Breaking News

Daily Archives: December 23, 2016

పాఠశాలల్లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిద పాఠశాలల్లో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు మేరీమాతా, ఏసుక్రీస్తు, క్రిస్మస్‌ తాత వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలల్లో పశువుల పాక సెట్టింగులువేసి ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలనువిద్యార్తులకు తెలిపారు. చిట్టిపొట్టిచిన్నారులు పండగ వేడుకల్లో ఆడి పాడారు. పట్టణంలోని జీవదాన్‌, లయోలా, ఎస్‌పిఆర్‌, లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలతోపాటు ఆయా పాఠశాలల్లో వేడుకలు జరిపారు.

Read More »

క్రైస్తవులకు దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హరిజన వాడలో శుక్రవారం రాజాఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధి ఏ.కె.లత మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అందరు సమానంగా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద క్రైస్తవులకు చీరలు పంపిణీ చేశామన్నారు. అందరు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు.

Read More »

ఎంపి కవితకు ఘన స్వాగతం

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిననిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు శుక్రవారం తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డిలో ఓ వివాహ వేడుకకు ఎంపి విచ్చేశారు. ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపిని శాలువా, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. నూతనజిల్లా ఏర్పడిన నేపథ్యంలోజిల్లా ప్రగతికి ఎంపి తనవంతు ...

Read More »

కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు ఇందిరానగర్‌కాలనీలో మురికి కాలువ, పైప్‌లైన్‌ పనులను శుక్రవారం మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3 లక్షలతో పనులుచేపడుతున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, ఎ.ఇ. గంగాదర్‌, డిఇవో భూమేశ్వర్‌ తదితరులున్నారు.

Read More »

షీ టీం ఆద్వర్యంలో కౌన్సిలింగ్‌

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో శుక్రవారం డిఎస్పీ ప్రసన్నరాణి ఆద్వర్యంలో ఆకతాయిలకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ యువకులు అమ్మాయిలను వేధించడం, కామెంట్లు చేయడం సరికాదన్నారు. వారి ప్రవర్తన మార్చుకోవాలని చదువుపై దృష్టి సారించాలని సూచించారు. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. యువతులు, మహిళల రక్షణ కోసమే షీ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ పుట్ట మల్లికార్జున్‌, న్యాయమూర్తి సలీం, సాందీపని ప్రిన్సిపాల్‌ బాలాజీరావు, సహచట్టం ...

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికుల ధర్నా

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీడీ రోలర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు శుక్రవారం కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు వివిధ బీడీ కంపెనీల ఎదుట ధర్నా చేశారు.ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు లక్ష్మణ్‌ మాట్లాడుతూ రెండుసంవత్సరాలకోసారి జరగాల్సిన అగ్రిమెంట్‌ ముగిసి 8 నెలలు కావస్తున్నా బీడీ యాజమాన్యాలు నెలసరి ఉద్యోగులకు, బీడీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదన్నారు. ...

Read More »

అప్రజాస్వామిక అరెస్టులు గర్హణీయం

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌వెళ్లేందుకు సిద్దపడగా గురువారం అర్దరాత్రి పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం గర్హణీయమని పిడిఎస్‌యు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఆజాద్‌ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తూ ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు తీసుకురావాలని చూస్తోందని, దీన్ని అడ్డుకోవడంలో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో శుక్రవారం ఛలో అసెంబ్లీకార్యక్రమం తలపెట్టామన్నారు. కార్యక్రమానికి వెళ్లనీయకుండా గురువారం అర్ధరాత్రి ...

Read More »

నగదు రహిత లావాదేవీలు జరపాలి

  కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు, విద్యార్థులు నగదు రహిత లావాదేవీలు జరపాలని ఐసిడిఎస్‌ డిడబ్ల్యువో రాధమ్మ అన్నారు. గంజ్‌వర్తకసంఘం జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నగదురహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధమ్మ మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు కరెన్సీ వినియోగం నుంచి బయటకు వచ్చి ప్లాస్టిక్‌ కార్డుల వినియోగం చేయాలని సూచించారు. ఈ పాస్‌ యంత్రాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మోబైల్‌ కరెన్సీ, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌ వంటి వాటి ద్వారా లావాదేవీలుజరుపుకోవాలని ...

Read More »

గుంతల రోడ్లతో అవస్థలు

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొగ్గు గుడిసె, బాన్సువాడ ప్రధాన రహదారికి అడుగడుగునా గుంతలు పడడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొగ్గుగుడిసె నుంచి బాన్సువాడ వరకు 22 కి.మీ.ల మేరకు రోడ్డు గుంతల మయంగా మారింది. ఈ రహదారి గుండా ప్రయానిస్తున్న అన్ని రకాల వాహనదారులకు గుంతలు చూసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గాలిపూర్‌ గేటు సమీపంలో కారు, ఆర్టీసి బస్సు గుంతను తప్పించబోయి ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి ...

Read More »

నవోదయ పాఠశాల తనిఖీ

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలను ఎంపిడివో రాములు నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో డిసెంబరు 1వ తేదీన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో క్రమశిక్షణ గాడితప్పిందని ఆయనపర్యటనలో తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌,ఎంపిడివో, ఎంఇవో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపిడివో సభ్యుడిగా ఉండడంతో విద్యార్థుల వసతి గృహంలో హౌజ్‌ మాస్టర్లు నిద్రిస్తున్నారా లేదా, క్రమశిక్షణ తదితర విషయాలపై తనిఖీ చేసినట్టు తెలిపారు. ఈ ...

Read More »

విశ్రాంతి గృహానికి భూమిపూజ

  గాంధారి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రలంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తోగుట పీఠం, విశ్రాంతి గది నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో తోగుట పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి పాల్గొని భూమిపూజ చేపట్టారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ దైవ అనుగ్రహంతోనే అన్ని సాధ్యమవుతున్నాయని, మానవ సేవయే మాధవ సేవ అని హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి భారతీయులంతా కృషి చేయాలన్నారు. అనంతరం అయ్యప్పస్వాములు స్వామిజి పాదాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌ గురుస్వామి, స్వాములు అంజాగౌడ్‌, శ్రీధర్‌, ...

Read More »

జువ్వాడితో కంటి వైద్య శిబిరం

  గాంధారి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం జువ్వాడి గ్రామంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు కంటి పరీక్షలు చేపట్టి అవసరమున్న వారికి మందులు పంపిణీ చేశారు. బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 12 మందికి ఆపరేషన్‌ నిమిత్తం తరలిస్తున్నట్టు వైద్యులు డాక్టర్‌ వెంకట్‌, హన్మంత్‌రావు, సురేశ్‌లు తెలిపారు. కార్యక్రమంలో రివల్యూషనరీ ఆర్గనైజేసన్‌ ప్రతినిదులు రాకేశ్‌, ప్రవీణ్‌కుమార్‌, గ్రామస్తులు ...

Read More »

కోదండరామ్‌ను కలిసిన జేఏసి నాయకులు

  గాంధారి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల జేఏసి నాయకులు శుక్రవారం కోదండరామ్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా గాంధారి మండలాన్ని కామారెడ్డి డివిజన్‌ నుంచి తొలగించి ఎల్లారెడ్డిలో కలపడాన్ని నిరసిస్తూ గత 82 రోజులుగా రిలే నిరాహారదీక్షలుచేపడుతున్న జేఏసి నాయకులు న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించడానికి మద్దతు ఇవ్వాలని కోదండరామ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మండల ప్రజల కోరికను ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన కోదండరామ్‌ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ...

Read More »

డిజిటల్‌ చెల్లింపులతో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ

  బిగ్‌సి సిఎండి బాలు చౌదరి హైదరాబాద్‌ పెద్ద నోట్ల రద్దు కారణంగా తొలుత మొబైల్‌ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా క్షీణించినప్పటికీ.. ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని బిగ్‌సి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలు చౌదరి తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు స్మార్ట్‌ఫోన్లు సౌకర్యవంతంగా ఉండటం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు వీటిని కొనుగోలు చేయడానికి ప్రాధా న్యం ఇస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో స్మార్ట్‌ఫోన్లకు మరింత గిరాకీ పెరిగితే ధరలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉందన్నారు. నోట్ల రద్దుకు పూర్వం తమ స్టోర్లలో 50 శాతానికి ...

Read More »

‘మార్పిడి’ లోధా అరెస్టు

ఈడీ వలలో కోల్‌కతా వ్యాపారి  ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత  శేఖర్‌, టాండన్‌కు కొత్తనోట్లు  భారీ కుట్రకు పాల్పడ్డారు: ఈడీ  కోల్‌కతాలో ఆయనకు మరో పేరు ‘ఎక్స్‌ట్రా ఫ్లోర్స్‌’ లోధా!   చెన్నై కాంట్రాక్టర్‌ శేఖర్‌ రెడ్డికి, ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్‌ రోహిత టాండన్‌కు కోట్లకు కోట్ల కొత్త నోట్లు ఎక్కడివి? ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక్క పేరు బయటపడింది. అది… కోల్‌కతాకు చెందిన ప్రముఖ వ్యాపారి, హవాలా డీలర్‌ పరాస్‌ ఎం.లోధా! ఆ ఇద్దరికి ఆయన రూ.25 కోట్లకుపైగా కొత్తనోట్లు సమకూర్చిపెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ...

Read More »

మస్కట్ లోనూ అదే తంతు

మస్కట్:  మస్కట్ లో చాలా మంది దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలు వ్యభిచార కేసుల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటీవల అల్ కువైర్ జిల్లాలో 43 మంది మహిళలు వ్యభిచార గృహం నడుపుతూ, పోలీసులకు చిక్కారు. ఒకేసారి అంత మంది మహిళలు ఇలాంటి కేసులో పట్టుబడడంతో ఆసియా వాళ్లు నివాసిస్తున్న అన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కొంత మంది తాయ్ మహిళలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. అయితే కొందరు మాయగాళ్లు వారికి మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ, ఇక్కడికి తీసుకువచ్చి వేశ్యలుగా మారుస్తున్నారని ...

Read More »

మీ నోటులో చిప్ ఉందా?

న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త రెండు వేల నోటు విడుదల చేయగానే ఆ నోటుపై ఎన్నో ఊహాగానాలు, పుకార్లు హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు అసత్య వార్తలను ప్రచారం చేశారు. కొత్త రెండు వేల నోటుపై బాగా చక్కర్లు కొట్టిన అంశం చిప్. కొత్త నోటులో చిప్ అమర్చారని, అందులోని జీపీఎస్ సిస్టమ్ ద్వారా దొంగ నోటుకు, అసలు నోటుకు తేడా కనిపెట్టవచ్చని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొత్త నోటులో చిప్ ఏమీ లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్లకు తెరపడింది. ...

Read More »

యాపిల్‌ ఫోన్‌లో పేటీఎం మాయం!

 ఐఫోన్‌ను వినియోగిస్తున్న వారు కొద్దిరోజులపాటు పేటీఎం ద్వారా లావాదేవీలను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఐఓఎస్‌ (ఐఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌)లో సాంకేతిక సమస్య కారణంగా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ మాయమైంది.

Read More »

బ్రిటన్‌ ఆంక్షలతో భారత్‌ ఐటికి చేటు!

UK visa భారతీయ వలసపౌరులపై బ్రిటిష్‌ప్రభుత్వం వీసా ఆంక్షలు కఠినతరం చేయడం వల్ల భార తీయ ఐటి కంపెనీలు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంక్లిష్టపరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భావనలో ప్రపంచ దేశాలున్న తరు ణంలో డేవిడ్‌కేమరూన్‌ వారసురాలిగా వచ్చిన థెరిసామే ప్రధానిగా వలసవీసా నిబంధనలనుప్రత్యేకించి భారతీ యుల కోసమే మార్పులుచేర్పులు చేయడం భారత్‌ ఐటి రంగానికి ఏమాత్రం నచ్చలేదు. పైగా దీనివల్ల బ్రిటన్‌లో సేవలందిస్తున్న భారత్‌ ఐటి కంపెనీలపై వత్తిడి మరింత పెరుగుతుంది. రెండోశ్రేణి ...

Read More »

మాపై నిందలు వేయొద్దు: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన విమర్శలపై కేసీఆర్ మాట్లాడుతూ నయీం నేర చర్యలకు పాల్పడుతున్న సమయంలో జీవన్‌రెడ్డి సైతం కేబినెట్ మంత్రే అని…అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందలు మానుకోవాలని…అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. తమపై నిందలు వేయాలని చూడొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు.

Read More »