Breaking News

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

 

– జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాఏర్పడిన తర్వాత జరిగే మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విజయవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గణతంత్ర వేడుకలను కామారెడ్డిలోని స్టేడియంలో నిర్వహించనున్నామని, భూమిని చదునుచేసి వాటికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. వివిద శాఖలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేసేందుకు స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పథకాలను వివరించేవిధంగా శకటాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్టు, జాబితా సిద్దం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, డిఇవో మదన్‌మోహన్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *