Breaking News

ఈనెల 29న మోర్తాడ్‌కు రైలురాక

 

– జనవరి 1 నుంచి మోర్తాడ్‌ నుంచి సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ వరకు

మోర్తాడ్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జగిత్యాల్‌, మెట్‌పల్లి, కోరుట్ల, మోర్తాడ్‌ ప్రజల కల ఎట్టకేలకు ఈనెల 29న నెరవేరనుంది. సిర్పుర్‌ నుంచి రైలు వస్తుందని జగిత్యాల్‌, మెట్‌పల్లిలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రారంభిస్తారని, సాయంత్రం 4 గంటల సమయంలో మోర్తాడ్‌కు రైలు చేరుకుంటుందని, రిమోట్‌ ద్వారా కేంద్రమంత్రి రైలు ప్రారంభిస్తారని మోర్తాడ్‌ రైల్వేస్టేషన్‌ మాస్టర్లు కృష్ణప్రసాద్‌, సంతోష్‌లు మంగళవారం తెలిపారు. 29న ప్రారంభమయినప్పటికి జనవరి1వ తేదీ నుంచి ప్రతిరోజు రైలు మోర్తాడ్‌ నుంచి సిర్పుర్‌ వరకు నడుస్తుందని తెలిపారు. ఉదయం 4 గంటలకు మోర్తాడ్‌ నుంచి సిర్పుర్‌కు రైలు ఉంటుందన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *