Breaking News

సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతల తీర్మానం

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం జరిగింది. సభలో గుమ్మిర్యాల్‌, దోంచంద గ్రామాలకు చెందిన ఎంపిటిసి గడ్డం లింగారెడ్డి, ఏర్గట్ల గ్రామాన్ని మండలంగా చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మోర్తాడ్‌ ఎంపిటిసి మురళీగౌడ్‌ బలపరిచారు. దీంతో రెండు మండలాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించారు. మోర్తాడ్‌లోని 30 పడకల ఆసుపత్రి వృధాగా ఉందని, ఎన్నోసార్లు తీర్మానాలు చేసినప్పటికి ప్రసవాలు జరగడం లేదని, ఇతర ప్రాంతాల్లో చేస్తుంన్నారని, మోర్తాడ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా, పిల్లల వైద్యుని, మహిళా వైద్యురాలిని నియమించాలని సభ్యులు అధికారుల దృస్టికి తెచ్చారు. ఆయాశాఖలకు చెందిన అధికారులు సభలో మండలంలోనిఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనులను, సబ్సిడీ పథకాలను చదివి వినిపించారు. కార్యక్రమంలో జడ్పిటిసి అనిత, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *