Breaking News

పన్ను రేట్లు తగ్గాలి

  • ఐఆర్‌ఎస్‌ ట్రెయినీల సమావేశంలో అరుణ్‌ జైట్లీ
ఫరీదాబాద్‌ : భారత ఆర్థిక రంగం మరింతగా విస్తరించాలంటే అంతర్జాతీయంగా అమల్లో ఉన్న పన్ను రేట్లకు దీటుగా తక్కువ స్థాయిలో పన్నులుండాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పన్నులు ఎంత ఎక్కువగా ఉంటే అంత భారీగా ఆదాయం వస్తుందనే సిద్ధాంతానికి కాలం చెల్లిందని, 1991 నుంచి ఆర్థిక రంగం గతి మారిందని ఆయన వ్యాఖ్యానించారు. వస్తుసేవలు అంతర్జాతీయ పోటీని తట్టుకోగల విధంగా ఉండాలంటే పన్ను రేట్లు కూడా అంత తక్కువగానే ఉండాలన్నారు. సోమవారం ఐఆర్‌ఎస్‌ అధికారుల వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ… పోటీ దేశీయం కాదు, అంతర్జాతీయం అన్న సిద్ధాంతం ఆధారంగానే గత రెండున్నర దశాబ్దాలుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వాదాయాలకు నష్టం కలిగినా సరే పన్నులు ఎగవేయడంలో ఎలాంటి అనైతికత లేదనే ధోరణి గత ఏడు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నదని ఆయన అన్నారు. ఇది ఎంతో తెలివైన అడుగు అనుకుంటారని, కాని వారిలో కొందరు ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. రెవిన్యూ సర్వీసుల్లో ప్రవేశిస్తున్న యువ అధికారులు రానున్న దశాబ్దాల్లో భారతలో స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగేలా చూడాలని ఆయన సూచించారు.

న్యాయబద్ధమైన పన్నుల చెల్లించడం తమ బాధ్యత అని ప్రజలు భావించే వాతావరణం ఉండాలని, అదే సమయంలో పన్ను చెల్లింపుదారులను అధికారులు విశ్వసించాలని ఆయన అన్నారు. తప్పు జరిగినట్టు గట్టి అనుమానం ఉన్న కేసుల్లో మాత్రమే మరింత లోతుగా పరిశీలన నిర్వహించాల్సిఉంటుందన్నారు. కేంద్రరాష్ర్టాల పరోక్ష పన్నులు విలీనం అయిపోతున్న ఈ తరుణంలో పన్నులు వసూలు చేసే విధులు నిర్వర్తిస్తున్న అధికారులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని జైట్లీ సూచించారు. ప్రధానంగా జిఎ్‌సటి అమలుతో కొత్తగా నెలకొనబోతున్న వాతావరణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య సహకారం అత్యున్నత ప్రమాణాలతో కూడినదై ఉండాలని ఆయన అన్నారు. విధానాల్లో ప్రామాణికత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఉల్లంఘనలను కనిపెట్టడం వంటి అంశాల్లో అత్యున్నత స్థాయి పర్యవేక్షక నైపుణ్యాలు అవసరమని ఆయన సూచించారు. క్రిమినల్‌, పన్ను చట్టాల్లో ఎలాంటి లోపాలు లేనందు వల్ల ఉల్లంఘనలు గుర్తించడంలో కట్టుదిట్టమైన విధానాలు అనుసరించాలని జైట్లీ అన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *