Breaking News

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని

 

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడవాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌కుమార్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో మంగళవారం నిర్వహించిన డిజిటల్‌ మార్కెటింగ్‌, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అదుపుచేసే క్రమంలో పెద్దనోట్ల రద్దు చేస్తుందన్నారు. అందరు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తూ స్వైప్‌ మిషన్‌, మోబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింక్‌, చెక్కుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుపుకోవాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు దీని గురించి తెలిపి వారిని సైతం ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ కామారెడ్డి బ్రాంచ్‌ మేనేజర్‌ శివరాజ్‌, కళాశాల ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, సైదయ్య, గంగాదర్‌, భూమేశ్‌, ప్రభాకర్‌, రవి, మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం నాల్గ‌వ ఆర్థిక ప్యాకేజీ రెండు ల‌క్షల‌కోట్లు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *