Breaking News

పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు

 

గాందారి, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీని గ్రామస్థాయిలో అభివృద్ది చేయడానికి కార్యకర్తలకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొట్టమొదటిసారిగా గాంధారికి విచ్చేసిన ఆయనకు మండల బిజెపి నాయకులు ఘన సత్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఈనెల 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ వరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల, డివిజన్‌, నియోజకవర్గ స్థాయి బిజెపి కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు. దేశ ప్రధాని మోడి సంస్కరణలు దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళుతున్నాయన్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో పాటు, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారన్నారు. రెండున్నర సంవత్సరాల మోడి అధికారంలో దేశాన్ని అభివృద్దిలో పెట్టడానికి, నల్లధనం వెలికితీయడానికి నోట్ల రద్దు చేపట్టారన్నారు. నోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్‌గాంధీకి మోడిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.

కామారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా గాంధారి మండలం దుర్గం గ్రామానికి చెందిన మోజిరాం నాయక్‌ను ఎన్నుకున్నట్టు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకముంచి జిల్లా బాధ్యతలు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పోతంగల్‌ కిషన్‌రావు, సాయిబాబా, బాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, హుస్సేన్‌, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *