Breaking News

ఏసుక్రిస్తుతో ట్రంప్‌ను పోల్చారు

వాషింగ్టన్: అభిమానం హద్దుమీరితే ఎలా ఉంటుందో అమెరికాలో ఆదివారం స్పష్టంగా తెలిసివచ్చింది. ఒక్క వాఖ్యం.. అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్రిస్టమస్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నేత, రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్, ట్రంప్ చీఫ్ అయిన ప్రీబస్.. ఇచ్చిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డోనాల్డ్ ట్రంప్‌ను, ఏసుక్రీస్తును పోల్చుతూ ఆయన చేసిన ప్రసంగంపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘‘రెండు వేల ఏళ్ల క్రితం.. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక రక్షకుడు భూమిపై పుట్టాడు. భయాందోలనల్లో, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ఒక భరోసాను కల్పించాడు. అందుకని క్రిస్టమస్‌ను మనం జరుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు అమెరికన్లకు ఒక కొత్త రాజు లభించాడు. ఇది నిజంగా సంతోషించాల్సిన సమయం.  గతంకంటే మిన్నగా మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి క్రిస్టమస్ వేడుకలను జరుపుకోండి’ అంటూ రిపబ్లికన్ కార్యకర్తలతో జరిగిన ఒక సమావేశంలో ప్రీబస్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సొంతపార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీసస్‌ను, ట్రంప్‌ను పోల్చడంతో ట్విటర్‌లో విమర్శలు వచ్చిపడుతున్నాయి. అమెరికాకు సేవకుడా.. రాజా.. అనేది ట్రంప్ తేల్చాలంటూ కామెంట్స్ రాస్తున్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *