Breaking News

ఉరిశిక్షపై హైకోర్టులో సవాల్ చేసిన దిల్‌సుఖ్‌నగర్ నిందితులు

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు నిందితులు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మూడున్నరేళ్లపాటు సాగిన విచారణకు తెరదించుతూ ఎన్ఐఏ కోర్టు నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జివుర్ రెహ్మన్, మహ్మద్ తహసీన్ అక్తర్, అజాద్ షేక్‌లను దోషులుగా తేలుస్తూ వారికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు కాపీని హైకోర్టుకి పంపింది. ఈ తీర్పును హైకోర్టు నిర్థారించాకే శిక్ష అమలు చేయనుంది. ఈ తీర్పును పరిశీలించిన హైకోర్టు రెఫర్ ట్రయల్ కేసును నమోదు చేసింది.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *