More »

సాదా బైనామాల విచారణ

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మక్దుమ్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాదా బైనామాలపై స్థానిక తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ మస్రూద్‌ గురువారం విచారణ జరిపారు. గ్రామంలో 32 మంది రైతులు సాదా బైనామాకోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 19 మంది దరఖాస్తులపై విచారణ చేసినట్టు తహసీల్దార్‌ తెలిపారు. గ్రామంలో భూమి విక్రయించిన పట్టేదారు పక్కా పొలం వ్యక్తులను పిలుచుకొని పూర్తివివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు సాదా బైనామా,పట్టామార్పిడి చేస్తుందన్నారు. కార్యక్రమంలో విఆర్‌ఏ విఠల్‌, ...

Read More »

మురికి కాలువలు శుభ్రం

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి, మంగుళూరు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప మురికి కాలువలు శుభ్రం చేయించారు. రెండు గ్రామాల్లో మురికి కాలువలు నిండిపోవడంతో కూలీలను నియమించి శుభ్రం చేయించారు. వాటితో పాటు గ్రామంలో పేరుకుపోయిన చెత్త, చెదారం కూడా తొలగించారు. ప్రస్తుతం రెండు గ్రామాల్లో చెత్త, మురికి కాలువలు శుభ్రం కావడంతో ప్రజలు సంతోసం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

గాంధారిలో గాలికుంటు టీకాల పంపిణీ

  గాంధారి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో గురువారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీని స్తానిక జడ్పిటిసి తానాజీరావు ప్రారంభించారు. గాంధారిలో 1800 పశువులకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందని, శుక్రవారం మండలంలోని జువ్వాడి, మాదవపల్లిగ్రామాల్లో క్యాంపు నిర్వహిస్తున్నట్టు పశు వైద్యాధికారి రవికిరణ్‌ తెలిపారు. రైతులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read More »

శుక్రవారం కంటి వైద్య శిబిరం

  గాంధారి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం జువ్వాడి గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు రెవల్యుషన్‌ సంస్థ ప్రతినిది రాకేశ్‌ తెలిపారు.బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

Read More »

జేఏసి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిదుల శవయాత్ర

  గాంధారి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో జేఏసి ఆద్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల శవయాత్రను గురువారం నిర్వహించారు. గత 80 రోజులుగా గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన జేఏసి నాయకులు వారి దిష్టిబొమ్మతో కూడిన శవయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రదాన వీధుల గుండా యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా ప్రభుత్వానికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవిందర్‌రెడ్డికి, ప్రజాప్రతినిధులకు ...

Read More »

స్త్రీనిధి రుణాలతో మరుగుదొడ్ల నిర్మాణం

  గాంధారి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణానికి స్త్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వనున్నట్టు ఏరియా కో ఆర్డినేటర్‌ రమేశ్‌బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన మండల మహిళా సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ కింద మరుగుదొడ్ల నిర్మానం చేపడుతున్నప్పటికి బిల్లులు రాకపోవడంతో స్త్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చామన్నారు. జిల్లాలో 91 వేల కుటుంబాలకు మరుగుదొడ్లు లేనట్లు గుర్తించామని తెలిపారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించుకోవాలని, ...

Read More »

నలుగురి బైండోవర్‌

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్నారం, దామరంచ గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులను ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆద్వర్యంలో తహసీల్దార్‌ కృస్ణానాయక్‌ముందు బైండోవర్‌ చేశారు.అన్నారం గ్రామానికి చెందిన విఠల్‌, ఎస్‌.కె.సుబాని,దామరంచ గ్రామానికి చెందిన మంగలి విఠల్‌,లక్ష్మణ్‌లను బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ బైండోవర్‌ చేయబడ్డ వ్యక్తులు ఆరునెలల వరకు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, పేకాట, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం తదితర అల్లర్లలో పాల్గొంటే 50 వేల రూపాయల జరిమాన, మూడునెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.

Read More »

ఆధ్యాత్మికతతోనే సుఖసంతోషాలు

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆధ్యాత్మిక జీవనం ద్వారా సుఖ సంతోషాలతో ఉంటారని బంజారా దీక్షా గురువు ప్రేమ్‌సింగ్‌ అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం తాండాకు గురువారం ఆయన విచ్చేశారు. భవాని ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఆధ్యాత్మిక జీవనం ద్వారా హాయిగా జీవితం గడపవచ్చని తెలిపారు. ఐకమత్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌పెరిక శ్రీనివాస్‌ మాట్లాడుతూ బంజారాల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రబుత్వం ...

Read More »

పోలీసులు ప్రజలతో మమేకం కావాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసులు ప్రజలతో మమేకమై సమస్యల్ని పరిష్కరించాలని బాన్సువాడ డిఎస్పీ నర్సింహరావు అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ పోలీసు కార్యాలయాలను గురువారం ఆయన తనిఖీ చేపట్టారు.ముందుగా పోలీసు స్టేషన్‌లోని రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిస్కారానికి ప్రతి పోలీసు కృషి చేయాలని సూచించారు. నేరాలు తగ్గుముఖం పట్టే విధంగా చూడాలని, అదేవిధంగా పేకాట ఆడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి వెంట ప్రమాదాలు జరిగేస్థలాలు గుర్తించి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన ...

Read More »

ఘనంగా రామానుజన్‌ జయంతి వేడుకలు

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం శ్రీనివాస రామానుజన్‌ జయంతి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారంఆయా పాఠశాలల్లో విద్యార్తులకు వ్యాసరచన, క్విజ్‌ తదితర పోటీలు నిర్వహించారు. మోర్తాడ్‌లోని చతురస్ర ప్రయివేటు పాఠశాలలో, కృస్ణవేణి టాలెంట్‌ స్కూల్లో విద్యార్థులు తయారుచేసిన గణిత పజిల్‌ ఎగ్జిబిషన్‌ను స్థానిక సర్పంచ్‌ దడివెనవీన్‌ ప్రారంభించి సందర్శించారు. విద్యార్థులు తయారుచేసిన పజిల్స్‌ను వివరించారు. విజేతలైన విద్యార్థులకు ఎంఇవో కార్యాలయంలో బహుమతి ప్రదానం చేశారు.

Read More »

మాడల్‌ గ్రామంలో గ్రామస్తులతో సమీక్ష

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పైలట్‌ ప్రాజెక్టు కింద ఒడ్యాట్‌ గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ ఎంపిక చేశారు. ఇందులో భాగంగా గురువారం మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, స్థానిక సర్పంచ్‌ పోశన్న అధ్యక్షతన గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, రుణమాఫీ, యంత్రలక్ష్మి, వ్యవసాయ రుణాలు, ఫసల్‌ బీమా యోజన చెల్లించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాకుండా గ్రామంలో ప్రభుత్వ పథకాల్లో లబ్దిపొందని వారి వివరాలు సేకరించారు. ...

Read More »

రబీకి మోర్తాడ్‌ చెరువు నుండి నీటివిడుదల

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ ముసలమ్మ చెరువు తూము నుండి గురువారం గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామ రెవెన్యూ అధికారులు మాణిక్యం, రాజేశ్వర్‌లు నీటివిడుదల చేశారు. తూమునుండి పంట పొలాల శివారు వరకు కాలువలు సరిగా లేకపోవడంతో విడిసి సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గత 10 రోజుల క్రితం తహసీల్దార్‌ తూము నుండి పంట కాలువ శివారువరకు పూడిక తొలగించి కాలువలు శుభ్రం చేయించారు. రబీ పంటల కోసం గురువారం నీటి ...

Read More »