Breaking News

Daily Archives: December 27, 2016

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాఏర్పడిన తర్వాత జరిగే మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విజయవంతం చేయాలని జిల్లా అధికారులను ...

Read More »

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని

  కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌కుమార్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో మంగళవారం నిర్వహించిన డిజిటల్‌ మార్కెటింగ్‌, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అదుపుచేసే క్రమంలో పెద్దనోట్ల రద్దు చేస్తుందన్నారు. అందరు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తూ స్వైప్‌ మిషన్‌, మోబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ ...

Read More »

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో అక్షయ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ ఆద్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఇన్సిట్యూట్‌ ఎండి భూపాల్‌ తెలిపారు. సిఎంవివైకె-2 మెప్మా, డిజిటల్‌ ఇండియా సంయుక్తంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. శిక్షణ తర్వాత ఎంఎన్‌సి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 9949173338, 8121988336 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.

Read More »

కాలువకు బుంగ… నీరు వృధా…

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో నీరు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ 0 డిస్ట్రిబ్యూటరీ కాలువలో ముళ్లపొదలు, మట్టి పూడికతీయకపోవడంతో బుంగలుపడి సాగునీరు వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్తితుల కారణంగా భూములు బీడుగా మారాయని, పిచ్చిమొక్కలు పెరిగాయని రైతులు తెలిపారు. మూడేళ్ల క్రితమే కాలువ తూము ఆధునీకరణ పనులు చేపట్టినట్టయితే చివరి ఆయకట్టు వరకు సాగునీరు వేగవంతంగా ...

Read More »

షీటీంపై అవగాహన

  నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఎస్‌ఐ అంతిరెడ్డి షీ టీం పనితీరుపై అవగాహన కల్పించారు. బాలికలు ఆపద సమయంలో చేయవలసిన పనులపై, మూఢనమ్మకాలపై, బాల్య వివాహాలపై మంగళవారం అవగాహన కల్పించారు. విద్యార్తినిలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమానంగా రాణించాలని, అన్ని రంగాల్లో బాలికలు ముందుండాలని అన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌ సరోజన, తదితరులున్నారు.

Read More »

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

  కామారెడ్డి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని వివిద చర్చీల్లో క్రిస్మస్‌ పండగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. పట్టణంలోని జీవదాన్‌ఆసుపత్రిలో క్రిస్మస్‌సంబరాలు జరిపారు. కేక్‌లు కట్‌చేసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, న్యాయమూర్తి సలీంతోపాటు న్యాయవాదులు శ్యాంగోపాల్‌రావు, భిక్షపతి, గోపాల్‌, నారాయణ, జయప్రకాశ్‌, మస్రూద్‌ తదితర న్యాయవాదులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

రైతులకు ఎటిఎం కార్డుల పంపిణీ

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్‌ గ్రామ సొసైటీ పరిధిలోని తాళ్ల రాంపూర్‌, గుమ్మిర్యాల్‌, బట్టాపూర్‌, దోంచంద, తడపాకల్‌ గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు ఏర్గట్ల సహకార బ్యాంకుల్లో మంగళవారం ఎటిఎం కార్డులను సొసైటీ ఛైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, బ్యాంక్‌ మేనేజర్‌ సందీప్‌ శర్మలు పంపిణీ చేశారు. రైతులకు మరిన్ని సేవలు అందించడమే గాకుండా ఎటిఎంల ద్వారా రైతులు నగదు రహిత లావాదేవీలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో ధాన్యం విక్రయించే వారికి ...

Read More »

బీడీ కార్మికులకు నగదు వేతనాలు అందించాలి

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా నగదు రూపంలో కమీషన్‌ ఏజెంట్ల ద్వారానే వేతనాలు అందించాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తక్క డిమాండ్‌ చేశారు. ఏర్గట్ల తహసీల్‌ కార్యాలయం ముందు 7 గ్రామాల బీడీ కార్మికులతో రాస్తారోకో, ధర్నా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్‌కు అందజేశారు. బీడీ కార్మికుల్లో అధిక ...

Read More »

మోర్తాడ్‌లో జాతర, అన్నదానం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లోని శివాలయం వద్ద మంగళవారం జాతర, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులతో యజ్ఞం, స్వామివారి కళ్యాణోత్సవం, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతరకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.

Read More »

బస్టాండ్‌ పరిశీలన

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ ఆర్టీసి బస్టాండ్‌ ను మంగళవారం ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ రామచంద్రమూర్తి ఆకస్మికంగా విచ్చేసి సందర్శించారు. బస్టాండ్‌లోని సమస్యలను, దుకాణ సముదాయాలను, వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కంట్రోలర్‌ను నియమించాలని, తాగునీటి వసతి కల్పించాలని డిఎం దృష్టికి తీసుకెళ్లగా తాను నాలుగురోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే కంట్రోలర్‌ను ఏర్పాటుచేయిస్తామని, వసతులుకల్పిస్తామని పేర్కొన్నారు.

Read More »

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతల తీర్మానం

  మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం జరిగింది. సభలో గుమ్మిర్యాల్‌, దోంచంద గ్రామాలకు చెందిన ఎంపిటిసి గడ్డం లింగారెడ్డి, ఏర్గట్ల గ్రామాన్ని మండలంగా చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మోర్తాడ్‌ ఎంపిటిసి మురళీగౌడ్‌ బలపరిచారు. దీంతో రెండు మండలాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించారు. మోర్తాడ్‌లోని 30 పడకల ...

Read More »

మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి ఒక్కరు శ్రద్ద చూపాలి

  బీర్కూర్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి ఒక్క వ్యక్తి శ్రద్ద చూపించాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మహిళా సమాఖ్యసమావేశంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌తోపాటు ఆయన పాల్గొన్నారు. మహిళా రుణాలను త్వరితగతిన చెల్లించాలని, బ్యాంకు లింకేజీలు, తదితర అంశాల్లో ఐకెపి సిఎలు చొరవ చూపించాలని ఆయన సూచించారు. వీరితోపాటు నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేలా సిఎలు, సిసిలు ప్రయత్నించాలని ఆయన ...

Read More »

ఈనెల 29న మోర్తాడ్‌కు రైలురాక

  – జనవరి 1 నుంచి మోర్తాడ్‌ నుంచి సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ వరకు మోర్తాడ్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జగిత్యాల్‌, మెట్‌పల్లి, కోరుట్ల, మోర్తాడ్‌ ప్రజల కల ఎట్టకేలకు ఈనెల 29న నెరవేరనుంది. సిర్పుర్‌ నుంచి రైలు వస్తుందని జగిత్యాల్‌, మెట్‌పల్లిలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రారంభిస్తారని, సాయంత్రం 4 గంటల సమయంలో మోర్తాడ్‌కు రైలు చేరుకుంటుందని, రిమోట్‌ ద్వారా కేంద్రమంత్రి రైలు ప్రారంభిస్తారని మోర్తాడ్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్లు కృష్ణప్రసాద్‌, సంతోష్‌లు మంగళవారం తెలిపారు. ...

Read More »

ఎల్లారెడ్డి ఆర్డీవోను కలిసిన తహసీల్దార్లు

  గాంధారి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డిని మంగళవారం గాంధారి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌ తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఏర్పడ్డ ఎల్లారెడ్డి డివిజన్‌కు నూతన ఆర్టీవోగా దేవేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వీరికి గాంధారి తహసీల్దార్‌ లక్ష్మణ్‌తోపాటు ఆయా తహసీల్దార్లు కలిసి స్వాగతం పలికారు.

Read More »

నర్సరీని పరిశీలించిన ఎండివో

  గాంధారి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పోతంగల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్‌ గడ్డ నర్సరీని మంగళవారం ఎండివో సాయాగౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకులతో మాట్లాడి వచ్చే మే, జూన్‌ నాటికి మొక్కలు సిద్దంగా ఉంచాలన్నారు. పాలిథిన్‌ కవర్లలో నింపుతున్న మట్టి మిశ్రమాన్ని అనుకూలంగా ఉంచాలని తద్వారా మొక్కలు మంచిగా మొలకెత్తుతాయన్నారు.

Read More »

పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు

  గాందారి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీని గ్రామస్థాయిలో అభివృద్ది చేయడానికి కార్యకర్తలకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొట్టమొదటిసారిగా గాంధారికి విచ్చేసిన ఆయనకు మండల బిజెపి నాయకులు ఘన సత్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈనెల 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ ...

Read More »

జేఏసి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన

  గాంధారి, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 86 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం దీక్షలో జేఏసి ప్రతినిదులతో పాటు గ్రామస్తులు పాల్గొని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసి ప్రతినిధులు పోతంగల్‌ కిషన్‌రావు, తూరుపు రాజులు, బాల్‌రాజ్‌, బాలయ్య, లయన్‌ రమేశ్‌, శంకర్‌, జి.శంకర్‌, రెడ్డిరాజులు, మదార్‌ తదితరులు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని యధావిధిగా కామారెడ్డి ...

Read More »

నోట్లరద్దు ప్రభావం ఓట్లపై ఉంటుందా?

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే ఎన్నికల వాతా వరణం కమ్ముకొంటోంది.ఈ రాష్ట్రం లో ఎలాగైనా పాగావేయాలని బిజెపి విశ్వప్రయత్నం చేస్తుండగా తాము ఏ మాత్రం వెనుకాడబోమని విప క్షాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఈరాష్ట్రంలో మెజారిటీ స్థానా లు సాధించుకోడానికి గట్టిగా వ్యూహా లు రచిస్తోంది. బిజెపి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ కార్యకర్తల నుంచి ఎంపిల వరకు సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రధానిమోడీ ఆరాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా ...

Read More »

ముహూర్తం కుదిరింది!

తమ్ముడు అఖిల్‌ పెళ్లి తర్వాతే నా పెళ్లి అని ఇదివరకే ప్రకటించాడు నాగచైతన్య. ఆయన చెప్పినట్టుగానే అన్న కంటే ముందే అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నాడు. శ్రియ భూపాల్‌తో కలిసి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పుడు నాగచైతన్య పెళ్లి కబురు వినిపించడానికి రంగం సిద్ధం చేశాడు. ఆయన కొంత కాలంగా కథానాయిక సమంతతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నాగచైతన్య, సమంత నిశ్చితార్థం జనవరి 29న హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిసింది. ఆ మేరకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Read More »

రివ్యూ.. దంగల్‌

చిత్రం పేరు: దంగల్‌(హిందీ) నటీనటులు: ఆమిర్‌ఖాన్‌.. సాక్షి తన్వార్‌.. ఫాతిమా సనా షేక్‌.. సన్యా మల్హోత్రా.. అపర్‌శక్తి ఖుర్రానా.. వివన్‌ భటేనా దర్శకత్వం: నితీష్‌ తివారీ నిర్మాణం: ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంగీతం: ప్రీతం చక్రవర్తి విడుదల తేదీ: 23-12-2016 ఆమిర్‌ఖాన్‌ అంటేనే విలక్షణ నటుడన్న పేరుంది. చేసే ప్రతీ సినిమాలోనూ తను ఆ ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకే ఆయన సినిమా వస్తోందంటే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 2014లో ఆమిర్‌ నటించిన ‘పీకే’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. గ్రహాంతర వాసిగా ...

Read More »