Breaking News

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ తెరాస పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కల్లడ ఏలియా ఆధ్వర్యంలో గృహ నిర్మాణ లబ్దిదారుల రుణమాఫీ సిఎం కెసిఆర్‌ చేయడం వల్ల పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటానికి మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణానందం, మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సొసైటీ ఛైర్మన్‌లు, నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1983 నుంచి 2014లోపు ఇందిరమ్మ, రాజీవ్‌గృహ కల్ప, దళిత, బడుగు, బలహీన, మైనార్టీ, మత్స్య, బీడీ కార్మికుల గృహ నిర్మాణాలకు అందించిన గత ప్రభుత్వాల రుణాలు సిఎం కెసిఆర్‌ మాఫీ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని వారన్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *