Breaking News

నోట్లరద్దు ప్రభావం ఓట్లపై ఉంటుందా?

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే ఎన్నికల వాతా వరణం కమ్ముకొంటోంది.ఈ రాష్ట్రం లో ఎలాగైనా పాగావేయాలని బిజెపి విశ్వప్రయత్నం చేస్తుండగా తాము ఏ మాత్రం వెనుకాడబోమని విప క్షాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఈరాష్ట్రంలో మెజారిటీ స్థానా లు సాధించుకోడానికి గట్టిగా వ్యూహా లు రచిస్తోంది. బిజెపి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్టీ కార్యకర్తల నుంచి ఎంపిల వరకు సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు రాజకీయ వాతావరణాన్ని విశ్లేషిస్తున్నారు. ప్రధానిమోడీ ఆరాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, సమాజ్‌వాది అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సభల్లో ప్రచా రాలు హోరెత్తిస్తున్నారు.ఇక విమర్శలకు,ప్రతి విమర్శ లకు ప్రకంపనలకు లోటేలేదు. అయితే విపక్షాలకు పెద్దనోట్ల రద్దు, దీనిపై జనం పాట్లు ప్రచారాస్త్రాలుగా పదునెక్కిస్తున్నాయి.

ప్రజలను ఆకట్టుకునేలా ఈ సమ స్యలువిపక్షాలకు ఉపయోగపడుతున్నాయి. బ్యాంకుల చుట్టూ జనంతిరుగుతూ క్యూలైన్లలో పడిగాపులు కాయడాన్ని విపక్షాలు కళ్లకుకట్టినట్టు చూపిస్తూ మోడీ పై విరుచుకుపడుతున్నాయి.విపక్షాల విమర్శల దాడికి మోడీ ఏ మాత్రం బెదరకుండా అవినీతిని, నల్లడబ్బు ను కూకటివేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఎన్ని ఇక్కట్లు ఎదురైనా జనం తమకు మద్దతుగానే అర్థంచేసుకొంటున్నారని సమర్థించుకొం టున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపి ఎంపిలు కార్యకర్తలు అధిష్ఠానం వద్దకు వెళ్లి నోట్లరద్దుతో జనం అసహనంగా ఉంటున్నారని,ఈ సమస్యను పరిష్కరిం చకుంటే తీవ్రవ్యతిరేకత వస్తుందని తాముకూడా ప్రజ లకు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడు తోందని అగ్రనేతల ముందు విన్నవిస్తున్నారు. కమలనాధుల శిబిరంలో మాత్రం కలవరం తగ్గడం లేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధవిభాగం భారతీయ లఘు ఉద్యోగ రైతుల, కార్మికులు,వ్యవసాయకూలీలు, చిన్న తరహా పరిశ్రమలయూనిట్లు కార్మికులు తీవ్ర ఇబ్బందు లను ఎదుర్కొంటుడడంతో రానున్న ఎన్నికల్లో పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం కలిగించదని వివరిస్తున్నా రు.

కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అలాగే నగదురహిత సమాజం లక్ష్యం కూడా జనాలకు ఇష్టం కావడం లేద ని భారతీయ లఘు ఉద్యోగ సంఘ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ మిట్టల్‌ వెల్లడించారు. అసంఘటిత రంగంలోని రైతులు,కూలీలు నగదు చెలామణియే కావాలని కోరు కుంటున్నారని పేర్కొన్నారు.బ్యాంకుల్లో నగదులభ్యత పెంచడానికి బదులు భవిష్యత్తు ప్రయోజనాలపై మాట్లాడితే జనం హర్షించబోరని హెచ్చరిస్తున్నారు. విపక్షాలు ఈ సందర్భంగా ఎంతో అప్రమత్తంగా వ్యవ హరిస్తున్నాయని బిజెపి ఎంపిలు అగ్రనేతలకు వెల్ల డించారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఇదితగిన వాతావరణంకాదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా చండీగడ్‌మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపి విజయభేరీ మోగించడం బిజెపికి ఆశాకిరణం అయ్యింది. దీన్ని సాకుగా చూపిస్తు ప్రజలు తమవైపే ఉన్నారని అమిత్‌షా వంటి వారు ధీమా వ్యక్తం చేస్తు న్నారు.చండీగడ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 20 డివిజన్ల ను బిజెపి గెలుచుకోగా, బిజెపి మిత్రపక్షమైన అకాలీ దల్‌ ఒకటి, కాంగ్రెస్‌ నాలుగు డివిజన్లు సాధించాయి. అంటే బిజెపి కూటమికి మొత్తం 26 సీట్లలో 21 దక్కాయి.ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆలం ఖాన్‌వివాదం బిజెపికి మరోఆయుధంగా తయారైంది. బులందషహార్‌ అత్యాచార సంఘటనపై మంత్రి వివా దస్పద వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పాశవిక బులందషహార్‌ సంఘటన జూలై 29 రాత్రి జరిగింది. హైవే దొంగలముఠా జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఆపి అందులోని మహి ళను,ఆమె కూతురుని రోడ్డుపైకి ఈడ్చుకువెళ్లి అత్యా చారం జరిపారు.

ఈ సంఘటనపై మంత్రి ఇదంతా రాజకీయ కుతంత్రంగా వ్యాఖ్యానించారు. సాక్షాత్తు మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించపడాన్ని సుప్రీం కోర్టు ఆగస్టు29న పరిగణనలోకి తీసుకుంది.నవంబరు 17నమంత్రి షరతులులేని రాజీనామా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై యుపి అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఈ అంశంపై గందరగోళం చెలరేగింది. బిజెపితోపాటు బిఎస్‌పి సభ్యులు సభ మధ్యలోకి దూసుకుపోయి మంత్రి రాజీనామాకు డిమాండ్‌ చేశారు. భష్టాచారి -కిసాన్‌ విరోధి సర్కార్‌ అనే నినాదంతో కూడిన బ్యానర్‌ను బిఎస్‌పి సభ్యులు ప్రదర్శించారు.రాష్ట్రంలోశాంతిభద్రతలు అధ్వాన్నంగా తయారయ్యాయని బిజెపి దుమ్మెత్తిపోసింది.

దీంతో స్పీకర్‌ సభను ఎన్నిసార్లువాయిదా వేసినా సభ్యులు శాంతించలేదు.మంత్రికిసభలో కూర్చొనే నైతిక హక్కు లేదని ఆయన రాజీనామా చేయడంమాత్రమే సమంజ సమని పేర్కొన్నారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ ప్రభు త్వానికి తీరని కళంకంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నోట్లరద్దు ఏపార్టీకి ఓట్లను సమకూర్చు తుందోఅలాగే స్థానికరాజకీయాలు యుపి మంత్రివర్గం లోని అంతర్గత కుమ్ములాటలు తాజా పరిణామాలు ఎంతవరకు ఆ ప్రభుత్వాన్ని నష్టపరుస్తాయో రాజ కీయ పరిశీలకులు సరిగ్గాబేరీజు వేయలేకపోతున్నారు. ఏదిఏలాగైనా యుపి ఎన్నికల గోదా మాత్రం అటు బిజెపికి,ఇటు బిఎస్‌పికి,ఎస్‌పికి, కాంగ్రెస్‌కు అగ్నిపరీ క్షగా మారింది. ఈ రాజకీయ రంగులు చివరకు ఏ విధంగా మారుతాయో చెప్పలేం.

Check Also

లక్కీ లాటరీ నడుపుతున్న ఇద్దరిపై కేసు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ ...

Comment on the article