Breaking News

తప్పతాగి హల్ చల్ చేసిన యువతి.. రోడ్డు మీద బూతు మాటలు.!

హైదరాబాద్:  భాగ్యనగరంలోని కృష్ణానగర్‌లో ఓ యువతి పీకలదాకా తాగి హల్‌చల్‌ చేసింది. ఫుల్ గా తాగేసిన యువతి రోడ్డుపై అటూ ఇటూ ఊగుతూ దారిన నడిస్తూ.. వాహనాదారులను, రోడ్డుపై వెళ్లే వ్యక్తులను నోటికొచ్చినట్లు మాట్లాడింది. తాగి ఉన్నావ్.. ఇంటికెళ్లమ్మా.. జాగ్రత్తగా అని తోటివాళ్లు మర్యాదపూర్వకంగా చెప్పినా వారిని బూతులు తిట్టింది. అడ్డొచ్చిన ఆటో డ్రైవర్‌‌ను చితకబాదింది. ఏయ్ ముయ్ గూబ పగిలిపోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో చుట్టుపక్కలున్న జనాలు అక్కడికి చేరుకోవడంతో ఏం జరిగిందంటూ ఆరా తీసిన కానిస్టేబుల్ యువతికి సర్దిచెబుతుంటే ఈసారి ఆ యువతి ఏకంగా కానిస్టేబుల్‌‌పై చేయి చేసుకుంది. దీంతో గొడవ కాస్త పెద్దదైంది. ఆగ్రహానికి లోనైన ఖాకీలు యువతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖాకీపై  చేయిచేసుకున్నందుకు కేసు నమోదు చేస్తారా.. లేకుంటే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. యువతి ఎవరన్న విషయం తెలియరాలేదు.. పోలీసులు కూడా ఆమె ఎవరన్నది బయటికి పొక్కనీయలేదు.

Check Also

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *