Breaking News

కాలువకు బుంగ… నీరు వృధా…

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో నీరు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ 0 డిస్ట్రిబ్యూటరీ కాలువలో ముళ్లపొదలు, మట్టి పూడికతీయకపోవడంతో బుంగలుపడి సాగునీరు వృధా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్తితుల కారణంగా భూములు బీడుగా మారాయని, పిచ్చిమొక్కలు పెరిగాయని రైతులు తెలిపారు. మూడేళ్ల క్రితమే కాలువ తూము ఆధునీకరణ పనులు చేపట్టినట్టయితే చివరి ఆయకట్టు వరకు సాగునీరు వేగవంతంగా చేరేదని రైతులు అంటున్నారు. 0 డిస్ట్రిబ్యూటరీ కాలువ నీరు హసన్‌పల్లి గ్రామ మద్య నుంచి పంట కాలువ ఉండడంతో మట్టి పూడుకుపోయి బొగ్గు గుడిసె సమీపంలోగల పంట పొలాలకు నిజాంసాగర్‌ నీరు అందడంలేదు. కాలువలోపూడిక పేరుకుపోవడంతో రైతులు లిఫ్టు ఏర్పాటు చేసుకొని పంటసాగు చేసుకుంటున్నారు. కాలువనీటికి కరెంటుతో సంబందం లేకుండా 24 గంటల పాటు సాగునీరు పారించుకోవచ్చని రైతులు అంటున్నారు. విద్యుత్తు ఉంటేనే లిఫ్టు మోటారు ద్వారా భూములకు నీరు పారించవచ్చంటున్నారు. కరెంటుతో సంబంధం లేకుండా పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Check Also

కుక్క దాడి – పలువురికి గాయాలు

నిజాంసాగర్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సాతేల్లి గ్రామంలో శనివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *