Breaking News

‘మందు’లో తెలుగు రాష్ర్టాలే ముందు!

  • ఆదాయంలో రెండంకెల వృద్ధి 
  • తెలంగాణ 16.15 శాతం, ఏపీ 11.28 శాతం 

తెలుగు రాష్ర్టాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజనానంతరం పలు రంగాల్లో రెండు రాష్ర్టాలూ వెనుకబడిపోయినా మద్యం విక్రయాల్లో మాత్రం దూసుకుపోతున్నాయి! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ కూడా సరిహద్దు రాష్ర్టాలతో పోలిస్తే ఈ విషయంలో ముందే ఉండడం గమనార్హం. ఏపీతో పోలిస్తే తెలంగాణ మద్యంలో మరింత ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు మద్యం అమ్మకాలు, ఆదాయాన్ని సరిహద్దు రాష్ర్టాలతో ఏపీ అబ్కారీ శాఖ విశ్లేషించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల పరిస్థితిని అధ్యయనం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తెలంగాణ అత్యధికంగా 16.15 శాతం ఆదాయంలో వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత ఏపీ 11.28 శాతం, తమిళనాడు 8.33 శాతం, కేరళ 7.7 శాతం, కర్ణాటక 7.05 శాతం వృద్ధి సాధించాయి. తెలంగాణ.. 2015-16లో ఏప్రిల్‌ నుంచి నవంబరు మధ్య రూ.7,822 కోట్ల ఆదాయం సాధించగా.. ఈ ఏడాది రూ.9,085 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే ఏపీలో గతేడాది రూ.8,198 కోట్ల ఆదాయం రాగా… ఈ ఏడాది రూ.9,123 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీలో బీరు అమ్మకాలు ఊపందుకోగా, తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుమీదున్నాయి.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *