Breaking News

రైతన్నలకు ఆర్‌బీఐ తీపి కబురు

  • పంట రుణాల చెల్లింపు గడువు 60 రోజులు పెంపు
 నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లపాలవుతున్న రైతన్నలకు ఆర్‌బీఐ కాసింత ఉపశమనం కల్పించింది. పంట రుణాల చెల్లింపు గడువును అదనంగా మరో 60 రోజులు పొడిగించింది. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించే వారు ఈ పొడిగించిన 60 రోజుల్లో తమ అప్పులను కడితే.. వడ్డీపై 3 శాతం అదనపు సబ్సిడీ పొందేందుకు కూడా అర్హులని సోమవారం ప్రకటించింది. 2006-07 నుంచి రైతుల స్వల్ప రుణాలపై వడ్డీని కేంద్రమే భరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం 2 శాతం వడ్డీ వరకు కేంద్రమే చెల్లిస్తోంది. రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు అదనంగా మరో 3 శాతం వడ్డీ సబ్సిడీని భరిస్తోంది. ప్రస్తుతం నోట్ల రద్దుతో రైతన్నలు రుణ చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సకాలంలో రుణాలు చెల్లిస్తున్న రైతులు కూడా కష్టాలు తప్పట్లేదు. రుణాలు తిరిగి చెల్లించే స్థోమత ఉన్నా.. నోట్ల రద్దు కారణంగా చేయలేకపోతున్నారు. దాంతో వారు కేంద్రం అందించే సబ్సిడీని కోల్పోవాల్సి వస్తోంది. నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 మధ్యకాలంలో రుణాలు చెల్లించాల్సిన రైతులు అలా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు రుణ చెల్లింపుల గడువును పొడిగించినట్ల్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ గ్రేస్‌ పీరియడ్‌లో రుణాలు చెల్లించేవారికి వడ్డీ సబ్సిడీ వర్తిస్తుందని తన నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *