Breaking News

మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి ఒక్కరు శ్రద్ద చూపాలి

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి ఒక్క వ్యక్తి శ్రద్ద చూపించాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో మహిళా సమాఖ్యసమావేశంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌తోపాటు ఆయన పాల్గొన్నారు. మహిళా రుణాలను త్వరితగతిన చెల్లించాలని, బ్యాంకు లింకేజీలు, తదితర అంశాల్లో ఐకెపి సిఎలు చొరవ చూపించాలని ఆయన సూచించారు. వీరితోపాటు నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్కరు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేలా సిఎలు, సిసిలు ప్రయత్నించాలని ఆయన కోరారు. మరుగుదొడ్ల వల్లఉపయోగాలను గ్రామీణ కుటుంబాలకు తెలియజేయాలని, ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్క కుటుంబానికి తెలపాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎపిఎం గంగాధర్‌, మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాజీ ఎమ్మెల్సీని పరామర్శించిన మాజీ ఎంపి కవిత

బాన్సువాడ, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నేత అరికెల‌ నర్సారెడ్డి మాతృమూర్తి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *