Breaking News

రైతులకు ఎటిఎం కార్డుల పంపిణీ

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్‌ గ్రామ సొసైటీ పరిధిలోని తాళ్ల రాంపూర్‌, గుమ్మిర్యాల్‌, బట్టాపూర్‌, దోంచంద, తడపాకల్‌ గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు ఏర్గట్ల సహకార బ్యాంకుల్లో మంగళవారం ఎటిఎం కార్డులను సొసైటీ ఛైర్మన్‌ సోమ చిన్నగంగారెడ్డి, బ్యాంక్‌ మేనేజర్‌ సందీప్‌ శర్మలు పంపిణీ చేశారు. రైతులకు మరిన్ని సేవలు అందించడమే గాకుండా ఎటిఎంల ద్వారా రైతులు నగదు రహిత లావాదేవీలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో ధాన్యం విక్రయించే వారికి కార్డులు ఉపయోగపడతాయని అన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది,ఆయాగ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *