Breaking News

బీడీ కార్మికులకు నగదు వేతనాలు అందించాలి

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా నగదు రూపంలో కమీషన్‌ ఏజెంట్ల ద్వారానే వేతనాలు అందించాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌, తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తక్క డిమాండ్‌ చేశారు. ఏర్గట్ల తహసీల్‌ కార్యాలయం ముందు 7 గ్రామాల బీడీ కార్మికులతో రాస్తారోకో, ధర్నా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహసీల్దార్‌కు అందజేశారు. బీడీ కార్మికుల్లో అధిక శాతం చదువురాని వారు ఉన్నారని, వారికి ఆరునెలల పాటు గ్రామాల్లోనే అధికారులు చదువు నేర్పించి, ఎటిఎంలు ఏర్పాటు చేసి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఖాతాల్లో డబ్బు జమచేయాలని, అప్పటి వరకు నేరుగా వేతనాలు అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కిషన్‌, సారాసురేశ్‌, డాక్టర్‌ సత్యనారాయణ, ఎం.నారాయణ, జమున, ఆయా గ్రామాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *