Breaking News

విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటం

 

కామారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమలకు సిద్దం కావాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్‌ కామారెడ్డి జిల్లా నిర్మాణ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్తి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో చదువులు ఆపేసే పరిస్థితి నెలకొందన్నారు. కెజి నుంచి పిజి ఉచిత విద్య అందిస్తామని చెప్పిన కెసిఆర్‌ ప్రయివేటు యూనివర్సిటీలకు ద్వారాలు తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం సమంజసం కాదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో 30 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు దశరథ్‌, భానుప్రసాద్‌, సుధీర్‌, పృథ్విరాజ్‌, ప్రవీణ్‌, నరేశ్‌, ప్రసాద్‌, షబ్బీర్‌, సంజీవ్‌,సందీప్‌ తదితరులున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *