Breaking News

Daily Archives: December 26, 2016

రాహుల్‌ ఆరోపణలు

దేశ ప్రజలకు ఉపకరించే పార్లమెంటు సమావేశాలను ఎందుకూ కొరగాకుండా చేసిన అధికార, విపక్షాలు ఇప్పుడు సభ వెలుపల అమోఘంగా యుద్ధం చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ యుద్ధక్షేత్రంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మధ్య విమర్శలు పతాకస్థాయికి చేరాయి. ఈ రాష్ట్రంలో తొలి రెండుస్థానాల్లో ఉన్న ఎస్పీ, బీఎస్పీల కంటే బీజేపీ కాంగ్రెస్‌లు ఎక్కువ వీరంగం వేయడాన్ని బట్టి ఈ యుద్ధం యూపీ ఎన్నికలకే పరిమితమైనది కాదని అనుకోవాలి. రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో పెద్దనోట్ల రద్దు ప్రభావమేమిటో నిగ్గుతేలాక, నరేంద్రమోదీ వేయబోయే ప్రతీ రాజకీయ ...

Read More »

నిరుపేదలకు డబ్బు.. మరో అడుగేసిన సౌదీ

సౌదీ: పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించిన సౌదీ ప్రభుత్వం.. ఈ విషయమై మరో అడుగు ముందుకేసింది. దేశంలోని కుటుంబాలకు ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. మొత్తం కుటుంబాలను అయిదు కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కుటుంబానికి వస్తున్న ఆదాయం ప్రకారం ఈ విభజన చేసింది. నెలకు 8699 సౌదీ రియాల్స్ ఆదాయం వస్తున్న కుటుంబాలను కేటగిరీ-1, 8700 నుంచి 11999 సౌదీ రియాల్స్ ఆదాయంగా గల కుటుంబాలను కేటగిరీ-2లోకి చేర్చింది. అలాగే 12000 నుంచి ...

Read More »

ఏసుక్రిస్తుతో ట్రంప్‌ను పోల్చారు

వాషింగ్టన్: అభిమానం హద్దుమీరితే ఎలా ఉంటుందో అమెరికాలో ఆదివారం స్పష్టంగా తెలిసివచ్చింది. ఒక్క వాఖ్యం.. అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్రిస్టమస్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నేత, రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్, ట్రంప్ చీఫ్ అయిన ప్రీబస్.. ఇచ్చిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డోనాల్డ్ ట్రంప్‌ను, ఏసుక్రీస్తును పోల్చుతూ ఆయన చేసిన ప్రసంగంపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘‘రెండు వేల ఏళ్ల క్రితం.. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక రక్షకుడు భూమిపై పుట్టాడు. భయాందోలనల్లో, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ఒక ...

Read More »

కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కాటమరాయుడు

పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. సినిమా షూటింగ్ పట్టాలెక్కి రెండు..మూడు నెలలవుతున్నా.. దానికి సంబంధించిన ఏ హంగామా కనిపించలేదు. మొదట్లో పవన్ ఫొటోతో టైటిల్ లోగోను తయారు చేసి దాన్నే కాటమరాయుడు ఫస్ట్‌లుక్ అంటూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ తర్వాత దీపావళికి మరో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినా అభిమానులకు అదంతగా కిక్ ఇవ్వలేదు. కానీ, అభిమానులకు న్యూ ఇయర్ కిక్ ఇచ్చేలా.. కొత్త సంవత్సరంలో కాటమరాయుడు పలకరించబోతున్నాడట. సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి పోస్టర్‌తో కాటమరాయుడు సిద్ధమైపోతున్నాడట. దానిని సినిమా ...

Read More »

ఎన్టీయార్‌ రిజెక్ట్‌ చేశాడు.. చిరు ఓకే చేశాడు!

మెగాస్టార్‌ 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ పాటలు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఆ పాటలు మెగాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడు’ పాట మార్మోగిపోతోంది. అయితే ఈ పాట గురించి ఓ ఇంట్రస్టింగ్‌ గ్యాసిప్‌ ఒకటి బయటికొచ్చింది. ఈ ట్యూన్‌ను మొదటిగా ఎన్టీయార్‌ నటించిన ‘జనతాగ్యారేజ్‌’ కోసం సిద్ధం చేశాడట మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీప్రసాద్‌. ఆ ట్యూన్‌ దర్శకుడు కొరటాల శివకు కూడా బాగా నచ్చిందట. అయితే ఎన్టీయార్‌ మాత్రం ఆ ట్యూన్‌తో పెద్దగా ఇంప్రెస్‌ కాలేదట. దాంతో దేవీ ...

Read More »

ఇంజనీరింగ్‌ బుర్రకు వ్యాపారం పదును

విద్యార్థులకు వ్యాపారంపై శిక్షణ  నూతన కార్యక్రమానికి రూపకల్పన చేసిన టాస్క్‌  ఐఎస్‌బీతో కలిసి ‘టెప్‌’ పేరుతో శిక్షణ కార్యక్రమాలు  హైదరాబాద్‌ కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మంచి బిజినెస్‌ ఐడియా ఉంటుంది.. కాని దాన్ని ఎలా అమల్లోకి తేవాలో తెలియదు. దీంతో వారు ఆ ఐడియాను పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటారు. తక్కిన వారు ఇంజనీరింగ్‌ పూర్తవగానే ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప.. ఇతర వ్యాపారం గురించి ఆలోచించరు. దీంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా తగిన ఉద్యోగం దొరకడం కష్టమైపోయింది. ...

Read More »

త్వరలో కేంద్ర సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం త్వరలో ప్రజలపై భారం మోపేలా మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.ఎవరైనా వాహనాన్ని అక్రమంగా రోడ్డుపై పార్కింగ్ చేస్తే వారినుంచి వెయ్యిరూపాయల జరిమానాను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్థుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి రూ200 లు జరిమానాను వసూలు చేస్తుండగా దాన్ని వెయ్యిరూపాయలకు పెంచనున్నారు. స్మార్ట్ నాగ్ పూర్ సిటీ సదస్సులో కేంద్రమంత్రి గడ్కరీ మాట్లాడుతూ అక్రమంగా వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయకుండా ...

Read More »

క్రిస్మస్ ఆచారాలు గురించి 10 ఇంట్రెస్టింగ్ విషయాలు…

క్రిస్మస్ సమయంలో వేడుకలను చాలా ఆనందంగా చేసుకుంటారు. క్రిస్మస్ తో ముడిపడిన కొన్ని ఆచారాల కారణంగా ఈ పండుగ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ప్రతి పండుగలోను ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు అనేవి దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటాయి. క్రిస్మస్ విషయంలో కూడా ఇతిహాసాలు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవ పండుగలలో కిస్మస్ అనేది ప్రధానమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను బిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు. అందువలన క్రిస్మస్ ఆచారాలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. క్రిస్మస్ సంబంధించిన ఆచారాలు ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ...

Read More »