Breaking News

ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు

ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో పొడి వాతావరణం కొనసాగుతోంది. వచ్చే మూడు, నాలుగు రోజుల వరకు ఇదే మాదిరి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉత్తర భారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో తెలుగు రాషా్ట్రల్లో చలి తీవ్రత కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కోస్తాలో చలి ప్రభావం ఎక్కువగా వుంది. మంగళవారం ఆదిలాబాద్‌లో ఐదు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *